ప్రస్తుతం సీనియర్ హీరోయిన్స్ బుల్లితెరపై సందడి చేస్తున్నారు. ఇప్పటికే నటి రోజా జబర్దస్త్ షోలో అలరించగా.. ఇప్పుడు ఖుష్బూ, ఇంద్రజ, రమ్యకృష్ణ వంటి తారలు రియాల్టీ షోలలో న్యాయనిర్ణేతలుగా మెప్పిస్తున్నారు. తాజాగా అలనాటి హీరోయిన్ రాధా సైతం రియాల్టీ షో కోసం రంగంలో దిగిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ జోడి అంటూ వస్తున్న డాన్స్ షోకు జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు రాధా.. ఈషోకు శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరిస్తుంది. ఇక ఇందులో రాధాతోపోటు.. సీనియర్ కొరియోగ్రాఫర్ తరుణ్ మాస్టర్, హీరోయిన్ సదా జడ్జీలుగా ఉండనున్నారు. అయితే తాజాగా ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. అందులో బిగ్ బాస్ జోడిలుగా డివైడ్ అయినవారంత ఫెర్ఫార్మన్స్ లతో అదరగొట్టారు. స్టేజ్ పై రాధా, తరణ్ మాస్టర్ కూడా సందడి చేశారు. అయితే ప్రోమో చివరికి వచ్చేసరికి రాధా కన్నీళ్లు పెట్టుకున్నారు.
బిగ్ బాస్ అవినాష్, అరియానా జంటగా పెర్ఫర్మ్ చేశారు. ఆ తర్వాత జడ్జిమెంట్ సమయంలో అవినాష్.. సూపర్ స్టార్ కృష్ణ వాయిస్ ఇమిటెట్ చేశారు. రాధాగారు..మిమ్మల్ని చూస్తుంటే ఆనాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. ఎలా ఉన్నారు అంటూ కృష్ణ వాయిస్ తో పలకరించగా.. రాధా భావోద్వేగానికి గురయ్యారు. సూపర్ స్టార్ కృష్ణతోపాటు రాధా పలు చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరలవుతుంది.
కేవలం కృష్ణతో మాత్రమే కాకుండా.. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి స్టార్స్ హీరోలతో కలిసి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు రాధా. చాలాకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఆమె…ఇప్పుడు బుల్లితెరపై సందడి చేసేందుకు రెడీ అయ్యారు.