Mumbai Indians IPL 2022 Retained Players: ముంబై ఇండియన్స్ టీమ్ నుంచి ఆ ముగ్గురు ఔట్.. ఎవరు రిటైన్ అయ్యారంటే..

Mumbai Indians IPL 2022 Released Players: IPL చరిత్రలో ముంబై ఇండియన్స్ అత్యంత విజయవంతమైన జట్టు. రోహిత్ శర్మ సారథ్యంలో ఈ టీమ్ ఐదుసార్లు టైటిల్‌ను కైవసం చేసుకుంది.

Mumbai Indians IPL 2022 Retained Players: ముంబై ఇండియన్స్ టీమ్ నుంచి ఆ ముగ్గురు ఔట్.. ఎవరు రిటైన్ అయ్యారంటే..
Mi
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Dec 01, 2021 | 1:21 PM

Mumbai Indians IPL 2022 Retained Players: IPL చరిత్రలో ముంబై ఇండియన్స్ అత్యంత విజయవంతమైన జట్టు. రోహిత్ శర్మ సారథ్యంలో ఈ టీమ్ ఐదుసార్లు టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఐపీఎల్ 2022 వేలానికి ముందు ముంబై ఇండియన్స్ నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. ఇందులో కెప్టెన్ రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, కీరన్ పొలార్డ్, సూర్యకుమార్ యాదవ్‌లను రిటైన్ చేసింది. అయితే, కీలక ఆటగాళ్లు రిలీజ్ అయ్యారు. వీరిలో హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ పేర్లు ఉన్నాయి. వీరిద్దరూ ముంబై విజయానికి ప్రధాన అస్త్రాలు. అయితే ఇప్పుడు తాజాగా టీమ్ రెడీ అవుతున్నా ఇద్దరికీ చోటు దక్కలేదు. జట్టుకు కెప్టెన్‌గా రోహిత్ శర్మ కొనసాగనున్నాడు. జస్ప్రీత్ బుమ్రా వైస్ కెప్టెన్‌గా ఎంపికవ్వొచ్చు. ఇది కాకుండా.. భవిష్యత్ కెప్టెన్‌గా సూర్యను తీర్చిదిద్దే ఛాన్స్‌ ఉంది. ఇక కీరన్ పొలార్డ్ ఎంతకాలం జట్టుతో ఉంటాడనేది ఆసక్తికరంగా మారింది.

ముంబై ఇండియన్స్ రిటైన్ చేసిన ప్లేయర్స్.. ముంబై ఇండియన్స్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా కొనసాగనున్నాడు. రోహిత్ శర్మకు రూ. 16 కోట్లు చెల్లిస్తోంది ముంబై ఇండియన్స్ టీమ్.

జస్ప్రీత్ బుమ్రా – బుమ్రాను వదులుకోవడానికి ఏ జట్టు సాహసించదనే చెప్పాలి. అందుకే బుమ్రాను వదులుకోవడానికి ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఇష్టపడలేదు. బుమ్రూకు రూ. 12 కోట్లు వెచ్చించి రిటైన్ చేసింది.

సూర్యకుమార్ యాదవ్ – ముంబై ఇండియన్స్ టీమ్‌లో కీలక ప్లేయర్‌గా అవతరిస్తున్నాడు. అద్భుతమైన బ్యాటింగ్‌తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. సూర్యకు రూ. 8 కోట్లు చెల్లించనుంది ఫ్రాంచైజీ.

కీరన్ పొలార్డ్- వెస్టిండీస్ ఆటగాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడింటిలోనూ అదరగొడతాడు. పొలార్డ్‌కు ముంబై ఇండియన్స్ యాజమాన్యం రూ. 6 కోట్లు చెల్లిస్తోంది.

ముంబై ఇండియన్స్ రిలీజ్ చేసిన ప్లేయర్స్.. అన్మోల్‌ప్రీత్ సింగ్, క్రిస్ లిన్, సౌరభ్ తివారీ, క్వింటన్ డి కాక్, పీయూష్ చావ్లా, ఇషాన్ కిషన్, ఆదిత్య తారే, అనుకుల్ రాయ్, ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, మార్కో యాన్సన్, జిమ్మీ నీషమ్, ఆడమ్ మిల్నే, యుధ్‌వీర్ సింగ్, ద్హావీర్ సింగ్, కౌల్టర్ -నైల్, అర్జున్ టెండూల్కర్, మొహ్సిన్ ఖాన్, జయంత్ యాదవ్ మరియు రాహుల్ చాహర్.

Also read:

మందుబాబుల మత్తు వదల కొడతాం..ఇల్లీగల్ డీ అడిక్షన్‌ రీహాబిలిటేషన్‌ సెంటర్ల అక్రమ దందా.. టీవీ9 నిఘాలో విస్తుకొలిపే నిజాలు!

Business Idea: వాటే ఐడియా గురూ.. తండ్రి ఆసక్తి.. తనయుని వ్యాపారం.. కోట్లాది రూపాయల టర్నోవర్..

Omicron variant: ఒమిక్రాన్ వేరియంట్‌తో థర్డ్ వేవ్ వస్తుందా? కాన్పూర్ ఐఐటీ ప్రొఫెసర్ అంచనా..

తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..