ఆ సినిమాల్లో న‌టించేది ఈ ఇద్ద‌రి భామ‌లేనా?

ఆ సినిమాల్లో న‌టించేది ఈ ఇద్ద‌రి భామ‌లేనా?

ఏ సినిమాలో ఎవ‌రు న‌టిస్తారు? ఏ పాత్ర ఎవ‌రి సొంతం అవుతుంది? ఇవ‌న్నీ తెలియాలంటే ఆయా న‌టులు కెమెరా ముందుకొచ్చేంత‌వ‌ర‌కూ ఖ‌రారు కాదు. కానీ ఈ లోపు ప‌లువురు పేర్లు ప్ర‌చారంలో ఉంటాయి. అందులోనూ ఈ మ‌ధ్య ప‌లు సినిమాల‌కు...

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 10, 2020 | 2:43 PM

ఏ సినిమాలో ఎవ‌రు న‌టిస్తారు? ఏ పాత్ర ఎవ‌రి సొంతం అవుతుంది? ఇవ‌న్నీ తెలియాలంటే ఆయా న‌టులు కెమెరా ముందుకొచ్చేంత‌వ‌ర‌కూ ఖ‌రారు కాదు. కానీ ఈ లోపు ప‌లువురు పేర్లు ప్ర‌చారంలో ఉంటాయి. అందులోనూ ఈ మ‌ధ్య ప‌లు సినిమాల‌కు సంబంధించిన పుకార్లు కూడా బాగా వినిపిస్తున్నాయి. అందులో ఒక‌రు న‌య‌న తార‌, మ‌రోక‌రు రకుల్ ప్రీత్ సింగ్‌.

ఇటీవ‌లే హిందీలో విజ‌య‌వంత‌మైన ‘ఆంధాదున్’ ఫిల్మ్‌ని నితిన్ హీరోగా తెలుగులో రీమేక్ చేయాల‌నుకున్న విష‌యం తెలిసిందే. దీనికి మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇందులో మ‌ధ్య వ‌య‌స్కురాలి పాత్ర అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఆ రోల్‌ కోసం న‌య‌న‌తార‌ను సంప్ర‌దించార‌ని టాక్ వినిపిస్తుంది. అయితే దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి క్లారిటీ లేదు.

ఇక తెలుగులో తీయ‌బోతున్న ఓ బ‌యోపిక్ విష‌యంలో ర‌కుల్ ప్రీత్ పేరు వినిపిస్తోంది. ఫిట్‌నెస్క్‌కి పెట్టింది పేరు ర‌కుల్. దీంతో క‌ర‌ణం మ‌ళ్లీశ్వ‌రి బ‌యోపిక్‌లో న‌టించే అవ‌కాశాలున్నాయ‌ని, ఆమెతో సంప్ర‌దింపులు జ‌రుగుతున్నాయ‌ని ప్ర‌చారం సాగుతోంది. క‌రోనా ప‌రిస్థితుల నేప‌థ్యంలో చిత్ర ప‌రిశ్ర‌మ‌లో వ్య‌వ‌హార‌ల‌న్నీ ప్ర‌స్తుతం నిదానంగా సాగుతున్నాయి. షూటింగ్‌లు మ‌ళ్లీ ఊపందుకుంటేనే గాని ఎవ‌రు ఎందులో న‌టిస్తున్నార‌న్న‌ది స్ప‌ష్టత వ‌చ్చే అవ‌కాశాలున్నాయి.

Read More: 

మాజీ రెజ్ల‌ర్ జేమ్స్ హారిస్ క‌న్నుమూత‌..

జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి ప్ర‌ధాన‌ అనుచ‌రుడు మృతి

14 ఏళ్ల త‌ర్వాత దొరికిన ప‌ర్సు.. అవాక్క‌యిన వ్య‌క్తి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu