Aadavaallu Meeku Joharlu: యంగ్ హీరో శర్వానంద్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆడవాళ్లు మీకు జోహార్లు. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 25న విడుదల కాబోతోంది. ఈ సినిమాను ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రయూనిట్ తమ ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించింది. ఎట్టకేలకు ఈ సినిమా ఫిబ్రవరిలో థియేటర్లలోకి రానుంది. ఈ మూవీలో కుష్బూ, రాధిక శరత్ కుమార్, ఊర్వశీ వంటి వారు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఫిబ్రవరి 4వ తేదీ నుంచి నుంచి మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలు కాబోతోన్నాయి.
ఫిబ్రవరి 4న టైటిల్ సాంగ్ (ఆడవాళ్లు మీకు జోహార్లు)ను రిలీజ్ చేయబోతోన్నారు. ఫిబ్రవరి 4 సాయంత్రం 4:05 గంటలకు ఈ ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేయనున్నారు. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్‌లో శర్వా స్టైలీష్ లుక్ లో కనిపిస్తున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. టైటిల్‌ను బట్టి చూస్తే ఇది మహిళా ప్రాధాన్యమున్న చిత్రంగా కనిపిస్తోంది. మంచి అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్న సుధాకర్ చెరుకూరి ఈ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్‌ను నిర్మిస్తున్నారు. సుజిత్ సారంగ్ ఈ చిత్రానికి కెమెరామెన్‌గా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :