The Warrior: యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న బుల్లెట్ సాంగ్.. సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన రామ్ పోతినేని..

|

Apr 27, 2022 | 6:40 AM

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) ప్రస్తుతం ఫుల్ జోరు మీదున్నాడు. రెడ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ హీరో

The Warrior: యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న బుల్లెట్ సాంగ్.. సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన రామ్ పోతినేని..
The Warrior
Follow us on

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) ప్రస్తుతం ఫుల్ జోరు మీదున్నాడు. రెడ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ హీరో ప్రస్తుతం ది వారియర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి తెరకెక్కిస్తున్న ఈ మూవీలో రామ్ సరసన కృతి శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాను తమిళ, తెలుగు భాషల్లో రూపొందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి, అక్షరా గౌడ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాను జూలై 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే సినిమా నుంచి వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. ఇక ఇటీవల విడుదల చేసిన బులెట్ సాంగ్ యూట్యూబ్‏లో దూసుకుపోతుంది.

తెలుగు, తమిళ్ భాషలలో కలిపి ఈ సాంగ్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటివరకు ఈ పాట 15 మిలియన్ల వ్యూస్‏లో ట్రెండింగ్‏లో కొనసాగుతుంది. ఈ పాటను తమిళ స్టార్ హీరో శింబు ఆలపించగా.. శ్రీమణి సాహిత్యం అందించారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ పాటలో రామ్, కృతి శెట్టి స్టెప్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట ట్రైలర్ అప్డేట్ ఇచ్చిన తమన్.. స్కోర్ స్టార్ట్ అంటూ పోస్ట్..

Viral Photo: చంద్రబింబంలాంటి ఈ చిన్నది.. హీరోయిన్ మాత్రమే కాదు.. నిర్మాతగానూ రాణిస్తోంది.. ఎవరో గుర్తుపట్టండి..

RRR: ఎత్తర జెండా ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది.. అదరగొట్టిన చరణ్, తారక్..

Salaar Movie: ప్రభాస్ కోసం ప్రశాంత్ నీల్ భారీ ప్లాన్.. ఇంటర్వెల్ సిక్వెన్స్ కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారో తెలుసా..