SRH IPL 2022 Retained Players: ఎస్ఆర్‌హెచ్ సంచలన నిర్ణయం.. వార్నర్, భువీ, రషీద్ ఖాన్ రిలీజ్..

SRH IPL 2022 Released Players: IPL 2022 మెగా వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ రిటైన్ చేసిన ఆటగాళ్లను ప్రకటించింది. ఈ జట్టు ముగ్గురు ఆటగాళ్లను అట్టిపెట్టుకుంది.

SRH IPL 2022 Retained Players: ఎస్ఆర్‌హెచ్ సంచలన నిర్ణయం.. వార్నర్, భువీ, రషీద్ ఖాన్ రిలీజ్..
Srh
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Dec 01, 2021 | 1:27 PM

SRH IPL 2022 Retained Players: IPL 2022 మెగా వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ రిటైన్ చేసిన ఆటగాళ్లను ప్రకటించింది. ఈ జట్టు ముగ్గురు ఆటగాళ్లను అట్టిపెట్టుకుంది. వీరిలో కేన్ విలియమ్సన్, ఉమ్రాన్ మాలిక్, అబ్దుల్ సమద్ ఉన్నారు. ఉమ్రాన్, అబ్దుల్ ఇద్దరూ అన్ క్యాప్డ్ ప్లేయర్లు. వీరిద్దరూ జమ్మూ కాశ్మీర్ నుండి వచ్చారు. రాబోయే రోజుల్లో సన్‌రైజర్స్‌కు విలియమ్సన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఉమ్రాన్ లాంటి ప్లేయర్స్‌ని సన్‌రైజర్స్ రిటైన్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే.. IPL 2021 సమయంలో ఉమ్రాన్ నెట్ బౌలర్. నటరాజన్‌కి కరోనా రావడంతో.. అతని స్థానంలో ఉమ్రాన్ జట్టులో భాగమయ్యాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటైన్ చేసిన ప్లేయర్స్ వీరే.. కేన్ విలియమ్సన్ – ఇకపై కూడా జట్టుకు కెప్టెన్‌గా కొనసాగుతాడు. అతని నేతృత్వంలోని టీమ్ IPL 2018లో ఫైనల్స్‌కు వెళ్లింది. విలియమ్సన్‌కి రూ.14 కోట్లు చెల్లించనుంది ఎస్ఆర్‌హెచ్ టీమ్. ఉమ్రాన్ మాలిక్- జమ్మూ కాశ్మీర్ కు చెందిన ప్లేయర్. IPL 2021 సమయంలో రీప్లేస్‌మెంట్ ప్లేయర్‌గా వచ్చాడు. అయితే పేస్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. అంతకుముందు నెట్ బౌలర్‌గా జట్టుతో ఉన్నాడు. ఉమ్రాన్‌కు 4 కోట్ల రూపాయలు అందనున్నాయి. అబ్దుల్ సమద్ జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఫాస్ట్ బౌలర్. మిడిల్ ఆర్డర్‌లో ఆడగలడు. ఇతనికి కూడా రూ.4 కోట్లు కూడా అందుతాయి.

సన్‌రైజర్స్ హైదరాబాద్ విడుదల చేసిన ప్లేయర్స్.. డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో, శ్రీవత్స్ గోస్వామి, జగదీష్ సుచిత్, వృద్ధిమాన్ సాహా, మహ్మద్ నబీ, ముజీబ్ ఉర్ రెహమాన్, కేదార్ జాదవ్, విజయ్ శంకర్, విరాట్ సింగ్, ప్రియాం గార్గ్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, జాసన్ హోల్డర్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, థంపి, టి నటరాజన్, సిద్ధార్థ్ కౌల్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, షాబాజ్ నదీమ్, మనీష్ పాండే, జాసన్ రాయ్.

Also read:

మందుబాబుల మత్తు వదల కొడతాం..ఇల్లీగల్ డీ అడిక్షన్‌ రీహాబిలిటేషన్‌ సెంటర్ల అక్రమ దందా.. టీవీ9 నిఘాలో విస్తుకొలిపే నిజాలు!

Business Idea: వాటే ఐడియా గురూ.. తండ్రి ఆసక్తి.. తనయుని వ్యాపారం.. కోట్లాది రూపాయల టర్నోవర్..

Omicron variant: ఒమిక్రాన్ వేరియంట్‌తో థర్డ్ వేవ్ వస్తుందా? కాన్పూర్ ఐఐటీ ప్రొఫెసర్ అంచనా..

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన