Actress Sreevani: బుల్లితెర నటి శ్రీవాణి ఇక మాట్లాడలేదా ?.. సీరియస్ విషయం అంటూ చెప్పిన ఆమె భర్త..

|

Jul 26, 2022 | 6:26 PM

ఎప్పుడూ గల గల మాట్లాడే శ్రీవాణి వారం నుంచి మాట్లాడలేకపోతోంది. నిజంగానే సీరియస్ విషయం అంటూ చెప్పుకొచ్చాడు.

Actress Sreevani: బుల్లితెర నటి శ్రీవాణి ఇక మాట్లాడలేదా ?.. సీరియస్ విషయం అంటూ చెప్పిన ఆమె భర్త..
Sreevani
Follow us on

బుల్లితెర నటి శ్రీవాణి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఫ్యామిలీ ఆడియన్స్‏కు ఆమె సుపరిచితురాలు. ఎన్నో సీరియల్స్, సినిమాల ద్వారా ప్రేక్షకులకు చేరువయ్యింది శ్రీవాణి. ఓవైపు సీరియల్స్ చేస్తున్న ఆమె.. గత కొద్ది కాలం క్రితం స్వయంగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. అందులో కుటుంబ విషయాలు, రోజూ వారీ లైఫ్ స్టైల్, షూటింగ్ అప్డే్ట్స్ ఇలా అనేక వీడియోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లను అలరిస్తుంటుంది. ఆమె షేర్ చేసే వీడియోలకు అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. అయితే తాజాగా ఆమె షేర్ చేసిన వీడియో చూసి ఫాలోవర్లను షాకయ్యారు. అందులో ఆమె భర్త మాట్లాడుతూ.. ఎప్పుడూ గల గల మాట్లాడే శ్రీవాణి వారం నుంచి మాట్లాడలేకపోతోంది. నిజంగానే సీరియస్ విషయం అంటూ చెప్పుకొచ్చాడు.

గల గల మాట్లాడే శ్రీవాణి ఒక వారం రోజుల నుంచి సరిగ్గా మాట్లాడలేక పోతుంది. దీంతో డబ్బింగ్ ఆర్టిస్ట్ తో ఓ యాడ్ చెప్పించాము. అంతేకాకుండా వాయిస్ చెక్ చేసుకోండి అంటూ కామెంట్స్ కూడా పెట్టారు. ముందు ఆమె గొంతు సరిగా రాకపోతే జలుబు వల్లేమో అనుకున్నాం. కానీ వారం రోజుల నుంచి ఆమె గొంతు పూర్తిగా పోయింది. అసలేమి మాట్లాడటానికి రావట్లేదు. డాక్టర్ దగ్గరకు వెళ్తే.. నెల రోజుల వరకు ఆమె అస్సలు మాట్లాడకూడదని చెప్పాడు. నెల తర్వాత ఆమె మళ్లీ నార్మల్ అవుతుందన్న నమ్మకం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి