The Life Of A Legend: ‘ది లైఫ్‌ ఆఫ్‌ ఎ లెజెండ్‌’ పేరుతో శ్రీదేవి బయోగ్రఫీ.. ఆ సీక్రెట్స్ అన్నీ ఇందులో ఉంటాయా!?

శ్రీదేవి.. ఈ పేరే ఓ సంచలనం. సౌత్ టు నార్త్ దుమ్ము దులిపిన అతిలోక సుందరి. ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న శ్రీదేవి లేని లోటు ఎవరూ పూడ్చలేనిది.

The Life Of A Legend: ‘ది లైఫ్‌ ఆఫ్‌ ఎ లెజెండ్‌’ పేరుతో శ్రీదేవి బయోగ్రఫీ.. ఆ సీక్రెట్స్ అన్నీ ఇందులో ఉంటాయా!?
Sri Devi

Updated on: Feb 10, 2023 | 7:32 AM

శ్రీదేవి.. ఈ పేరే ఓ సంచలనం. సౌత్ టు నార్త్ దుమ్ము దులిపిన అతిలోక సుందరి. ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న శ్రీదేవి లేని లోటు ఎవరూ పూడ్చలేనిది. ఆమె జీవితంలోని ఎన్నో ఆసక్తికర విషయాలను ఇప్పుడు పుస్తకరూపంలో తీసుకొస్తున్నారు. ‘ది లైఫ్‌ ఆఫ్‌ ఎ లెజెండ్‌’ పేరుతో శ్రీదేవి బయోగ్రఫీని ప్రముఖ రచయిత, పరిశోధకుడు, బోనీ కపూర్‌ ఫ్రెండ్‌ ధీరజ్‌ కుమార్‌ రాస్తున్నారు. మరి ఇందులో శ్రీదేవికి సంబంధించి అన్ని విషయాలు ఉంటాయా? కొన్నింటినే రాసి మిగతావాటిని అలాగే వదిలేస్తారా? అతిలోక సుందరి మరణం వెనుక మిస్టరీ కూడా బయోగ్రఫీలో ఉంటుందా? ఇదే ఇప్పుడు శ్రీదేవి అభిమానులను తొలుస్తున్న ప్రశ్నలు.

ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ ఎవర్‌గ్రీన్‌ టాప్‌ హీరోయిన్ శ్రీదేవి మళ్లీ టాక్‌ ఆఫ్‌ ది ఇండియా అయ్యారు. ఇందుకు కారణం బోనీ కపూర్ ఫ్రెండ్‌, పరిశోధకుడు, రచయిత అయిన ధీరజ్‌ కుమార్‌. సౌత్‌ టు నార్త్‌.. కొన్ని దశాబ్దాల పాటు ఆడియన్స్‌కు నిద్రలేకుండా చేసిన దేవకన్య శ్రీదేవి గురించి ధీరజ్‌ బయోగ్రఫీ రాయడానికి పూనుకోవడమే ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది సిల్వర్‌ స్క్రీన్‌గా మారింది.

దక్షిణాదితోపాటు ఉత్తరాదిని ఊపేసిన శ్రీదేవి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంత చెప్పుకున్నా ఇంకా మిగిలే ఉంటుంది. ఆమె చేయని పాత్ర లేదు. ఆమె చేయని డ్యాన్స్‌లేదు. ఆమె పలికించని హావబావాలు లేవు. ఎన్నో పాత్రల్లో.. ఎన్నో రకాలుగా జీవించిన ఈ వసంత కోకిల.. ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ఆమె జీవితంలోని ఎన్నో ఆసక్తికర విషయాలను ఇప్పుడు పుస్తక రూపంలో తెస్తున్నారు. ది లైఫ్‌ ఆఫ్‌ ఎ లెజెండ్‌ పేరుతో శ్రీదేవి బయోగ్రఫీ రాబోతోంది.

ఇది నేను చేస్తున్న తొలి బయోగ్రఫీ. శ్రీదేవి భర్త బోనీ కపూర్‌, కుమార్తెలు జాన్వీ, ఖుషీ కపూర్‌ల సహకారమే తనని ఈ సాహసానికి పురిగొల్పిందని ధీరజ్‌ చెబుతున్నారు.

శ్రీదేవి బయోగ్రఫీ ఎలా ఉండబోతోంది?

ఇదంతా ఓకే కానీ.. ధీరజ్‌ రాయబోయే శ్రీదేవి బయోగ్రఫీ ఎలా ఉండబోతోంది. ఇదే ఇప్పుడు దేశమంతటా చర్చ నడుస్తోంది. ఎందుకంటే.. దేవకన్య దాగుడుమూతల జీవితం, దాచినా దాగని సత్యాలు, మరణంపై నెలకొన్న అనుమానాలు అన్నీ ఇందులో ఉంటాయా? అనేది ఆసక్తికరంగా మారింది.

శ్రీదేవి మరణంపై అనేక అనుమానాలు..

శ్రీదేవి మరణం విషయంలో పలు అనుమానాలు ఉన్నాయి. అవన్నీ ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయాయి. పెళ్లి జరిగింది 2018 ఫిబ్రవరి 20 తేదీ అయితే ఆమె 24 వరకు దుబాయ్‌లోనే ఎందుకు ఉన్నారు? మిగిలిన అందరు స్వస్థలాలకు వెళ్లినా, చివరకు బోనీకపూర్‌ కూడా ముంబై వెళ్లినా కూడా ఆమె దుబాయ్‌లోనే ఎందుకున్నారు? ఇక దుబాయ్‌ పోలీసులు చెప్పినట్లు ఆమె మద్యం సేవించి ఉందని చెబుతున్నారు. ఫోరెన్సిక్‌ నిపుణులు గుండె పోటుతో మరణించిందా? లేక నీళ్లలో పడి మరణించిందా? అనే విషయాన్నే చెప్పగలరు గానీ ప్రమాదవశాత్తూ బాత్‌టబ్‌లో పడి మరణించిందని ఖచ్చితంగా ఎలా చెప్తారు? ఆమె 22 వ తేదీ నుంచి మరణించిన 24వ తేదీ వరకు శ్రీదేవి అసలు హోటల్‌ రూం నుంచి ఎందుకు బయటికి రాలేదు? హోటల్‌ సిబ్బంది తలుపులు బద్ధలు కొట్టి చూశారా? లేక ముందుగా బోనీకపూరే ఆమెని శవంగా చూశాడా? గతంలో శ్రీదేవికి ఎలాంటి అనారోగ్యం లేదని, మరి ఆమె గుండెపోటుతో మరణించడం బాధగా ఉందని ఆమె మరిది సంజయ్‌ పూర్‌ వెంటనే ఎలా చెప్పగలిగాడు?

ఫోరెన్సిక్‌ నిపుణులు ఎందుకు చెప్పడం లేదు?

24వ తేదీ సాయంత్రం ముంబై నుంచి బోనీకపూర్‌ శ్రీదేవిని సర్‌ప్రైజ్‌ చేయడానికి వెళ్లాడా? లేక మరణ వార్త విన్న తర్వాత వెళ్లాడా? మరి వీటిని దుబాయ్‌ ఫోరెన్సిక్‌ నిపుణులు ఇప్పటికీ ఎందుకు చెప్పడం లేదు? ఇక ఫోరెన్సిక్‌ రిపోర్ట్స్‌లో పదాల తప్పులు లేకుండా జాగ్రత్త పడతారు. కానీ ఈమె ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌లో మాత్రం డ్రౌనింగ్‌ అనే పదం ప్లేస్‌లో స్పెల్లింగ్‌ దోషంగా డ్రావింగ్‌ అనే పదం ఎందుకు వచ్చింది? ఇది పొరపాటేనా.. లేక ఏమైనా మతలబు ఉందా? ఆమె మద్యం సేవిస్తూ అపస్మారక స్ధితిలోని జారుకున్నారా? అదే నిజమైతే స్పృహలేని ఆమె బాత్‌రూమ్‌ వరకు ఎలా వెళ్లగలిగింది? అసలు ఒక బాత్‌ టబ్‌లో పడి ఓ పెద్ద వయసు వ్యక్తి మరణించడం జరిగేపనేనా? ఇందులో కూడా ఏదైనా తిరకాసు ఉందా? ఇలా ప్రతి ఒక్కరికీ శ్రీదేవి మరణంపై ఎన్నో అనుమానాలున్నాయి. ధీరజ్‌కపూర్ వీటిని ప్రస్తావించి ఉంటాడా? వీటికి ఆన్సర్లు ఇస్తాడా? లేదంటే బయోగ్రఫీని సింపుల్‌గా మమ అనిపిస్తాడా? అనేది ఇంట్రస్టింగ్‌గా మారింది.

అయితే శ్రీదేవి ఒక ప్రకృతి శక్తి. ఆమె ఒక అద్భుతం. తనకు నటన అంటే ఎంతో ఇష్టం. స్ర్కీన్‌పై కనిపించినప్పుడు అభిమానుల నుంచి వచ్చే స్పందన చూసి చాలా సంతోషించేది. తన వ్యక్తిగత విషయాలను చాలా గోప్యంగా ఉంచేది. మా కుటుంబసభ్యుల్లో ఒకరిగా భావించే దీరజ్‌ ఆమె జీవిత చరిత్రను పుస్తకంగా రాయడం చాలా ఆనందంగా ఉందంటున్నారు బోనీ కపూర్‌.

ఈనెల 24న చైనాలో ఇంగ్లిష్‌ వింగ్లిష్‌ ప్రదర్శన..

నటిగా 300లకు పైగా చిత్రాల్లో నటించిన ఆమె 2012లో చేసిన ఇంగ్లిష్‌ వింగ్లిష్‌ సినిమాకు అత్యంత ప్రశంసలు అందుకొంది. ఈ చిత్రాన్ని ఆమె ఐదో వర్థంతి సందర్భంగా ఈ నెల 24 చైనాలో విడుదల చేయనున్నారు. అక్కడ 6,000 థియేటర్లలో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..