పెద్ద స్టార్‌తో క్రైమ్‌ డ్రామా.. ఈసారి మిమ్మల్ని నిరుత్సాహపరచనన్న తరుణ్ భాస్కర్‌

మొదటి సినిమా పెళ్లిచూపులుతో టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారారు దర్శకుడు తరుణ్ భాస్కర్‌. ఈ మూవీకి తరుణ్‌కి జాతీయ అవార్డు రావడంతో పాటు అతడితో పనిచేసేందుకు స్టార్ హీరోలు సైతం ఎదురుచూశారు

పెద్ద స్టార్‌తో క్రైమ్‌ డ్రామా.. ఈసారి మిమ్మల్ని నిరుత్సాహపరచనన్న తరుణ్ భాస్కర్‌

Edited By:

Updated on: Nov 23, 2020 | 9:11 AM

Tharun Bhascker next movie: మొదటి సినిమా పెళ్లిచూపులుతో టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారారు దర్శకుడు తరుణ్ భాస్కర్‌. ఈ మూవీకి తరుణ్‌కి జాతీయ అవార్డు రావడంతో పాటు అతడితో పనిచేసేందుకు స్టార్ హీరోలు సైతం ఎదురుచూశారు. అయితే ఎవ్వరూ ఊహించనట్లుగా రెండో సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’ని కొత్త వారితో తీశారు తరుణ్‌. అయితే ఈ మూవీ అనుకున్నంత విజయం సాధించలేదు. కానీ తరుణ్‌ క్రేజ్ మాత్రం తగ్గలేదు. (కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 602 కొత్త కేసులు.. ముగ్గరు మృతి.. కోలుకున్న 1,015 మంది)

తరుణ్‌ టాలెంట్‌ని నమ్మిన సురేష్ ప్రొడక్షన్స్ వెంకటేష్‌తో సినిమా తీసే అవకాశాన్ని ఇచ్చింది. ఈ విషయాన్ని నిర్మాత సురేష్‌ బాబు గతేడాదే ప్రకటించారు. అయితే ఆ తరువాత ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పనులు మాత్రం మొదలుకాలేదు. మరోవైపు వెంకటేష్‌ ప్రస్తుతం నారప్పలో నటిస్తుండగా.. ఆ తరువాత ఎఫ్‌ 3లో నటించనున్నారు. ఈ రెండింటి తరువాత రానాతో మల్టీస్టారర్‌లో కనిపించనున్నారు. ఇలాంటి నేపథ్యంలో తరుణ్‌ తదుపరి చిత్రం వెంకటేష్‌తో ఉంటుందా..? ఉండదా..? అన్న డైలమా కొనసాగుతోంది. ఈ క్రమంలో తన మూడో ప్రాజెక్ట్‌పై క్లారిటీని ఇచ్చారు. (ఏఎఫ్‌ఐ హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ పదవికి వోల్కర్ హెర్మన్ రాజీనామా)

నా మూడో ప్రాజెక్ట్‌ నిజంగా నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. నాకు రెండు బిగ్‌ ప్రాజెక్ట్‌లు వచ్చాయి. వాటిలో ఏది ఎంచుకోవాలో అర్థం కాని పరిస్థితి. కానీ నేను క్రైమ్‌ డ్రామాను ఎంచుకున్నా. ఇందులో నేను అభిమానించే ఓ పెద్ద స్టార్ నటించబోతున్నారు. ఇది మిమ్మల్ని ఏ మాత్రం నిరుత్సాహపరచదు. దీని కోసం వెయిట్‌ చేయండి అని తరుణ్ తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. చూస్తుంటే ఈ ప్రాజెక్ట్‌ వెంకీతోనేనని తెలుస్తోంది.  (Bigg Boss 4: ఇష్టమైన అభిజిత్‌కి లాస్య షాక్‌.. బిగ్‌బాంబ్‌ అతడిపైనే)