బుల్లితెరపై యాంకర్‌కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. వీజేగా కెరీర్ ప్రారంభించిన ఆయన.. ఆ తర్వాత పాపులర్ షోలతో యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు.. ఓక్ ఎంటర్ టైన్మెంట్స్ పేరుతో సొంత ప్రొడక్షన్ హౌస్ ఏర్పాటు చేసి చిత్రాలను నిర్మిస్తున్నాడు. ఇప్పటివరకు ఓంకార్ ఆట, ఛాలెంజ్, అదృష్టం, సిక్స్త్ సెన్స్ వంటి రియాల్టీ షోలతో బుల్లితెరపై స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. అలాగే రాజు గారి గది సినిమాతో దర్శక నిర్మాతగానూ గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే వీటన్నింటి కంటే గతంలో ఓంకార్ నిర్వహించిన కిడ్స్ షో మాయాద్వీపం.. ఎంతగా విజయవంతం అయ్యిందో చెప్పాల్సిన పనిలేదు. ఓంకార్ మాయాద్వీపం అంటే పిల్లలకు ఇష్టం ఎక్కువే. పిల్లల నుంచి పెద్దల వరకు ఈ షో చూస్తుంటారు. 2007లో మొదలైన ‘మాయా ద్వీపం’ రియాలిటీ షో… తొలిసారి మూడేళ్ళు, ఆ తర్వాత కొంత గ్యాప్ తర్వాత రెండేళ్ళు కొనసాగింది.
తాజాగా మరోసారి ఈ షోను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. దాదాపు ఏడేళ్ల తర్వాత జీ తెలుగులో ప్రసారం కాబోతున్న ఈ షోకు సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో అద్భుత దీపం కోసం కొందరు పిల్లలు ఓ పురాతన భవనంలోకి వెళ్తారు. భయంకరమైన ఆ భవనంలో వారికి ఓ డిఫరెంట్ గెటప్ లో ఓంకార్ కనిపిస్తాడు. ‘అద్భుత దీపం’ కోసం వెతకాల్సింది ఇక్కడ కాదని ‘మాయద్వీపం’లో అని చెబుతూ ప్రోమోలో విడుదల చేసారు ఓంకార్.. తాజాగా ఈ షో టెలికాస్ట్ డేట్ ప్రకటించారు నిర్వాహకులు. పిల్లలకు ఇష్టమైన.. మాయాద్వీపం జీతెలుగులో అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానుంది. రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది.
అలాగే ఈ షోను చూసేందుకు జీ తెలుగును సబ్ స్క్రైబ్ చేసుకోండి. జీ తెలుగు ప్రైమ్ ప్యాక్ నెలకు రూ. 20 మాత్రమే అంటూ చెప్పుకొచ్చారు మేకర్స్. మాయాద్వీపం యాంకర్, ప్రొడ్యూసర్ ఓంకార్ మాట్లాడుతూ, “మాయాద్వీపం నా డ్రీమ్ ప్రాజెక్ట్. నేను ఫస్ట్ టైం ప్రొడ్యూసర్‌గా మారింది ఈ షోతోనే. ఈ షో ఇచ్చిన ధైర్యంతోనే ఎన్నో షోస్‌ని నిర్మించాను. ఇప్పుడు ఏడేళ్ల తర్వాత మళ్లీ నేను ఈ షోను మీ అందరి ముందుకు తీసుకొస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. అంతకుమించి మీ అందరికి ఎంతో ఇష్టమైన పిల్లమర్రి రాజు, ఒంటికన్ను రాక్షసుడిని మరోసారి మీ అందరి ముందుకు తీసుకొస్తునందుకు చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా.. అభిమానుంలదరిని మరోసారి మాయ ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు అద్భుతమైన సెట్స్ డిజైన్ చేయడం జరిగింది ఇలాంటి సెట్స్ ఇప్పటివరకు ఏ తెలుగు టెలివిజన్ నాన్ ఫిక్షన్ షోలో చూసి ఉండరు. అలాగే ప్రోమో చూసిన తర్వాత వచ్చిన స్పందన చాలా ఆనందాన్ని కలిగించింది. ఈ షో అందరికి నచ్చుతుందని.. ఇప్పుడు పిల్లలకు మేము ఇంకా దగ్గరవుతామని భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు ఓంకార్. ఈ షో కి కంటెస్టెంట్స్ గా 6 – 12 ఏళ్ల పిల్లలు రావడం జరుగుతుంది. వారిని ఆడిషన్స్ పద్దతిలో సెలక్ట్ చేయడం జరిగింది. మాయద్వీపం అనగానే.. 12000+ పైగా ఎంట్రీస్ వచ్చినట్లుగా నిర్వాహకులు తెలిపారు.
Samantha: జోరు వానలో సమంత ప్రయాణం.. నిన్ను కచ్చితంగా చేరుకుంటాను అంటూ పోస్ట్.
Adivi Sesh: అడివి శేష్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. తాజా హెల్త్ అప్డేట్.. కోలుకుంటున్న హీరో..