Volker Hermann resignation: భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ వోల్కర్ హెర్మన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు. అత్యున్నతమైన ఈ పదవి కోసం తాను స్వీయంగా విధించుకున్న అంచనాలను అందుకోలేనని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని హెర్మన్ తెలిపారు. కాగా 2019లో వోల్కర్ ఈ బాధ్యతను స్వీకరించగా.. టోక్యో ఒలింపిక్స్‌తో అతడి పదవీ కాలం ముగియనుంది. అయితే ఈ ఏడాది సెప్టెంబర్‌లో భారత క్రీడా మంత్రిత్వశాఖ ఆయన పదవీకాలాన్ని 2024వరకు పెంచింది. అయితే ఆ అవకాశాన్ని తిరస్కరించిన వోల్కర్.. కొన్ని వారాల కిందటే రాజీనామా లేఖను ఇచ్చినట్లు ఏఎఫ్ఐ వర్గాలు వెల్లడించాయి. ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని ఏఎఫ్ఐ విజ్ఞప్తి చేసినప్పటికీ.. వోల్కర్ జర్మనీకి వెళ్లేందుకే సిద్ధపడ్డారని సమాఖ్య అధ్యక్షుడు ఆదిల్ సుమరివాలా తెలిపారు.
Read More:
Bigg Boss 4: ఇష్టమైన అభిజిత్‌కి లాస్య షాక్.. బిగ్‌బాంబ్ అతడిపైనే
Bigg Boss 4: లాస్య ఎలిమినేటెడ్.. హౌజ్‌లో ఒక్కొక్కరి గురించి ఏం చెప్పిందంటే