TV Serials TRP Rating: గుప్పెడంత మనసుకు షాక్ ఇచ్చిన నాగపంచమి.. మొదటి ప్లేస్‌లో బ్రహ్మముడి.. ఫ్యాన్స్ మధ్య మొదలైన వార్..
వాస్తవానికి 'కార్తీక దీపం' సీరియల్ నుఢీ కొట్టి మొదటి ప్లేస్ కు చేరుకున్న గుప్పెడంత మనసు సీరియల్ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. కార్తీక దీపం సీరియల్ ఎండ్ కార్డు పడిన తర్వాత గుప్పెడంత మనసు మొదటి ప్లేస్ ను దక్కించుకుంది. అయితే ఓ వైపు ఫ్యామిలీ నేపధ్యం.. కూతుళ్ళ పెళ్లి కోసం తల్లి పడే తపన వంటి కథతో బ్రహ్మముడి సీరియల్ రోజు రోజుకీ ప్రేక్షకాదరణ సొంతం చేసుకోవడం.. మరోవైపు గాడి తప్పిన కథతో గుప్పెడంత మనసు ప్రేక్షకాదరణ కోల్పోయింది.
తెలుగు తెరపై ఎన్ని ప్రోగ్రామ్స్, సినిమాలు , విభిన్న కార్యక్రమాలు వచ్చినా సీరియల్స్ స్థానం వెరీ వెరీ స్పెషల్. బుల్లి తెర ప్రేక్షకులను సీరియల్స్ ఆకట్టుకుని అగ్రస్థానంలో సంవత్సరాలకు సంవత్సరాలు కొనసాగుతూనే ఉంటాయి. తెలుగు బుల్లి తెరపై స్టార్ మా లో ప్రసారం అవుతున్న సీరియల్స్ టాప్ రేంజ్ లో దూసుకుపోతూ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ లో మొదటి ప్లేస్ లో దూసుకుపోతోంది. అయితే గత వారం వరకూ టాప్ 5 సీరియల్స్ లో స్టార్ మా లో ప్రసారం అయ్యేవి ఉండేవి.. కాగా ఈ వారం జీ తెలుగులో ప్రసారం అవుతున్న రెండు సీరియల్స్ టాప్ 5 లో చోటు దక్కించుకున్నాయి.
స్టార్ మా లో కార్తీక దీపం సీరియల్ ప్లేస్ లో ప్రసారం అవుతున్న బ్రహ్మముడి సీరియల్ మొదటి ఎపిసోడ్ నుంచి ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుంది. గుప్పెడంత మనసును వెనక్కి నెట్టి మొదటి ప్లేస్ ను దక్కించుకుంది. వాస్తవానికి ‘కార్తీక దీపం’ సీరియల్ నుఢీ కొట్టి మొదటి ప్లేస్ కు చేరుకున్న గుప్పెడంత మనసు సీరియల్ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. కార్తీక దీపం సీరియల్ ఎండ్ కార్డు పడిన తర్వాత గుప్పెడంత మనసు మొదటి ప్లేస్ ను దక్కించుకుంది. అయితే ఓ వైపు ఫ్యామిలీ నేపధ్యం.. కూతుళ్ళ పెళ్లి కోసం తల్లి పడే తపన వంటి కథతో బ్రహ్మముడి సీరియల్ రోజు రోజుకీ ప్రేక్షకాదరణ సొంతం చేసుకోవడం.. మరోవైపు గాడి తప్పిన కథతో గుప్పెడంత మనసు ప్రేక్షకాదరణ కోల్పోయింది.
స్టార్ మా లో ప్రసారం అవుతున్న బ్రహ్మ ముడి 11.24 రేటింగ్ తో మొదటి ప్లేస్ లో ఉండగా.. నాగ పంచమి 10.65 రేటింగ్ తో రెండో స్థానంలో కొనసాగుతుంది. ఇకస్టార్ మా లో ప్రసారం అవుతున్న కృష్ణ ముకుంద మురారి 10.59 రేటింగ్ తో మూడో స్థానంలో కొనసాగుతుంది. అయితే ఈ సారి జీ తెలుగులో ప్రసారం అవుతున్న ప్రేమ ఎంత మధురం 7.42 రేటింగ్ తో నాలుగో స్థానంలో .. త్రినయని 7.36 రేటింగ్ తో ఐదో ప్లేస్ లో కొనసాగుతుంది. అయితే ఇప్పటి వరకూ టాప్ 5 స్థానాల్లో ఉన్న గుప్పెడంత మనసు సీరియల్ కనీసం టాప్ టెన్ లో కూడా చోటు దక్కించుకోలేదు.
దీనికి కారణం ఒకటి కథలో పట్టు కోల్పోవడం అయితే మరొకటి.. రాత్రి 7 గంటలకు ప్రసారం అయ్యే ఈ సీరియల్ ఇప్పుడు టైం మార్చుకుని సాయంత్రం 6 గంటలకు ప్రసారం కావడం .. టైమింగ్ ఛేంజ్ చేయడంతో ఆ ప్రభావం టీఆర్‌పీపై పడింది.. 4.03 రేటింగ్ తో గుప్పెడంత మనసు ప్రస్తుతం 23వ ప్లేస్ లో కొనసాగుతుంది.
మరోవైపు బ్రహ్మముడి- గుప్పెడంత మనసు సీరియల్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వేదికగా ఓ రేంజ్ లో గొడవ కొనసాగుతుంది. బ్రహ్మముడి సీరియల్ ఇంకా అయిపోలేదా ఎవర్రా కావ్య-రాజ్.. నంబర్ 1 జోడి రిషిధార ఇక్కడ” అని ఒకరు కామెంట్ చేస్తే.. అందుకనే బ్రహ్మ ముడి టాప్ లో ఉంది.. మీ సీరియల్ ను ఇప్పుడు ఎవరు చూస్తున్నారో మీకైనా తెలుసా అంటూ సమాధానం చెబుతున్నారు.
ఇప్పటి వరకూ వెండి తెరపై హీరోల విషయంలో కనిపించే ఈ గొడవ.. ఇప్పుడు సీరియల్స్ కు పాకింది.. రెండూ ఒకే ఛానల్ లో ప్రసారం అవుతున్నా మా సీరియల్ గొప్ప అంటే మా సీరియల్ గొప్ప అంటూ ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో కామెంట్స్ తో వార్ చేసుకుంటున్నారు.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..