‘ఆర్ఆర్ఆర్’ టైటిల్.. క్లారిటీ ఎప్పుడు వస్తుందో!

పాన్ ఇండియాగా తెరకెక్కుతోన్న 'ఆర్ఆర్ఆర్' సినిమా షూటింగ్.. ఇప్పటి వరకూ 80 శాతం పూర్తైందని సమాచారం. అయినా ఇప్పటికే దీని టైటిల్ ఏమిటన్న విషయంపై స్పష్టత లేదు. వచ్చే సంవత్సరం జనవరి 8వ తేదీన ఈ చిత్రాన్ని..

'ఆర్ఆర్ఆర్' టైటిల్.. క్లారిటీ ఎప్పుడు వస్తుందో!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 12, 2020 | 10:17 AM

RRR Movie News: ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ‘బాహుబలి’ తర్వాత.. మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడానికి దర్శకధీరుడు రాజమౌళి సిద్ధమవుతున్నారు. ఈ క్రేజీ మల్టీస్టారర్‌లో ఎన్టీఆర్, చెర్రీలు నటిస్తోన్న సంగతి తెలిసిందే. మొదటిసారిగా వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు. దీంతో ఈ ప్రాజెక్టు ప్రకటించినప్పటి నుంచీ భారీ అంచనాలే నెలకొన్నాయి.

పాన్ ఇండియాగా తెరకెక్కుతోన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్.. ఇప్పటి వరకూ 80 శాతం పూర్తైందని సమాచారం. అయినా ఇప్పటికీ దీని టైటిల్ ఏమిటన్న విషయంపై స్పష్టత లేదు. వచ్చే సంవత్సరం జనవరి 8వ తేదీన ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’కు మంచి టైటిల్‌ను ప్రేక్షకులు సూచించాలని చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

వాటిల్లో కొన్ని టైటిల్స్‌కు మంచి స్పందన వచ్చింది. అవి ‘రామ రావణ రాజ్యం’, ‘రఘుపతి రాఘవ రాజారామ్’. ఈ రెండింటిలో.. ‘రామ రావణ రాజ్యం’ టైటిల్‌కి అధిక స్పందన వచ్చిందట. ఇక హిందీలో ఈ సినిమాకు ‘రామ్ రావణ్ రాజ్’ అన్న పేరు పెట్టాలని డైరెక్టర్ రాజమౌళి అనుకుంటున్నట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరి ఇక ‘ఆర్ఆర్ఆర్’ టైటిల్ ఇదేనా అన్నది అధికారిక ప్రకటన వచ్చేదాకా ఆగాల్సి ఉంటుంది.

Read More this also: వైసీపీ ఆవిర్భావ రోజు.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్

మహిళా సీఐపై చేయి చేసుకున్న వైసీపీ నేత..

లాయర్ తల పగిలింది.. మేము ప్రాణాలతో.. వస్తామో.. రామో..

మరో 10 రోజుల్లో భారీగా తగ్గనున్న పెట్రోల్ ధరలు.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ఎస్‌బీఐ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. మినిమమ్ బ్యాలెన్స్ రూల్ తొలగింపు