AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sivaji Raja: వాడికి చచ్చే కుళ్లుబోతోడు.. సినిమా సెట్‌లోనే చుక్కలు చూపించా: శివాజీ రాజా

హీరోగా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా మెప్పించిన శివాజీరాజా గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. 35 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్న ఆయన దాదాపు 400 వందల సినిమాల్లో నటించి ఆకట్టుకున్నరు. ఇటు వెండి తెరపై అటు బుల్లి తెరపై తన నటనతో మెప్పించారు.

Sivaji Raja: వాడికి చచ్చే కుళ్లుబోతోడు.. సినిమా సెట్‌లోనే చుక్కలు చూపించా: శివాజీ రాజా
Shivaji Raja
Rajeev Rayala
|

Updated on: Oct 27, 2026 | 7:57 AM

Share

ప్రముఖ నటుడు శివాజీ రాజా తన చిరకాల మిత్రుడు, సహనటుడు ఉత్తేజ్‌తో తనకున్న అనుబంధం గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.  ఉత్తేజ్‌ను “చిన్నపిల్లాడి మనస్తత్వం” గల వ్యక్తిగా, కొంత “కుళ్ళు” స్వభావం కలవాడిగా శివాజీ రాజా సరదాగా అన్నారు. ఆయన ఉత్తేజ్‌ను అనేక సందర్భాల్లో ఎలా ఆటపట్టించారో, ఆ సంఘటనలు ఎలా హాస్యాన్ని పంచాయో కూడా ఈ ఇంటర్వ్యూలో వివరించారు. శివాజీ రాజా మాట్లాడుతూ.. ఓ సంఘటన గురించి వివరిస్తూ.. చక్రి (జేడీ చక్రవర్తి) సినిమా సెట్‌లో జరిగింది. చక్రి ప్రొడ్యూసర్‌గా, హీరోగా ఉన్న ఆ సినిమాలో శివాజీ రాజా, ఉత్తేజ్ ఇద్దరూ నటిస్తున్నారు. చక్రికి, శివాజీ రాజాకు మధ్య స్నేహం ఉన్నప్పటికీ, శివాజీ రాజా ఆ సినిమాలో ఒక కమర్షియల్ ఆర్టిస్ట్‌గానే నటించారట. ఉత్తేజ్ చాలా కాలంగా చక్రిని 15,000 రూపాయలు అడుగుతున్నాడు, అది అద్దె, పాల బిల్లుల కోసం. కానీ చక్రి ఇవ్వడం లేదు. ఈ విషయంపై ఉత్తేజ్ శివాజీ రాజా వద్ద మొరపెట్టుకుంటున్నాడట. శివాజీ రాజా దీన్ని అవకాశంగా తీసుకుని, ఉత్తేజ్ ఎదురుగా చక్రిని 60,000 రూపాయలు అడిగారట, అది ఒక కొత్త కారు అడ్వాన్స్‌కు అని చెప్పి. చక్రి వెంటనే ఆ డబ్బు ఇచ్చేశారు. దీన్ని చూసి ఉత్తేజ్ తీవ్ర అసూయ, కోపంతో కుళ్ళిపోయాడు. సినిమా సెట్ లో ఉన్న వాళ్ళందరి దగ్గరకు వెళ్లి చెప్పుకున్నాడట. ఈ మొత్తం సంఘటన ఉత్తేజ్‌ను ఆటపట్టించడానికి శివాజీ రాజా చేసిన ఒక ప్లాన్ అని తర్వాత చెప్పారట

మరొక సంఘటనలో, ప్రకాష్ రాజ్ దర్శకత్వం వహించిన ఒక చిత్రంలో, శివాజీ రాజా పాత్రకు ఉత్తేజ్ డబ్బింగ్ చెప్పాల్సి వచ్చింది. ఆ సమయంలో శివాజీ రాజా మా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్. శివాజీ రాజా వెంటనే ఉత్తేజ్‌కు ఫోన్ చేసి, “నేను వంద సినిమాలు చేశాను, నువ్వెలా నాకు డబ్బింగ్ చెప్తావు?” అని సరదాగా బెదిరించారట. ఉత్తేజ్ “ప్రకాష్ సార్ చెప్పారు” అని సర్ది చెప్పడానికి ప్రయత్నించగా, శివాజీ రాజా కోపంగా ఫోన్ పెట్టేశారట. అలాగే మురళీ మోహన్, దాసరి నారాయణ రావు వంటి పెద్దలను కూడా ఈ సరదాలో భాగం చేశారు శివాజీ రాజా. దాసరి గారికి ఫోన్ చేసి, ఉత్తేజ్ సభ్యత్వాన్ని రద్దు చేస్తామని చెప్పమని అన్నారట. దీనితో ఉత్తేజ్ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఉత్తేజ్ భార్య పద్మ శివాజీ రాజాకు ఫోన్ చేసి, ఉత్తేజ్‌కు జ్వరం వచ్చిందని, ఆయనను వదిలేయమని కోరిందట. దాంతో శివాజీ రాజా జరిగిన విషయం ఆమెకు చెప్పారట. ఆ తర్వాత ఒకరోజు, ఉత్తేజ్ శివాజీ రాజా ఇంటికి బొకేతో వచ్చి, “నన్ను వదిలేయ్, ఇంకెప్పుడూ ఇలాంటి ప్రాక్టికల్ జోక్స్ చేయను” అని వేడుకున్నాడు.

ఈ సంఘటనలన్నీ ఉన్నప్పటికీ, ఉత్తేజ్ శివాజీ రాజాపై తనకున్న లోతైన ప్రేమ, గౌరవాన్ని వ్యక్తం చేశారు. శివాజీ రాజా తన “స్నేహితుడు, తత్వవేత్త, మార్గదర్శి” అని పేర్కొన్నారు. శివాజీ రాజా తనను ఆటపట్టించడం వెనుక ఎంతో ప్రేమ ఉందని, తనపై శ్రద్ధ వహించే వ్యక్తి అని ఉత్తేజ్ చెప్పారు. ఉత్తేజ్ కూడా శివాజీ రాజా చేసిన కొన్ని ఆటపట్టింపులను గుర్తుచేసుకున్నారు. “వినోదం” సినిమా పాట షూటింగ్‌లో, తనకు ఈత రాదని తెలిసినా, శివాజీ రాజా తనను స్విమ్మింగ్ పూల్‌లోకి దూకేలా చేశారని గుర్తుచేసుకున్నారు. అలాగే, “కౌరవుడు” షూటింగ్ సమయంలో, శివాజీ రాజా దున్నపోతు మాస్క్ ధరించి తనను భయపెట్టి, 5000 రూపాయలను ఒక గదిలో పెట్టానని చెప్పి, ఆ గదిలోకి వెళ్ళడానికి భయపడేలా చేశారని వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us