Ravindar Chandrasekaran Mahalakshmi: నిర్మాతను పెళ్లాడిన సీరియల్ నటి.. నెట్టింట వైరలవుతున్న ఫోటోస్..

వాణి రాణి, ఆఫీస్, చెల్లమాయ్, ఉతిరిపూక్కల్, ఒరు కై ఒసై వంటి సీరియల్స్ ద్వారా మహాలక్ష్మీ గుర్తింపు పొందారు. ఇక లిబ్ర ప్రొడక్షన్ సంస్థ అధినేత రవీందర్ నిర్మించనున్న

Ravindar Chandrasekaran Mahalakshmi: నిర్మాతను పెళ్లాడిన సీరియల్ నటి.. నెట్టింట వైరలవుతున్న ఫోటోస్..
Mahalakshmi

Updated on: Sep 02, 2022 | 11:03 AM

ప్రముఖ తమిళ్ సీరియల్ నటి మహాలక్ష్మీ.. బడా ప్రొడ్యూసర్ రవిందర్ చంద్రశేఖరన్ వివాహం చేసుకున్నారు. గురువారం తిరుపతిలో ఇరువురి కుటుంబసభ్యుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. ప్రస్తుతం వీరి వివాహనికి సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. వీరిద్దరికి ఇదివరకే పెళ్లిళ్లు అయ్యాయి. వారి భాగస్వాములతో విడిపోయిన వీరు గత కొద్దిరోజులుగా ప్రేమలో ఉన్నారు. ఇక ఇప్పుడు మూడు మూళ్ల బంధంతో ఒకటయ్యారు. తమ పెళ్లి ఫోటోలను నిర్మాత రవీందర్ తన ఇన్ స్టా వేదికగా షేర్ చేస్తూ స్పెషల్ నోట్ రాసుకొచ్చారు.

వాణి రాణి, ఆఫీస్, చెల్లమాయ్, ఉతిరిపూక్కల్, ఒరు కై ఒసై వంటి సీరియల్స్ ద్వారా మహాలక్ష్మీ గుర్తింపు పొందారు. ఇక లిబ్ర ప్రొడక్షన్ సంస్థ అధినేత రవీందర్ నిర్మించనున్న రెండు చిత్రాల్లోనూ మహాలక్ష్మీ నటిస్తున్నట్లు తెలుస్తోంది. నువ్వు నా జీవితంలో ఉండడం నా అదృష్టం.. నీ ఆప్యాయత నా జీవితం.. లవ్ యూ అమ్ము.. అంటూ తన పెళ్లి ఫోటోలను షేర్ చేసింది మహాలక్ష్మీ.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.