Nikhil Siddharth : యంగ్ హీరో నిఖిల్ జోరు పెంచాడు. ఇప్పటికే వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ కుర్ర హీరో ఇప్పుడు తన కెరీర్‌లో 19వ సినిమాను పట్టాలెక్కించాడు. ఈ సినిమాకు గూఢచారి, ఎవరు, హిట్ సినిమాలకు ఎడిటర్ చేసిన చిత్రాన్ని గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహిస్తున్నారు. రెడ్ సినిమాస్ పతాకంపై కే రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.
ప్రముఖ నిర్మాతలు శరత్ మరార్, జెమినీ కిరణ్, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారి చేతుల మీదుగా స్క్రిప్ట్‌ను చిత్రయూనిట్‌కు అందించారు. సినిమా సక్సెస్ అవ్వాలని చిత్రయూనిట్‌కు విషెస్ అందజేశారు. ఇక ఈ సినిమాలో నిఖిల్ సరసన ఐశ్వర్యా మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించేందుకు మేకర్స్ సిద్దమయ్యారు. విభిన్న పాత్రల్లో నటిస్తూ వస్తోన్న నిఖిల్ మొదటిసారిగా స్పై పాత్రలో కనిపించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ హైద్రాబాద్‌లో ప్రారంభం కానుంది. డైరెక్టర్ గ్యారీ బీహెచ్ స్వతాహాగా ఎడిటర్ కావడంతో ఈ సినిమాకు కూడా ఎడిటింగ్ బాధ్యతలను తీసుకున్నారు. ఇక ఇప్పటికే నిఖిల్ 18 పేజెస్, కార్తికేయ 2 సినిమాల షూటింగ్స్‌లో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాల్లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :