Vijay Devarakonda’s Liger: శరవేగంగా మూవీ కంప్లీట్ చేస్తున్న డైనమిక్ డైరెక్టర్.. క్లైమాక్స్ లో లైగర్ షూటింగ్..

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రాబోతోన్న ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ లైగర్ (సాలా క్రాస్ బ్రీడ్).

Vijay Devarakondas Liger: శరవేగంగా మూవీ కంప్లీట్ చేస్తున్న డైనమిక్ డైరెక్టర్..  క్లైమాక్స్ లో లైగర్ షూటింగ్..
Liger

Edited By: Ravi Kiran

Updated on: Feb 05, 2022 | 7:32 AM

Vijay Devarakonda’s Liger: క్రేజీ హీరో విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రాబోతోన్న ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ లైగర్ (సాలా క్రాస్ బ్రీడ్). ఈ సినిమా షూటింగ్ పూర్తికావొస్తుంది. ఈ మూవీ షూటింగ్, చివరి షెడ్యూల్ తాజాగా ముంబైలో ప్రారంభమైంది. విజయ్ దేవరకొండతో పాటు మిగిలిన ముఖ్య తారాగణం అంతా కూడా ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. ఈ చివరి షెడ్యూల్‌తో సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి కానున్నాయి. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన హీరోలను ఎంత పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేస్తారో అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండను సరికొత్త అవతారంతో లైగర్ సినిమాలో చూపించనున్నారు. లైగర్ సినిమా కోసం విజయ్ దేవరకొండ బీస్ట్ లుక్‌లోకి మారిపోయారు. కొత్త ఏడాది సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైట్ సీక్వెన్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. చాయ్ వాలా, స్లమ్ డాగ్స్ ఆఫ్ ముంబై కష్టాలను కూడా అందులో చూపించారు.

బిగ్గెస్ట్ యాక్షన్ చిత్రంగా లైగర్ నిలవబోతోంది. ఇందులో లెజెండ్ మైక్ టైసన్ ముఖ్య పాత్రను పోషించారు. రియల్ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరపై చూసేందుకు సినీ ప్రేమికులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా నిర్మిస్తున్నారు. థాయిలాండ్ స్టంట్ డైరెక్టర్ కెచ్చా యాక్షన్ సీక్వెన్స్‌లను కంపోజ్ చేస్తున్నారు. విష్ణు శర్మ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఈ మూవీ హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ భాషల్లో రూపొందిస్తున్నారు. లైగర్ చిత్రం ఆగస్ట్ 25న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకానుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Rajasekhar: మీ ఆశీస్సుల వల్లే బతికున్నాను.. శేఖర్‌ సినిమా సాంగ్‌ లాంఛ్‌లో రాజశేఖర్‌ భావోద్వేగం..

Bhanu Shree: లేహంగాలో అట్రాక్ట్ చేస్తున్న భాను శ్రీ లేటెస్ట్ ఫోటోస్ వైరల్

CPI Narayana: జగన్ చిన్న పిల్లాడు.. నాగార్జున అంటే నాకు అసహ్యం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన నారాయణ