Boycott Pavitra Rishta 2: సుశాంత్ సింగ్ స్థానంలో మరొకరిని ఊహించుకోలేము.. ఆ సీరియల్‏ను వెంటనే ఆపేయండి.. నెట్టింట్లో సుశాంత్ ఫ్యాన్స్..

Boycott Pavitra Rishta 2:  సుశాంత్ సింగ్ రాజ్‏పుత్ గురించి తెలియని వారుండరు.. 2009లో ఏక్తాకపూర్ తెరకెక్కించిన 'పవిత్ర రిష్తా' సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమయ్యాడు సుశాంత్ సింగ్..

Boycott Pavitra Rishta 2: సుశాంత్ సింగ్ స్థానంలో మరొకరిని ఊహించుకోలేము.. ఆ సీరియల్‏ను వెంటనే ఆపేయండి.. నెట్టింట్లో సుశాంత్ ఫ్యాన్స్..
Pavitra Rishta 2

Edited By: Rajitha Chanti

Updated on: Jul 13, 2021 | 4:50 PM

Boycott Pavitra Rishta 2:  సుశాంత్ సింగ్ రాజ్‏పుత్ గురించి తెలియని వారుండరు.. 2009లో ఏక్తాకపూర్ తెరకెక్కించిన ‘పవిత్ర రిష్తా’ సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమయ్యాడు సుశాంత్ సింగ్.. ఈ సీరియల్ అప్పట్లో ప్రభంజనం సృష్టించింది. ఇందులో సూశాంత్ సింగ్ మానవ్ పాత్రలో నటించగా.. అర్చనగా అంకిత లోఖండే నటించింది. ఈ సీరియల్‏లో వీరిద్దరి నటనకు బుల్లితెర ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దాదాపు ఐదు సంవత్సరాలు నిరంతరంగా ప్రసారమైన ఈ పవిత్ర రిష్తా సీరియల్ ఇప్పటికీ బుల్లితెరపై ఓ రికార్డు. తాజాగా ఈ సీరియల్ రెండో సీజన్ తర్వలో ప్రసారం కానుందంటూ ఆల్ట్ బాలాజీ ఇన్‏స్టాగ్రామ్‏లో వెల్లడించింది.

“ఆర్డినరీ జీవితాల్లో కొన్నిసార్లు ఎక్స్‏ట్రార్డినరీ లవ్‏స్టోరీలు కూడా కనిపిస్తుంటాయి. పవిత్ర రిష్తా షూటింగ్ జరుపుకుంటుంది. త్వరలో ఆల్ట్ బాలాజీలో స్ట్రీమింగ్ కానుంది ” అంటూ ప్రకటించింది. అయితే మరోసారి అర్చన పాత్రను అంకిత లోఖండే చేస్తుండగా.. మానవ్ పాత్రలో నటించేందుకు షాహీర్ అనే మరో పాపులర్ బుల్లితెర నటుడిని ఎంపిక చేసినట్లుగా ఫోటోతో సహా షేర్ చేశారు మేకర్స్.

ఇంతవరకు బాగానే ఉంది.. కానీ సుశాంత్ పాత్రలో మరోకరిని ఊహించుకోలేమంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియాలో మరో వివాదానికి తెరలేపారు. సుశాంత్ వల్లే పవిత్ర రిష్తా సీరియల్ హిట్ అయ్యిందని.. అలాంటిది అతడు లేకుండా రెండో సీజన్ ఎలా తీస్తారంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. “మానవ్ అంటే ఒక పేరు కాదు. అది ఒక ఎమోషన్.. మానవ్ 2గా సుశాంత్ కాకుండా.. మరొకరిని ఊహించుకోలేమంటూ” #BoycottPavitraRishta2 అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్‌ చేస్తున్నారు. అలాగే సుశాంత్ సింగ్ పాత్రలో మరోకరు నటిస్తుంటే.. ఇందులో నటించడానికి అంకిత ఒప్పుకునేది కాదని.. తనది నిజమైన ప్రేమ కాదని నెటిజన్లు నటి అంకిత లోఖండేను ట్రోల్ చేస్తున్నారు.

ట్వీట్స్..

 

Also Read: అందానికి కేరాఫ్ అడ్రస్ ఆమె రూపం.. మాస్క్ పెట్టుకుని ఫోజిచ్చిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి చూద్దాం..

Vijay Thalapathy: తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతికి షాకిచ్చిన హైకోర్టు.. భారీగా జరిమానా విధిస్తూ ఆదేశాలు..