AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

343 కి.మీ రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్! Ultraviolette X-47 Venom పూర్తి వివరాలు మీకోసమే

ఎలక్ట్రిక్ బైక్ విభాగంలో తనదైన గుర్తింపు తెచ్చుకుంటున్న Ultraviolette Automotive మరో కొత్త మోడల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. Ultraviolette X-47 Venom పేరుతో విడుదలైన ఈ బైక్ కొత్త VX-100 ప్లాట్‌ఫామ్‌పై రూపొందింది. రూ.2.65 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చిన ఈ మోడల్ టాప్ వేరియంట్ ధర రూ.4.12 లక్షలుగా ఉంది. మొదటి 5,000 మంది కొనుగోలుదారులకు మాత్రమే ఈ ప్రారంభ ధరలు వర్తిస్తాయని కంపెనీ తెలిపింది. ఆ తర్వాత వేరియంట్‌ను బట్టి ధరలు రూ.35,000 వరకు పెరగనున్నాయి.

343 కి.మీ రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్! Ultraviolette X-47 Venom పూర్తి వివరాలు మీకోసమే
New Ultraviolette X 47 Venom Electric Bike
Nikhil
|

Updated on: Oct 27, 2026 | 7:30 AM

Share

కొత్త ప్లాట్‌ఫామ్‌తో బరువు తగ్గించడంతో పాటు ప్రయాణ పరిధిని పెంచినట్లు సంస్థ వెల్లడించింది. బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి 227 కిలోమీటర్ల నుంచి 343 కిలోమీటర్ల వరకు క్లెయిమ్ చేసిన రేంజ్‌ను అందిస్తుంది. వేగవంతమైన యాక్సిలరేషన్, రైడర్ అసిస్టెన్స్ టెక్నాలజీ, డిజిటల్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఈ బైక్‌లో ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. బుకింగ్‌లు ప్రారంభం కాగా, డెలివరీలు నవంబర్‌లో మొదలుకానున్నాయి.

VX-100 ప్లాట్‌ఫామ్..

Ultraviolette X-47 Venomలో కొత్త VX-100 ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించారు. దీని వల్ల బైక్ బరువు తగ్గడంతో పాటు రేంజ్ మెరుగుపడిందని కంపెనీ పేర్కొంది. 7.5kWh బ్యాటరీ కలిగిన బేస్ వేరియంట్ బరువు 180 కిలోలు. గత 7kWh మోడల్‌తో పోలిస్తే ఇది 17 కిలోలు తక్కువ. 11kWh బ్యాటరీతో వచ్చే టాప్ Recon వేరియంట్ బరువు 195 కిలోలు కాగా, పాత మోడల్ కంటే 13 కిలోలు తగ్గింది.

బేస్ వేరియంట్ ఒక్కసారి ఛార్జింగ్‌తో 227 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. టాప్ వేరియంట్ క్లెయిమ్ చేసిన రేంజ్ 343 కిలోమీటర్లు. వాస్తవ ప్రయాణ పరిధి రైడింగ్ శైలి, వేగం, రహదారి పరిస్థితులు, వాతావరణం వంటి అంశాలపై ఆధారపడి మారవచ్చు.

రాడార్ టెక్నాలజీ

X-47 Venom Recon వేరియంట్ గరిష్ఠంగా 40hp పవర్, 90Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 0 నుంచి 60kmph వేగాన్ని 2.7 సెకన్లలో, 0 నుంచి 100kmph వేగాన్ని 5.9 సెకన్లలో అందుకుంటుందని కంపెనీ తెలిపింది. బాలిస్టిక్ రైడ్ మోడ్‌ను బ్యాటరీ ఛార్జ్ 10 శాతం వరకు ఉపయోగించుకోవచ్చు. రీజెనరేటివ్ బ్రేకింగ్ వ్యవస్థ 99 శాతం ఛార్జ్ స్థాయిలో కూడా పనిచేస్తుందని సంస్థ పేర్కొంది.

క్రూయిజ్ కంట్రోల్, కెమెరా పార్కింగ్ అసిస్టెన్స్, 7 అంగుళాల TFT డిస్‌ప్లే వంటి ఫీచర్లు టాప్ మూడు వేరియంట్లలో లభిస్తాయి. డ్యూయల్ ఛానల్ ABS, ట్రాక్షన్ కంట్రోల్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి భద్రతా వ్యవస్థలు కూడా ఉన్నాయి. హై వేరియంట్లలో రాడార్ ఆధారిత UV Hypersense, ఇంటిగ్రేటెడ్ డాష్‌క్యామ్ అందుబాటులో ఉంటాయి. ఈ బైక్ Venom, Venom+, Venom Recon, Venom Recon+ అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. బ్యాటరీ సామర్థ్యం, ఛార్జర్, కలర్‌ను బట్టి ధర మారుతుంది.

Follow Us