RRR Movie: ఆ థియేటర్‌లో జక్కన్న సినిమాను ఫస్ట్‌ హాఫ్‌ మాత్రమే వేసి ఆపేశారు.. కారణమేంటంటే..

|

Mar 27, 2022 | 6:14 PM

ప్రస్తుతం దేశమంతా ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) మేనియాలో మునిగితేలుతోంది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ పాన్‌ఇండియా సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు

RRR Movie: ఆ థియేటర్‌లో జక్కన్న సినిమాను ఫస్ట్‌ హాఫ్‌ మాత్రమే వేసి ఆపేశారు.. కారణమేంటంటే..
Rrr
Follow us on

ప్రస్తుతం దేశమంతా ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) మేనియాలో మునిగితేలుతోంది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ పాన్‌ఇండియా సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక అల్లూరిగా రామ్‌చరణ్‌ (Ram Charan), కొమ్రుం భీమ్‌గా ఎన్టీఆర్‌ (JR.NTR) యాక్టింగ్‌కు అభిమానులే కాదు సినీ విమర్శకులు సైతం ఫిదా అవుతున్నారు. కాగా ట్రేడ్‌ నిపుణుల అంచనాల ప్రకారం.. ఆర్ఆర్ఆర్ మూవీ ఒక్క రోజులోనే ప్రపంచవ్యాప్తంగా రూ.257 కోట్లు క‌లెక్ట్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఇండియన్ సినిమా హిస్టరీలో మొదటి రోజే ఈ స్థాయి భారీ వసూళ్లు సాధించిన మొదటి సినిమా ఇదే కావడం విశేషం. ఇక ఓవర్సీస్‌లోనూ ఈ సినిమాకు కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే అమెరికా (America)లోని ఓ థియేట‌ర్‌లో ఆర్ఆర్ఆర్ సినిమా సెకండ్ హాఫ్‌ను ప్రదర్శించలేదు. కేవ‌లం ఫ‌స్ట్ హాఫ్ మాత్రమే వేసి ఆపేశారు. దానికి కారణమేంటో తెలుసా.. సినిమా నిడివి ఎక్కువగా ఉండడమే.

3 గంటలు ఉండడంతో..

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా నిడివి సుమారు 3 గంట‌లు. సాధారణంగా ఇంత రన్‌ టైమ్‌ ఉంటే ఒక్కోసారి బాక్సాఫీస్‌ వద్ద ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. అయితే రాజమౌళికి మాత్రం ఇది వర్తించదు. గతంలో బాహుబలి సిరీస్‌లోని రెండు పార్ట్‌లు కూడా ఎక్కువగా నిడివి ఉన్నవే. అయితే థియేటర్‌లో సీటుకు అతుక్కుపోయి మరీ ఈ సినిమాలు చూశారు ప్రేక్షకులు. ఆర్‌ఆర్‌ఆర్‌ విషయంలోనూ అదే జరుగుతోంది. అయితే యూఎస్‌లో న‌డిచే హాలీవుడ్ సినిమాల నిడివి గంట నుంచి గంట‌న్నర మాత్రమే ఉంటుంది. సినిమా నిడివి ఆధారంగా వాళ్లు షోల‌ను ప్లాన్ చేసుకుంటూ ఉంటారు థియేటర్‌ యాజమాన్యాలు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా విష‌యానికి వ‌చ్చేస‌రికి అది పూర్తిగా తలకిందులైంది. సినిమ 3 గంట‌ల పాటు ఉందన్న విష‌యం తెలియ‌క‌.. ఫ‌స్ట్ హాఫ్ అయిపోగానే సినిమా అయిపోయింద‌ని థియేట‌ర్ మేనేజ్‌మెంట్ భావించింద‌ట‌. దీంతో సెకండ్ హాఫ్ స్క్రీనింగ్ చేయకుండానే ప్రేక్షకులను బయటకు పంపించారట. యూఎస్‌లోని సినీమార్క్ థియేట‌ర్‌లో ఇది చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ఫిలిం క్రిటిక్ అనుప‌మా చోప్రా ఈ ఘ‌ట‌న‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ‘ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షోకు వెళ్తే థియేటర్‌ మేనేజర్‌ చెప్పిన మాటలతో చిరాకేసింది’ అంటూ తన బాధను వెళ్లగక్కింది. ఈ పోస్ట్‌ చూసిన నెటిజ‌న్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. ‘ఫ‌స్ట్ హాఫ్ మాత్రమే వేసి సెకండ్ హాఫ్ ఆపేయ‌డం ఏంటి?. అదేం థియేట‌ర్’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Also Read: IPL 2022: రోహిత్ సేనకు బ్యాడ్ న్యూస్.. గాయం బారిన తుఫాన్ బ్యాటర్

Viral Photo: ఇతడు తెలుగు ప్రేక్షకులకు చాలా ఫేవరెట్.. పక్కింటి కుర్రాడిలా ఉంటాడు.. ఎవరో కనిపెట్టారా..?

Diabetes Signs: కళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా ? అయితే అవి మధుమేహానికి సంకేతాలు.. అవెంటో తెలుసుకోండి..