బిగ్బాస్ సీజన్ 5 ఇప్పుడు ఫినాలే రేస్ జరుగుతుంది. ఫినాలే టికెట్ సాధించడానికి ఇంటి సభ్యులు తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో వారికి దశల వారిగా టాస్కులు పెడుతున్నాడు బిగ్బాస్. అయితే నిన్నటి ఎపిసోడ్ లో పెట్టిన ఐస్ గేమ్ తో ఇంటి సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు.
ఐస్ టబ్బులో కాళ్లు పెట్టి ఉండాలని.. మధ్యలో కాళ్లు బయటకు తీయవచ్చని సూచించాడు బిగ్బాస్. కానీ హౌస్ మేట్స్ మొండితనంతో ఐస్ లో కాళ్లు పెట్టి ఉంచడంతో చివరికి కాళ్లు కదపలేని స్థితికి చేరుకున్నారు. శ్రీరామచంద్ర, షణ్ముఖ్, సిరి కాళ్లు వాపులు వచ్చాయి. అయితే గేమ్ తర్వాత వెంటనే ఎవరు వేడి నీళ్లు ఉపయోగించకూడదని బిగ్బాస్ ముందుగానే హెచ్చరించాడు. కానీ అవేం పట్టించుకోకుండా ప్రియాంక.. శ్రీరామచంద్రకు సహయం చేయడానికి వచ్చింది. తిమ్మిర్లతో ఇబ్బంది పడుతున్న శ్రీరామచంద్ర కాళ్లకు వేడినీళ్లు చల్లింది. దీంతో శ్రీరామచంద్ర పూర్తిగా నడవలేని పరిస్థితికి చేరుకున్నాడు. దీంతో అతడిని మెడికల్ రూంకు తీసుకెళ్లి .. కాళ్లకు కట్లు కట్టి పంపించాడు బిగ్బాస్. దీంతో శ్రీరామచంద్ర ఎమోషనల్ అయ్యాడు.
అయితే శ్రీరామచంద్ర పరిస్థితి చూసి సన్నీ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎప్పటికప్పుడు శ్రీరామచంద్రకు సహాయంగా ఉంటూ అతడిని నవ్విస్తున్నాడు. ఇక శ్రీరామచంద్ర పరిస్థితి చూసి ప్రేక్షకులకు సైతం కళ్లు చెమ్మగిల్లకమానవు. శ్రీరామ్ పరిస్థితి చూసి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ సైతం ఎమోషనల్ అయ్యారు. ఇంట్లో జెన్యూన్ పర్సన్ , రామ్ నీకోసం మేమంతా ఉన్నాము.. ప్లే స్ట్రాంగ్.. నీకోసం ప్రార్థిస్తుంటాను త్వరగా కోలుకోవాలి అంటూ ప్రియ ఎమోషనల్ అయ్యింది.
Also Read: Samantha: బాలీవుడ్లో పాగా వేయనున్న సమంత.. మరో మూడు ప్రాజెక్టులకు సామ్ గ్రీన్ సిగ్నల్ ?..
Akhanda: థియేటర్లలో అఖండ విజృంభణ.. ఓవర్సీస్లో బాలయ్య సినిమా మాస్ జాతర..
Akhanda Movie: అఖండ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్‌లో అగ్నిప్రమాదం.. పరుగులు తీసిన ఫ్యాన్స్..