పవన్ సినిమాలో రేణు దేశాయ్ రీఎంట్రీ?

ప్రస్తుతం ఇప్పుడు టాలీవుడ్‌లో రీఎంట్రీలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. పాత నటులను కొత్త సినిమాల్లోకి తీసుకొచ్చి.. సినిమా హిట్ చేసుకునే పనిలో పడ్డారు దర్శక, నిర్మాతలు. అలాగే వారు కోరినంత రెమ్యునరేషన్ కూడా ముట్టజెప్పుతున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘పింక్’ రీమేక్‌‌తో రీఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. అటు రేణు దేశాయ్ కూడా రీఎంట్రీ కోసం ఎదురుచూస్తోంది. మంచి కథ దొరికితే నటించడానికి సిద్ధమంటూ […]

పవన్ సినిమాలో రేణు దేశాయ్ రీఎంట్రీ?

ప్రస్తుతం ఇప్పుడు టాలీవుడ్‌లో రీఎంట్రీలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. పాత నటులను కొత్త సినిమాల్లోకి తీసుకొచ్చి.. సినిమా హిట్ చేసుకునే పనిలో పడ్డారు దర్శక, నిర్మాతలు. అలాగే వారు కోరినంత రెమ్యునరేషన్ కూడా ముట్టజెప్పుతున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘పింక్’ రీమేక్‌‌తో రీఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. అటు రేణు దేశాయ్ కూడా రీఎంట్రీ కోసం ఎదురుచూస్తోంది. మంచి కథ దొరికితే నటించడానికి సిద్ధమంటూ తాజాగా ఈ భామ ప్రకటించింది కూడా. అందులోనూ వీరిద్దరూ కలిసి నటిస్తే ఎలా ఉంటుంది.. నిజంగానే హాట్ టాపికే అవుతుంది. వీరు విడిపోయినప్పటికీ.. అభిమానుల దృష్టిలో వీరిపై ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. ‘బద్రీ’ సినిమా సమయంలోనే వీరు ప్రేమలో పడి సహజీవనం చేసి, ఆ తరువాత పెళ్లి చేసుకున్నారు. అనంతరం కొన్ని కారణాలతో పరస్పర ఇష్టంతోనే విడిపోయారు.

ఆ తరువాత పవన్ రాజకీయాల్లో బిజీ అయిపోయారు. అప్పుడు కూడా రేణు పవన్‌కి తన మద్దతు తెలుపుతూ పాజిటీవ్‌గానే స్పందించింది. ప్రస్తుతం రేణు టాలీవుడ్‌లో రీఎంట్రీ కోసం ఎదురుచూస్తోంది. నిజానికి ఆమె ‘చూసి చూడంగానే’ సినిమాతోనే రీఎంట్రీ ఇవ్వాల్సిందట. కానీ అప్పుడు ఆమె అనారోగ్యంతో ఉండటంతో ఆ చిత్రానికి నో చెప్పిందని పేర్కొంది. ఇప్పుడు పింక్ రీమేక్‌తో వీరిద్దరూ కలిసి రీఎంట్రీ ఇవ్వబోతున్నారన్న ప్రచారం జోరుగా ప్రచారం జరుగుతోంది. ఓ చైల్డ్ ఆర్టిస్ట్ తల్లి పాత్రలో రేణు కనిపించనుందని టాక్. ఇందులో నిజమెంతో.. తెలీదుకానీ.. వీరిద్దరూ వెండితెరపై కనిపిస్తే.. ఫ్యాన్స్ ఆనందానికి హద్దే ఉండదని చెప్పవచ్చు.

Published On - 4:40 pm, Sat, 1 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu