Krishna Mukunda Murari Episode September 14th, 2023: మురారీని హత్తుకుని పెళ్లి చేసుకుందాం అని రిక్వెస్ట్ చేసిన ముకుంద.. షాక్ తిన్న కృష్ణ..

|

Sep 14, 2023 | 7:14 AM

మురారీతో కృష్ణకు మన ప్రేమ విషయం మొత్తం చెప్పానని మురారీతో చెబుతుంది. మరోవైపు కృష్ణ ఏసీపీ సార్ కనిపించడం లేదని మురారీ కోసం వెదుకుతుంది. అదే సమయంలో మురారీ అయినా సరే ఇప్పుడు కృష్ణ దగ్గరికి వెళ్లి ఈ విషయం తన దగ్గర దాచినందుకు సారీ చెబుతా.. క్షమించమని అడుగుతా అని అంటాడు మురారీ. అయినా క్షమించకపోతే తన కాళ్ళమీద పడి వేడుకుంటా తన దగ్గర నాకు ఎలాంటి ఈగో ఫీలింగ్స్ లేవు అని అంటాడు మురారీ.

Krishna Mukunda Murari Episode September 14th, 2023: మురారీని హత్తుకుని పెళ్లి చేసుకుందాం అని రిక్వెస్ట్ చేసిన ముకుంద.. షాక్ తిన్న కృష్ణ..
Krishna Mukunda Murari
Follow us on

ముకుంద కృష్ణను తీసుకుని వెళ్లిందని తెలిసిన మురారీ కృష్ణకు ఫోన్ చేస్తాడు. ఫోన్ కూడా స్వీచ్ ఆఫ్ ఉండడంతో టెన్షన్ పడతాడు. ఎక్కడకు తీసుకుని వెళ్ళింది.. ఎందుకు తీసుకుని వెళ్ళింది. కృష్ణకు బుద్ధి లేదు నాకు ఒక్కమాట కూడా  చెప్పక్కర్లేదా అని అనుకుంటుంటే.. ముకుంద వస్తుంది. కృష్ణ ఏది అంటే.. అన్ని వివరంగా చెబుతా పైకి రా అంటుంది మురారీని.. వర్షం వస్తుంది కిందకు వెళ్దాం పద అంటుంటే.. అందుకే నిన్ను పైకి రమ్మన్నా మురారీ .. మనం ప్రేమించేవారికి తెలియకుండా తనివి తీరా ఏడ్చేలా చేస్తుంది అని అంటుంటే.. కృష్ణ ఏది దయచేసి కృష్ణ ఎక్కడుందో చెప్పు.. తనతో మన మేటర్ ఏమైనా చెప్పవా అని మురారీ అడుగుతుంటే.. అంటే నేను ఏమైపోయినా అక్కర్లేద కదా మురారీ.. నాకు ఓపిక లేదు ముకుంద..  నేను అడిగిన వాటికి సమాధానం చెబితే.. నన్ను నేను కూడా ప్రేమించుకోలేదు .. నా ప్రేమ నీకు ఎందుకు అర్ధం కావడం లేదు మురారీ అని అడుగుతుంది ముకుంద. చూడు ముకుంద కృష్ణ ఏమీ చిన్న పిల్ల కాదు నువ్వు చెప్పకపోయినా నేను తెలుసుకోగలను. వెతికి ఇంటికి తీసుకుని రాగాలను అంటాడు మురారీ.. అంటే నీ కంటికి నేను క్రిమినల్ లా కనిపిస్తున్నానా మురారీ అని అడుగుతుంది ముకుంద. కృష్ణని నీకు దొరక్కుండా ఎక్కడో దాచాను అనుకుంటున్నావా.. అంటే నేను అన్నది వేరు నువ్వు ఊహిస్తున్నది వేరు.. కృష్ణ నెంబర్ కలవడం లేదు..అందుకే నేను అమ్మ కంగారు పడుతున్నాం అని చెబుతాడు మురారీ..

కృష్ణకు మన ప్రేమ విషయం చెప్పా… ముకుంద

మురారీతో కృష్ణకు మన ప్రేమ విషయం మొత్తం చెప్పానని మురారీతో చెబుతుంది. మరోవైపు కృష్ణ ఏసీపీ సార్ కనిపించడం లేదని మురారీ కోసం వెదుకుతుంది. అదే సమయంలో మురారీ అయినా సరే ఇప్పుడు కృష్ణ దగ్గరికి వెళ్లి ఈ విషయం తన దగ్గర దాచినందుకు సారీ చెబుతా.. క్షమించమని అడుగుతా అని అంటాడు మురారీ. అయినా క్షమించకపోతే తన కాళ్ళమీద పడి వేడుకుంటా తన దగ్గర నాకు ఎలాంటి ఈగో ఫీలింగ్స్ లేవు అని అంటాడు మురారీ.

మురారీని హత్తుకున్న ముకుంద .. చూసి షాక్ తిన్న కృష్ణ

వెళ్ళబోతున్న మురారీని ఆపి ముకుంద నిను నిన్ను నాకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా.. నువ్వు లేకుండా నేను బతకలేను.. నా ప్రేమని రిజెక్ట్ చేయకు అని హత్తుకుంటుంది. వదులు ముకుంద ఇపుడు వదలకపోతే ఇంకెప్పుడు నీ ముఖం చూడను.. ముకుంద మురారీని హత్తుకున్నది కృష్ణ  చూస్తుంది. ప్లీజ్ మురారీ కృష్ణను వెంటనే ఇంట్లో నుంచి పంపించెయ్యి.. నా భర్తగా నిన్ను తప్ప ఎవరిని ఊహించుకొని.. అని ముకుంద రిక్వెస్ట్ చేస్తుంది. అత్తయ్యకు నిజం చెప్పేసి మన పెళ్లి చేయమని అడుగుదాం.. అత్తయ్య అర్ధం చేసుకుంటుంది.. ప్లీజ్ నా వల్ల కావడం లేదు అని ముకుంద అడుగుతుంటే.. ఏమి జరిగితే అది జరిగింది.. మన విషయం అందరికి చెప్పేద్దాం అని ముకుంద చెబుతుంటే.. కృష్ణ షాక్ తో కన్నీరు పెడుతుంది.

ఇవి కూడా చదవండి

పెళ్లి చేసుకుందాం అని మురారీకి ముకుంద రిక్వెస్ట్

నీవు ఎన్ని చెప్పినా నీ మాటనేను వినను.. అని మురారీ అంటుంటే.. కృష్ణ .. ముకుంద తన ఫ్రెండ్ అంటూ తన ప్రేమ గురించి చెప్పిన సంగతులు గుర్తు చేసుకుంటుంది. మురారీ డైరీలో రాసుకున్న కవితను గుర్తు చేసుకుంటుంది.

అందరూ కలిసి మోసం చేశారని బాధపడుతున్న కృష్ణ

మరోవైపు కృష్ణ ముకుంద చెప్పిన విషయాలు గుర్తు చేసుకుని ఏడుస్తుంది. మీరు దేవుడు అనుకున్నా ఏసీపీ సార్.. మా నాన్న కంటే ఎక్కువ అనుకున్నా.. ఎందుకు నన్ను మోసం చేశారు.. నా దగ్గర నిజం దాచారు అని కృష్ణ ఏడుస్తుంది. అందరూ కలిసి నన్ను మోసం చేశారు.. లేదు తప్పంతా నాదే అందరూ మంచివారని నమ్మితే ఇలాగే ఉంటుందా.. ముకుంద నువ్వు చేసింది మోసం కూడా కాదు.. దగా.. కుట్ర.. వంచన.. మనసులో ఇంత పెట్టుకుని ఎంత కపట నాటకాలు ఆడావు నాదగ్గర.. నేను ఏమి ద్రోహం చేశాను నీకు.. అని కృష్ణ ఏడుస్తుంది..

మధు.. ఫన్నీ కామెంట్స్

బ్యాచలర్ కూడా ఎక్కడ బడితే అక్కడకువెళ్తారు ఫ్రీడమ్ వాళ్ళకి ఉంది.. నేను బాత్ రూమ్ కి వెళ్లాలన్నా నీకు చెప్పని అంటుంటే.. ఈ రోజు డేట్ ఏమిటి అని అడిగిన అలేఖ్య.. హీరోయిన్స్ పుట్టిన రోజు తేదీల అడుగుతుంది. టక్కుమని సమాధానం చెప్పిన మధుతో నా పుట్టిన రోజు మాత్రం గుర్తు లేదా అని నలుగు పెట్టేస్తుంది.

ముకుంద ప్రవర్తనను గుర్తు చేసుకుంటున్న మురారీ

మురారీ తనకు చెప్పిన విషయాలను గుర్తు చేసుకుంటాడు.. అత్తయ్యకు నిజం చెప్పేసి మనం పెళ్లి చేసుకుందాం అని అన్నవిషయాన్ని గుర్తు చేసుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు.

రేపటి ఎపిసోడ్ లో

గదిలో క్రింద నిద్రపోతున్న కృష్ణతో బెడ్ మీద నిద్రపోవచ్చు కదా ఎందుకు కింద నిద్రపోతావంటున్న మురారీని కృష్ణ చాలా కోపంగా చూస్తుంది. నాకు నిద్ర వస్తుంది పడుకోవాలి నేను ఏమీ కానా కృష్ణ అంత పెద్ద తప్పేమి చేశాను అని అంటే.. నేను మీ రూమ్ లో పడుకోవడం ఇష్టం లేదా చెప్పండి.. బయటకు వెళ్లి పడుకుంటా అని కృష్ణ చెబుతుంది.

 

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..