నటి ఇంట్లోకి చొరబడిన ఆగంతకుడు.. ఆమె తండ్రిపై కత్తితో దాడి.. చివరకు పోలీసుల ఎంట్రీ..

Sonalee Kulkarni: సినీ నటుడు సోనాలి కులకర్ణి ఇంట్లోకి ఆగంతుడు ఆయుధాలతో చొరబడ్డాడు. ఆమె తండ్రిపై కత్తితో దాడి చేసి గాయపరిచాడు. చివరకు పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.

నటి ఇంట్లోకి చొరబడిన ఆగంతకుడు.. ఆమె తండ్రిపై కత్తితో దాడి.. చివరకు పోలీసుల ఎంట్రీ..
Sonalee Kulkarni

Edited By:

Updated on: May 26, 2021 | 4:20 PM

Sonalee Kulkarni: మరాఠీ సినీ నటి సోనాలి కులకర్ణి ఇంట్లోకి ఆగంతుడు ఆయుధాలతో చొరబడ్డాడు. ఆమె తండ్రిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మాహారాష్ట్ర పుణెలోని పింప్రి చించ్ వాద్‏లో సోనాలీ నివాసముంటున్నారు. ఓ దుండగుడు మంగళవారం రాత్రి టెర్రస్ పై నుంచి నేరుగా ఇంట్లోకి ప్రవేశించాడు. అక్కడున్న పనిమనిషిని గమనించిన ఆ నిందుతుడు..తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెను బెదిరించాడు. తనను పట్టుకునేందుకు పోలీసులు వచ్చారని..చప్పుడు చేయకుండా.. ఎక్కడ దాక్కోవాలో చెప్పమని బెదిరించాడు.

ఆ సమయంలోనే అక్కడకు వచ్చిన సోనాలి తండ్రి మనోహర్ సదరు ఆగంతకుడిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోని ఆ ఆగంతకుడు దాడి చేయగా.. మనోహర్ కు గాయాలయ్యాయి. అనంతరం అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. మనోహర్ అరుపులు విని అప్రమత్తమై కాలనీవాసులు అతడిని పట్టుకొని పోలీసులకు అప్పజెప్పారు. అతని దగ్గరి నుంచి ఒక ఫేక్ గన్, కత్తిని స్వాధీనం చేసుకున్నారు.  అయితే సదరు వ్యక్తి సోనిలి ఇంట్లో దోపిడీకి వచ్చాడా? మరో కారణం ఏదైనా ఉందా? అని పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఆగంతకుడు సోనాలి అభిమాని అయి ఉండొచ్చని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. సోనాలీ కులకర్ణి ఈ నెల మొదటి వారంలో దుబాయ్ లో చార్టర్డ్ అకౌంటెంట్ కునాల్ బెనోడెకర్‌ను వివాహం చేసుకున్నారు.

Also Read: వారి అకౌంట్లోకి రూ. 1500 వేస్తున్న ప్రభుత్వం.. మే 31 చివరితేదీ.. ఎలా అప్లై చేసుకోవాలంటే..

Chandrababu Letter to DGP: అక్రమ కేసులతో వేధింపులు ఆపండి.. ఏపీ డీజీపీకి లేఖ రాసిన టీడీపీ అధినేత చంద్రబాబు

Anandayya Natumandu: ఆనందయ్య నాటు మందుతో దుష్పరిణామాలు.. నెల్లూరు ఆసుపత్రిలో పెరుగుతున్న బాధితుల సంఖ్య..?