Sirivennela Seetharama Sastry: వయసుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరూ త్రివిక్రమ్ పాటను ఇష్టపడుతుంటారు. ఈతరం యువకులు కూడా సిరివెన్నెల రాసిన పాటల్లోని అర్థాలను వెతికే ప్రయత్నం చేస్తారంటేనే ఆయన కలానికి ఉన్న గొప్పతనం ఏంటో అర్థం చేసుకోవచ్చు. కాస్త నిరాశ కలిగిందంటే చాలు సిరివెన్నెల రాసిన ఓ స్ఫూర్తిదాయక పాట వినాలనిపిస్తుంది. జోష్‌లో ఉంటే ఆయన రాసిన యూత్‌ఫుల్ సాంగ్ వినాల్సిందే. ఇలా సిరివెన్నెల పాట సినీ ప్రేక్షకులతో నిత్యం ప్రయాణం చేస్తూనే ఉంటుంది. అలాంటి పాటల మాంత్రికుడు ఈ లోకాన్ని వదిలి వెళ్లాడాన్న నిజాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇకపై సిరివెన్నెల నుంచి పాటలు రావనే నిజాన్ని నమ్మలేకపోతున్నారు.
నిజానికి సిరివెన్నెల పాటలు రాశారు అంటే సినిమాకు వెళ్లేవారు ఉన్నారడనంలో ఎలాంటి సందేహం లేదు. మాస్ పాట అయినా, క్లాస్ పాట పాయినా, ప్రేమ గీతమైనా.. ఆయన కలం నుంచి జాలు వారితే అది ఒక అద్భుతమే అవుతుంది. ఇదిలా ఉంటే సిరివెన్నెల కలం నుంచి వచ్చిన చివరి పాట ఏంటన్న దానిపై ఇప్పుడు ఆయన అభిమానులు సెర్చ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి విడుదలైన సిరివెన్నెల చివరి పాటగా ఆర్.ఆర్.ఆర్ చిత్రంలోని దోస్తీ పాట నిలిచింది. ఈ పాటతో.. 66 ఏళ్ల వయసులోనూ తన కలం పదును ఏమాత్రం తగ్గలేదని చాటి చెప్పారు సిరివెన్నెల.
ఇదిలా ఉంటే సిరివెన్నెల రచన అందించి ఇంకా విడుదల కానీ చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. నాని హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో సిరివెన్నెల రెండు పాటలు రాశారు. ఈ లెక్కన చూసుకుంటే సిరివెన్నెల సాహితి లోకానికి ఇచ్చిన చివరి బహుమతి శ్యామ్ సింగరాయ్ అని చెప్పాలి. ఇదే ఆయన సినీ లోకానికి వదిలి వెళ్లిన చివరి గుర్తు.
SRH IPL 2022 Retained Players: ఎస్ఆర్‌హెచ్ సంచలన నిర్ణయం.. వార్నర్, భువీ, రషీద్ ఖాన్ రిలీజ్..