‘మాస్టర్’కు పట్టిన పైరసీ భూతం.. ‘ఏడాదిన్నర కష్టమంటూ..’ దర్శకుడి ఎమోషనల్ ట్వీట్..

|

Jan 12, 2021 | 1:15 PM

Thalapathy Master Movie: తమిళ సూపర్ స్టార్లు విజయ్, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో దర్శకుడు లోకేష్ కనకరాజు తెరకెక్కించిన చిత్రం ‘మాస్టర్’..

మాస్టర్కు పట్టిన పైరసీ భూతం.. ఏడాదిన్నర కష్టమంటూ.. దర్శకుడి ఎమోషనల్ ట్వీట్..
Follow us on

Thalapathy Master Movie: తమిళ సూపర్ స్టార్లు విజయ్, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో దర్శకుడు లోకేష్ కనకరాజు తెరకెక్కించిన చిత్రం ‘మాస్టర్’. మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. తమిళంతో పాటు తెలుగు భాషల్లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. లాక్‌డౌన్ తర్వాత కోలీవుడ్‌లో రిలీజ్ అవుతున్న భారీ చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం విడుదలకు కొద్దిగంటల ముందు పైరసీ బారిన పడింది. సినిమాలోని మెయిన్ సీన్స్ అన్ని కూడా నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. దీనితో అలెర్ట్ అయిన దళపతి ఫ్యాన్స్ ఆయా సీన్స్ సామాజిక మాధ్యమాల నుంచి డిలీట్ అయ్యేలా రిపోర్ట్ చేశారు. మరోవైపు ‘మాస్టర్’ సినిమా లీక్‌పై దర్శకుడు లోకేష్ కనగారాజ్ భావోద్వేగానికి గురయ్యారు.

” నేను, నా టీం మాస్టర్ సినిమాకు ఏడాదిన్నర కాలం కష్టపడ్డాం. ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసి ఆనందించండి. ఎవరి దగ్గరైనా మాస్టర్ సినిమాకు సంబంధించిన లీక్ద్ క్లిప్స్ ఉంటే దయచేసి షేర్ చేయొద్దని కోరుకుంటున్నా” అని ఎమోషనల్ ట్వీట్ చేశాడు. కాగా, విజయ్ ఫ్యాన్స్ పైరసీకి వ్యతిరేకంగా #WeStandWithMaster అనే హ్యాష్‌ట్యాగ్‌తో మద్దతు తెలుపుతున్నారు.