విలక్షణ నటుడు మోహన్ బాబు కుటుంబసమేతంగా ప్రధాని నరేంద్ర మోడీని భేటీ అయిన సంగతి తెలిసిందే. అటు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కూడా ఆయన ఈ రోజే కలవడంతో అటు రాజకీయంగానూ.. ఇటు సినీ ఇండస్ట్రీ పరంగానూ హాట్ టాపిక్‌గా మారింది. అయితే.. మోహన్ బాబును మోదీ బీజేపీలోకి ఆహ్వానించినట్టు సమాచారం. దానిపై మోహన్ బాబు కూడా క్లారిటీ ఇచ్చేశారు. అయితే.. ఇదంతా ఒకటైతే.. ఇప్పుడు మరో చర్చ బయటకు వచ్చింది. మోడీతో.. మోహన్ బాబు భేటీ వెనుక ఇంకో ఆంతర్యం ఉందని ఫిల్మ్ వర్గాల్లో ఓ న్యూస్ గుప్పుమంది. దీంతో.. అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ విలక్షణ నటుడికి ఇప్పటిదాకా ‘పద్మశ్రీ అవార్డు’ మాత్రమే వచ్చింది. అయితే.. తన సమకాలీలులు మరింత ముందుకెళ్లి ‘పద్మ భూషణ్’, ‘పద్మ విభూషణ్’ లాంటి అవార్డులు పొందిన నేపథ్యంలో తాను కూడా అప్‌గ్రేడ్ కావాలన్న దూరదృష్టితో.. మోహన్ బాబు మోడీని కలిసినట్టు టాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇండస్ట్రీలో తనకు క్లోజ్ ఫ్రెండ్స్ అయిన.. చిరంజీవికి, రజనీకాంత్‌కి ‘పద్మ విభూషణ్’ ఆల్రెడీ వచ్చింది. మోహన్ బాబు తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి కంటే సీనియర్. అయినా ఇప్పటికీ మోహన్ బాబుకు ‘పద్మవిభూషణ్’ రాలేదు.
గతంలో కూడా.. 75 ఇయర్స్ టాలీవుడ్ సెలెబ్రేషన్స్‌లో ఎవరు లెజెండ్రీ యాక్టర్స్ అనే విషయంపై రచ్చ జరిగిన విషయం తెలిసిందే. అంతేకాదు. ఇదే విషయంపై గతంలో ఫుల్లుగా చర్చలు కూడా జరిగాయి. ఇదివరకు చిరంజీవికి, మోహన్ బాబులకి మాటల యుద్ధం జరిగింది. అయితే తాజాగా.. జరిగిన ‘మా డైరీ’ ఆవిష్కరణలో మాత్రం.. అలాంటివి ఎన్నో వస్తూంటాయి.. అవన్నీ మేము పట్టించుకోము అంటూ ఇద్దరూ హగ్ చేసుకోని.. కిస్‌లు పెట్టుకోవడం వైరల్‌గా మారింది. మొత్తానికి.. తనకు ‘పద్మ విభూషణ్’ రావడం కొరకే.. మోహన్ బాబు ఇన్‌డైరెక్ట్‌గా ప్రయత్నం చేస్తున్నారని సమచారం.
నిజానికి చిరంజీవి ఎచీవ్‌మెంట్స్‌తో పోల్చితే మోహన్‌బాబు ఎచీవ్‌మెంట్స్ ఎక్కువనే చెప్పాలి. హీరోగా, కమేడియన్‌గా, విలన్‌గా పలు చిత్రాల్లో అన్ని రకాల పాత్రలను పోషించారు. మోహన్ బాబు నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీ రామారావుకు ధీటుగా ఆయన నటించేవారు. ప్రతీ సినిమాలో మోహన్ బాబు డైలాగ్స్‌కి.. ఫిదా అవని వారుండరు. అందుకే ఆయన్ని ‘డైలాగ్ కింగ్’, ‘కలెక్షన్స్ కింగ్’ అంటూంటారు. ఇక సినీ ఇండస్ట్రీతో సంబంధం లేకుండానే.. తానే స్వయంగా విద్యాసంస్థలను స్థాపించారు. అంతేకాకుండా.. పలువురికి పలు విధాలైన సహాయ సహకారాలు కూడా అందించేవారు. దీంతో.. ఆయనేమీ ‘పద్మ విభూషన్’ అవార్డుకు తక్కువేమీ కాదని.. అందుకు అనుగుణంగానే మోదీతో.. దగ్గరి సంబంధాలు మెయిన్‌టైన్ చేస్తున్నారని ఫిల్మ్ వర్గాల టాక్.
కాగా.. అటు పీఎం మోడీ కూడా మోహన్ బాబు వంటి యాక్టర్స్‌ని ఎంతో గౌరవంగా ట్రీట్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంతేకాదు.. మోహన్ బాబు భేటీ ఫొటోలను కూడా పీఎం తన ట్విట్టర్‌లో షేర్ చేయడం గమనార్హం.
It was a delight to meet your family and you, @themohanbabu.
We had very good discussions on many issues including the importance of cinema and how we can deepen cultural linkages between people. https://t.co/hCmcGumRyy pic.twitter.com/5jH0wQnlmb
— Narendra Modi (@narendramodi) January 6, 2020