
Thalapathy 65 First Look: దళపతి విజయ్ పుట్టిన రోజు(జూన్ 21) సందర్భంగా కొత్త సినిమాపై ఓ ప్రకటన రాబోతుందంటూ సన్ పిక్చర్స్ ప్రకటించింది. ఈమేరకు ఫ్యాన్ #Thalapathy 65 First Look పేరుతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు. అయితే, తెలుగులోనూ విజయ్ ఎంట్రీ ఇవ్వబోతోన్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో రానున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నారు. ఈ సినిమాతో విజయ్ టాలీవుడ్‌లోకి నేరుగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే కథను సిద్ధం చేసిన వంశీ.. త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా ప్రారంభానికి ముందే విజయ్ మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో నటించబోతున్నాడు.
నెల్సన్ డైరెక్షన్‌లో రాబోతోన్న ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ ను విజయ్ బర్త్ డే నాడు ప్రకటించనున్నారు. జూన్ 21న సాయంత్రం ఆరు గంటలకు ఫస్ట్ లుక్ వస్తోందంటూ ప్రకటించారు. “ఎన్నా నన్బా? ఫస్ట్ లుక్కా?” అంటూ ట్విట్టరో ఓ వీడియోను పంచుకొంది. ఈ మూవీలో విజయ్ తో పూజా హెగ్డే రొమాన్స్ చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమాతోనే పూజా హెగ్డే కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ సినిమాకు అనిరుధ్ స్వరాలను సమకూర్చనున్నారు.
Enna nanba? First look ah? #Thalapathy65FLon21st #Thalapathy65FirstLook @actorvijay @Nelsondilpkumar @anirudhofficial @hegdepooja #Thalapathy65 pic.twitter.com/11buRhwU3Y
— Sun Pictures (@sunpictures) June 18, 2021
Also Read:
Kiara Advani: ఎన్టీఆర్- కొరటాల శివ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ.. కియారాకు రూ.3 కోట్లు రెమ్యునరేషన్ ?
Kajal Aggarwal: ఐదుగురు హీరోయిన్లతో ‘మీట్ క్యూట్’ మూవీ.. నాని సినిమాలో కాజల్ ?