Krishna Mukunda Murari EpisodeOctober2nd, 2023: ముకుందకు అలేఖ్య హిత బోధ.. ఆదర్శ్ ఇష్టం లేడని చెప్పి విడాకులు ఇవ్వమని సలహా..

|

Oct 05, 2023 | 8:13 AM

ఆదర్శ్ కు డివోర్స్ ఇస్తే నన్ను ఇంట్లో ఎందుకు ఉండనిస్తారు చెప్పు.. అందుకే ఆదర్శ్ ను అడ్డం పెట్టుకుని నా ప్రేమకి అడ్డం తొలగించే ప్రయత్నం చేస్తున్నా.. మొదట నేను చేయాల్సింది పెద్దతయ్య దగ్గర కృష్ణ మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోయేలా చేయాలి.. అని ముకుంద అంటే అది సాధ్యం కాదు ముకుంద .. కృష్ణను నమ్మినంత పెద్దత్తయ్య నిన్ను నమ్మదు. దానికి కారణం కూడా కృష్ణే అంటూ సాధ్యమైనంత కృష్ణ మీద ముకుంద కు ఎక్కిస్తుంది.

Krishna Mukunda Murari EpisodeOctober2nd, 2023: ముకుందకు అలేఖ్య హిత బోధ.. ఆదర్శ్ ఇష్టం లేడని చెప్పి విడాకులు ఇవ్వమని సలహా..
Krishna Mukunda Murari
Image Credit source: Hotstar
Follow us on

భవానికి అక్కోయ్ అంటూ ఒక కాల్ వస్తుంది. మీ కోడలు కృష్ణ ఉంది కదా.. తనకు బాబాయ్ ని అని అవతలివారు చెబుతారు. దీంతో కృష్ణ ఎప్పుడో చిన్నప్పుడు మా నాన్నతో గొడవ పడి వెళ్ళిపోయాడు ఇప్పుడు మళ్ళీ వస్తున్నాడు అని అంటుంది. ఇంతలో ఇంటి ముందు లారీతో ప్రభాకర్ వస్తాడు. తనకోసం ఇంతలోకి కుటుంబ సభ్యులు మొత్తం ఎదురువెళ్తారు. చిన్నాన్న అంటూ కృష్ణ .. ప్రభాకర్ దగ్గరకు వెళ్తుంది. తన ఫ్యామిలీ సభ్యులందరినీ ఒకొక్కరిని ప్రభాకర్ కు పరిచయం చేస్తుంది. మా అన్నకు కొడుకు లేడు అన్న లోటు ఉండేది.. ఇపుడు అది కూడా మురారీ వల్ల తీరింది అని అంటాడు. వెధవ సంతలా ఉంది అనుకుంటుది  ముకుంద. అంతా మంచిగా కొడుతోంది.. కానీ ఈ ఒక్క బిడ్డ తప్ప.. ఈ బిడ్డ పెనిమిటి ఏదీ బయటకు పోయిండా అని అడుగుతాడు ప్రభాకర్. అవన్నీ లోపలికి వెళ్లిన తర్వాత మాట్లాడుకుందాం అని లోపలకి తీసుకుని వెళ్తుంది.  ముకుంద తేడా కొడుతోంది.. జర కన్నీసి ఉంచు అని ప్రభాకర్ తన భార్య శకుంతలకి చెబుతాడు.

ముకుందకు షాక్

ప్రభాకర్ తో రీల్స్ చేయమని అలేఖ్య మధుకి సలహా ఇస్తుంది. ఇంతలో అందరూ టిఫిన్ చేయడానికి వస్తారు. మురారీ పక్కన కూర్చోవడానికి ముకుంద రెడీ అవుతుంటే.. ఆ ప్లేస్ కృష్ణది కదా అంటూ..నువ్వు వెళ్లి నీ భర్త పక్కన కూర్చో అని చెబుతాడు. దీంతో ముకుంద నాకు ఆకలి లేదు.. నేను వడ్డిస్తా అని అంటుంది. ఇడ్లి సాంబార్ వేసుకుని తింటున్న ప్రభాకర్ తిండి చూసి అందరూ షాక్ తింటే.. ముకుంద ఏకంగా వామిట్ చేసుకుంటుంది.

ఇవి కూడా చదవండి

కోపంతో సామాన్లు పగులగొట్టిన ముకుంద

తన రూమ్ లో కోపంతో సామాన్లను ముకుంద పగలగొడుతుంటే అలేఖ్య వచ్చి.. ఆపుతుంది. కోపాన్ని కంట్రోల్ చేసుకోమని సలహా ఇస్తుంది. చేతనైతే సహాయం చెయ్యి.. లేదంటే చూస్తూ ఊరుకో.. అంతేకాని కోపాన్ని కంట్రోల్ చేసుకోమని చెప్పకు అని అంటుంది ముకుంద. అయితే ఏమి చేస్తావో చెప్పు అని అలేఖ్య ప్రశ్నిస్తుంది. అందరికి వెళ్ళు చెబుతావా.. వెళ్లి చెప్పు.. మురారీ అంటే ఇష్టమని చెప్పక్కర్లేదు.. కనీసం ఆదర్శ్ అంటే ఇష్టం లేదు.. నేను డైవర్స్ ఇస్తానని చెప్పు .. అది చెప్పక ఏదీ చెప్పలేని నీకు ఈ కోపాలు ఆవేశాలు పనికిరావు ముకుంద .. ఇప్పుడు కావాల్సింది ఆలోచన. అసలు పెద్డత్తయ్యకు నీటుగా లేని మనుషులంటేనే చిరాకు..  ఇంట్లోకి కూడా రానివ్వదు.  అలాంటి పెద్దపల్లి ప్రభాకర్ బాబాయ్ ని సొంత తమ్ముడిలా చూసుకుంటుదని అంటే దానికి కారణం ఎవరు కృష్ణ..  వాళ్ళు కొత్త పాత లేకుండా సొంత ఇంట్లో తిరిగినల్టు తిరుగున్నాడు దానికి కారణం ఎవరు కృష్ణ.. ఏసీపీ అయి ఉండి మురారీ మామా అని తిరుగుతున్నాడు అంటే దానికి కారణం ఎవరు కృష్ణ .. రేవతి అత్తయ్య అని చెబుతుంది.

ఆదర్శ్ ని అడ్డం పెట్టుకున్న ముకుంద

ముకుందా .. ఆపు అని అంటే నిజాలు ఎప్పుడు ఇలాగే ఉంటాయి.. సారీ ముకుంద ఎప్పుడూ లేనిది ఎక్కువ మాట్లాడాను.. అని అంటే ఏమీ కాదు.. ఆదర్శ్ కు డివోర్స్ ఇస్తే నన్ను ఇంట్లో ఎందుకు ఉండనిస్తారు చెప్పు.. అందుకే ఆదర్శ్ ను అడ్డం పెట్టుకుని నా ప్రేమకి అడ్డం తొలగించే ప్రయత్నం చేస్తున్నా.. మొదట నేను చేయాల్సింది పెద్దతయ్య దగ్గర కృష్ణ మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోయేలా చేయాలి.. అని ముకుంద అంటే అది సాధ్యం కాదు ముకుంద .. కృష్ణను నమ్మినంత పెద్దత్తయ్య నిన్ను నమ్మదు. దానికి కారణం కూడా కృష్ణే అంటూ సాధ్యమైనంత కృష్ణ మీద ముకుంద కు ఎక్కిస్తుంది. కృష్ణ అందరిని దగ్గరకు తీసుకుంది.. కానీ నువ్వు అందరిని దూరం పెడుతున్నావు.. అది తెలుసుకోలేని అమాయకురాలు కాదు పెద్దతయ్య అని అలేఖ్య ముకుందకు ఉపదేశం చేస్తుంది.

కృష్ణను ఏడిపించిన మురారీ..

కృష్ణ బాబాయ్ ని గుర్తు చేసుకుంటూ కృష్ణను టీజ్ చేస్తాడు. అలిగిన కృష్ణతో మురారీ గుంజీలు తీస్తుంటే.. ప్రభాకర్ కిట్టమ్మ అంటూ వస్తాడు. రూమ్ లో చైన్ పోయింది అంటే .. అందరూ వెదుకుతారు. చివరకు కృష్ణ మెడలోని చైన్ తీసి ఇస్తుంది. దొరికింది అని చెబుతాడు. అన్నీ బాగానే మాట్లాడతారు.. మనసులో మాట చెప్పరు అని కృష్ణ అని అనుకుంటుంటే.. మురారీ కూడా సేమ్ అలాగే ఫీల్ అవుతాడు. ప్రభాకర్ .. ఇంతలో కృష్ణ వాళ్ల నాన్న నారాయణని గుర్తు చేసుకుంటూ కన్నీరు పెడుతాడు.

రేపటి ఎపిసోడ్ లో

ముకుంద భర్త మిలటరీ నుంచి ఇంకా రాలేదు.. అంటే .. అదే ప్రయత్నాల మీద ఉన్నాం.. త్వరలో వస్తాడు అని భవానీ అంటే.. మరి ముకుంద ఇక్కడ ఎందుకు వాళ్ల ఇంటికి పంపిస్తే.. సంతోషముగా ఉంటుంది కదా అని ప్రభాకర్ చెబుతాడు. ఇది విన్న కృష్ణ, ముకుంద కూడా షాక్ అవుతారు..

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..