AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND Vs NZ: ఫ్యాన్ ముందు బౌలింగ్ ప్రాక్టీస్ చేయాలా? టీమిండియా కోచ్ సలహా వెనుక అసలు కారణం ఇదే

IND Vs NZ: న్యూజిలాండ్‌లోని వెల్లింగ్టన్‌లో బలమైన గాలులను ఎదుర్కొనేందుకు భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ ఆటగాళ్లకు ఆసక్తికరమైన సలహా ఇచ్చారు. ఇంట్లో బలమైన ఫ్యాన్ ముందు నిలబడి ప్రాక్టీస్ చేయాలని సరదాగా సూచించారు.వినడానికి వింతగా అనిపించినా, వెల్లింగ్టన్‌లో గాలుల ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో ఆయన మాటలు తెలియజేస్తున్నాయి.

IND Vs NZ: ఫ్యాన్ ముందు బౌలింగ్ ప్రాక్టీస్ చేయాలా? టీమిండియా కోచ్ సలహా వెనుక అసలు కారణం ఇదే
Morne Morkel
Rakesh
|

Updated on: Oct 27, 2026 | 7:44 AM

Share

IND Vs NZ: భారత్‌-న్యూజిలాండ్ క్రికెట్ పోరులో ఆటగాళ్లకు మరో కొత్త సవాల్ ఎదురుకానుంది. ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కోవడమే కాదు.. వెల్లింగ్టన్‌లో వీచే బలమైన గాలులను తట్టుకోవడం కూడా కీలకం కానుంది. ఈ పరిస్థితులను ముందుగానే అర్థం చేసుకునేందుకు భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ ఆటగాళ్లకు ఓ విచిత్రమైన సలహా ఇచ్చారు. ఇంట్లోనే స్ట్రాంగ్ ఫ్యాన్ ముందు నిలబడి గాలిని ఎదుర్కొంటూ ప్రాక్టీస్ చేయాలని సరదాగా సూచించారు. వినడానికి వింతగా అనిపించినా, వెల్లింగ్టన్‌లో గాలుల ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో ఆయన మాటలు తెలియజేస్తున్నాయి.

గంటకు 120 కి.మీ. వేగంతో గాలులు

న్యూజిలాండ్ రాజధాని వెల్లింగ్టన్‌ను బలమైన గాలుల కారణంగా విండీ వెల్లింగ్టన్ అని పిలుస్తుంటారు. ఇక్కడి బేసిన్ రిజర్వ్ మైదానంలో గాలి దిశ తరచూ మారే అవకాశం ఉంటుంది. అక్టోబర్ 26న కొన్ని ప్రాంతాల్లో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే పరిస్థితులు నమోదయ్యాయి. గాలుల తీవ్రతకు తాను ఉన్న హోటల్ భవనం కూడా కదులుతున్నట్లు అనిపించిందని మోర్కెల్ చెప్పినట్లు వార్తలు వెల్లడించాయి. దీంతో ఈ వాతావరణం భారత ఆటగాళ్లకు ఎంతటి పరీక్షగా మారనుందో అర్థం చేసుకోవచ్చు.

బ్యాటింగ్, బౌలింగ్‌పై ప్రభావం

బలమైన గాలులు బ్యాటర్ల ఆటతీరుపై కూడా ప్రభావం చూపుతాయి. బ్యాటింగ్ చేసే సమయంలో శరీర సమతుల్యత, నిలబడే విధానం మారే అవకాశం ఉంటుంది. ఎత్తుగా కొట్టిన బంతి గాలి దిశను బట్టి అనుకున్న దూరం వెళ్లకపోవచ్చు. బౌలర్లు కూడా బంతిని సరైన లైన్, లెంగ్త్‌లో వేయడానికి అదనపు శ్రమ పెట్టాల్సి రావొచ్చు. గాలి ఎదురుగా వీస్తున్నప్పుడు బౌలింగ్ చేయడం, వెనుక నుంచి గాలి సహకరిస్తున్నప్పుడు బంతి వేయడం మధ్య తేడాను అర్థం చేసుకోవాలి. అందుకే ఆటగాళ్లు అక్కడి పరిస్థితులకు త్వరగా అలవాటు పడాలని మోర్కెల్ సూచించారు.

ఆటగాళ్లకు ముందుగానే సూచనలు

న్యూజిలాండ్‌లో గాలుల ప్రభావం ఎలా ఉంటుందో పర్యటన ప్రారంభానికి ముందే ఆటగాళ్లతో చర్చించినట్లు మోర్కెల్ తెలిపారు. భారత్‌లో ఉన్న కొంతమంది ఆటగాళ్లు కూడా అక్కడి పరిస్థితుల గురించి తనను అడిగారని చెప్పారు. అయితే ఫ్యాన్ ముందు ప్రాక్టీస్ చేయాలన్నది సరదాగా ఇచ్చిన సలహా మాత్రమే. మైదానంలోకి దిగిన తర్వాత గాలులను పట్టించుకోకుండా ప్రతి బంతిపై దృష్టి పెట్టాలని, తమ ప్రణాళికలను సరిగ్గా అమలు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.

తొలి టెస్టు ఎప్పుడంటే?

భారత్‌-న్యూజిలాండ్ మధ్య ప్రస్తుతం టీ20 సిరీస్ జరుగుతోంది. ఆ తర్వాత వన్డే సిరీస్, రెండు టెస్టుల సిరీస్ జరగనున్నాయి. తొలి టెస్టు నవంబర్ 19 నుంచి 23 వరకు వెల్లింగ్టన్‌లోని బేసిన్ రిజర్వ్ మైదానంలో జరగనుంది. రెండో టెస్టు నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు క్రైస్ట్‌చర్చ్‌లో నిర్వహించనున్నారు. ఈ సిరీస్‌లో భారత ఆటగాళ్లు న్యూజిలాండ్ పరిస్థితులకు ఎంత త్వరగా అలవాటు పడతారన్నది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us