అక్కినేని యంగ్ హీరో సరసన ఏకంగా ముగ్గురు హీరోయిన్లు.. ఏ సినిమా కోసమంటే…
అక్కినేని యాంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
అక్కినేని యాంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడి ఇటీవలే తిరిగి మొదలైంది. ఈ సినిమా తర్వాత ‘థ్యాంక్యూ’ సినిమాను అనౌన్స్ చేసాడు చైతన్య . విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మించబోతున్నాడు.
ఈ నెలలో సినిమాను పట్టాలెక్కించబోతున్నట్లు తెలుస్తుంది. కథానుసారంగా ఈ సినిమాలో హీరో ఒక పల్లెటూరు వ్యక్తిగా మరియు ఎన్నారై గా కూడా కనిపించబోతున్నాడట. చైతూకు జోడీగా ఈ సినిమాలో ఏకంగా ముగ్గురు ముద్దుగుమ్మలు నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఇద్దరు ముద్దుగుమ్మలను ఎంపిక చేసిన దర్శకుడు మూడవ హీరోయిన్ విషయమై చర్చలు జరుపుతున్నాడట. ఇప్పటికే మనం సినిమాతో చైతూ మరియు విక్రమ్ ల కాంబో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది దాంతో ఇప్పుడు రాబోయే సినిమా పైన అంచనాలు నెలకొన్నాయి.