స్టార్ మా లో ప్రసారం అవుతున్న కృష్ణ, ముకుంద, మురారీ ప్రేమ, పెళ్లి మధ్య సాగుతున్న కథ, కథనంతో తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకుని టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది. ప్రేమని మరచి పెళ్లికి విలువ ఇచ్చే మురారీ.. తన భారీ కృష్ణకు ప్రేమ గురించి చెప్పకుండా కృష్ణ మనసు తెలుసుకోకుండా ఇంటికి వచ్చిన మురారికి నేడు భవానీ షాక్ ఇవ్వనుంది. ఆదర్శ్ ఇంటికి రాకపోవడనికి ముకుంద ప్రేమ విషయం తెలుసు అని అర్ధం చేసుకున్న భవానీ.. ఈ రోజు ఏ నిర్ణయం తీసుకోనున్నదో చూద్దాం..
భవానీ కాళ్ళమీద పడిన ముకుంద నేను అతడిని ప్రాణ ప్రదంగా ప్రేమించింది నిజమే.. కానీ మా పెళ్లి తర్వాత నా ప్రేమని మనసులోనే సమాధి చేసుకున్నా అని చెబుతుంది. నన్ను నమ్మండి అత్తయ్యా అంటే.. నీ ప్రేమే నా కొడుకుని నాకు దూరం చేసింది అనుకుంటుంది భవానీ.. నీ కన్నీరుతో నా కడుపు కోత చల్లారదు.. ఉన్నపళంగా నా ప్రేమ గురించి ఎందుకు అడుగుతున్నారో తెలియదు కానీ.. మీరు నిజం తెల్సుకుంటేనే నా ప్రేమ నిలబడుతుంది అనిపిస్తుంది అనుకుంటుదని ముకుంద.. రేవతి తీసుకుని వేళ్ళు తనని.. ముకుంద రా అంటే.. అత్తయ్య అంటూ భవానీ రూమ్ నుంచి వెళ్ళిపోతారు.
రేవతి భవానీ దగ్గరకు వచ్చి ఎందుకు అక్క ముకుందని అలా సడెన్ గా అడిగారు.. అంటే మీరు కారణం లేకుండా తప్పు పట్టరు అందుకే అడిగా అంటే.. కన్నల్ కాల్ చేశారు రేవతి.. ఆదర్శ్ కు ఇంటికి రావడానికి ఇష్టం లేదని చెప్పారు అని అంటుంది భవానీ.
తాను మురారీ గడిపిన క్షణాలను గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకుంటుంది కృష్ణ. దాచుకోలేనంత ప్రేమ.. మోయలేనంత భాధ బోలెడన్ని జ్ఞాపకాలు వీటన్నిటిని గుప్పెడంత గుండెలో గుట్టుగా దాచుకుని పైకి మాత్రం.. ఏమి లేనట్లు అసలు ఏమి జరగనట్లు బతికెయ్యాలి.. ఇదేమీ జీవితం ఏమో అని కన్నీరు పెట్టుకుంటుంది. ఇంతలో హని.. కృష్ణ అంటూ తిను అంటూ అన్నం తీసుకుని వస్తుంది.. నాకు ఆకలిగా లేదు.. అంటే నువ్వు పొద్దునుంచి ఏమీ తినలేదు.. తిను అని ప్లేట్ అక్కడ పెట్టి వెళ్ళిపోతుంది. ఇంతలో మురారీ తన కోసం వచ్చినట్లు కల కంటుంది కృష్ణ..
ఏసీపీ సార్ మీరు ఎప్పుడు వచ్చారు.. అని అడిగితె ముందు నువ్వు ఇలా కూర్చో అని చెప్పి.. అవన్నీ కాదు ముందు నువ్వు అన్నం తిను.. తినమని చెబుతాడు. టైమ్ కి ఫుడ్ తినకపోతే హెల్త్ పాడవుతుంది చెబుతావు.. అందరికి చెప్పి నువ్వు తినకపోతే ఎలా తిను అంటూ కృష్ణ కు మురారీ అన్నం తినిపిస్తాడు. ఎందుకు కృష్ణ అలా డల్ గా కూర్చున్నావు.. నీ ఫ్యాన్స్ కు నచ్చదు.. ఇలా అన్నం తినకుండా ఉంటె అందరి ఆరోగ్యం కాపాడే నీ ఆరోగ్యం పాడవుతుంది అన్నం తిను అంటూ మురారీ తినిపిస్తాడు. కృష్ణకు ఎక్కిళ్లు వస్తుంటే.. మురారీ ముద్దు పెట్టుంటాడు. ఆ షాక్ తో కృష్ణకు వెక్కిళ్లు ఆగిపోతాయి. మీరు కూడా తినండి అంటూ కృష్ణ.. మురారీకి అన్నం తినిపిస్తున్నట్లు కల కంటుంది. ఇంతలో హాని వచ్చి.. కృష్ణ ఏమైంది నీకు అంటే.. ఏమీ లేదు అని చెబుతుంది.. క్యాంప్ ఫైర్ దగ్గరకు రా అని కృష్ణ రిజెక్ట్ చేస్తుంది.
భవానీ రూమ్ కి రేవతి, మురారీలను పిలిచిన భవానీ.. మురారీ కన్నల్ కాల్ చేశారు.. శ్రీనివాస్ చెప్పింది నిజమే.. ఆదర్శ్ ఇన్నాళ్లు కావాలనే ఇంటికి రాలేదు.. అంటే ఆదర్శ్ కు ముకుందతో నా ప్రేమ విషమే తెలిసి ఆదర్శ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అన్నమాట. అనుకుంటుంటే.. ఆ విషయం తెలిసి నేను ముకుందని పిలిచి అడిగాను అంటుంది భవానీ.. ముకుంద ఏమి చెప్పింది పెద్దమ్మ అని అడుగుతాడు మురారీ.. నా అనుమానమే నిజం అయింది..మురారీ.. ముకుంద పెళ్ళికి ముందు ఒకతనిని ప్రేమించానని చెప్పింది మురారీ.. అంటుంటే.. ఎవరిని ప్రేమించిందో చెప్పిందా పెద్దమ్మ అని అడుగుతాడు మురారీ.. ఇంతలో మురారీ ఫోన్ రింగ్ అవుతుంది. అది ముకుంద ఫోన్ నుంచి సారీ పెద్దమ్మ సైలెంట్ లో పెట్టేస్తా అని చెప్పి.. ఇప్పటికీ అతనిని ప్రేమిస్తున్నా అని చెప్పిందా అని అడిగితే లేదని చెప్పింది.. కానీ నాకు అర్ధం అయింది మురారీ.. ముకుంద ఇన్నాళ్లు బాధపడుతుంటే అది ఆదర్శ్ కోసం అనుకున్నా కాదు.. తన ప్రేమించిన వాడి కోసం.. అని భవానీ మురారీకి షాక్ ఇస్తుంది. అది తెలిసే ఆదర్శ్ ఇంటికి రావడం లేదు. ఇది ఇలాగే కొనసాగితే మన ఆదర్శ్ ఎప్పటికీ తిరిగి రాడు .. వాడు దేశం కోసం వెళ్లి ఉంటె నేను ఇంతలా బాధపడే దానిని కాను.. వాడు జీవితం విఫలం అయి వెళ్ళిపోయాడు.. అంటుంది.. మురారీ ఎన్నాళ్లు అయిందిరా వాడిని చూసి.. ఇంకెన్నాళ్లు ఎదురు చూడాలి.. ఇంక దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి నాన్న.. నేను ఒక నిర్ణయానికి వచ్చాను మురారీ.. అంటే నువ్వు ఏమి నిర్ణయం తీసుకున్నావు పెద్దమ్మ అని మురారీ అడిగితే,.. ముకుంద నువ్వు ఫ్రెండ్స్ కదా.. ముకుంద ఎవరిని ప్రేమించిందో అడిగి తెలుసుకో.. ఆదర్శ్ తో విడాకులు ఇప్పించి ముకుంద ప్రేమించిన వాడితో తనకి పెళ్లి జరిపిద్దాం అని చెబుతుంది భవానీ.. రేవతి ముకుంద షాక్ తింటారు.
భవానీ కాళ్ళమీద పడిన మురారీ పెద్దమ్మ నన్ను క్షమించు.. నేను ముకుందని ఒకప్పుడు ప్రేమించిన మాట నిజమే.. కానీ ఆదర్శ్ ముకుందని ఎంతో ఇష్టపడ్డాడు.. పెళ్లి ఒప్పుకున్నాడు అని తెలిసి తనని నేను ప్రియురాలిగా ఎప్పుడూ చూడలేదు.. దయ చేసి నను క్షమించు పెద్దమ్మ అని చెప్పినట్లు కల కంటాడు. ముకుంద ప్రేమించిన వాడితో పెళ్లి చేస్తే.. మన ఆదర్శ్ ఇంటికి తిరిగి వస్తాడేమో.. అప్పుడు ముకుంద కూడా హ్యాపీగా ఉంటుంది.. మన ఆదర్శ్ మన ఇంట్లో మన కళ్ల ముందే ఉంటాడు రా అని భవానీ మురారితో చెబుతుంది.
భగవంతుడా ఏదైతే జరగకూడదని అక్క దగ్గర ఇన్నాళ్లు దాస్తూ వచ్చానో.. అది ఇప్పుడు అక్క తోనే జరిపించేలా ఉన్నావు.. ప్రేమ జంటను కలిపేందుకు భార్యాభర్తలను విడగొడుతున్నావా అంటూ రేవతి కన్నీరు పెట్టుకుంటుంది. ఇదేనా చేసే న్యాయం అంటుంది..
అందుకే మన ఫ్యామిలీ ఇప్పటి వరకు ఏ నిర్ణయం తీసుకున్నా మనం అందరం కలిసే ఉండాలి.. ఎప్పటికీ సంతోషంగా ఉండాలని అంటుంది భవానీ.. ఎవరూ బాధపడవద్దురా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే.. ఇదొక్కటే దారి అనిపిస్తుంది.. ముకుంద ఎవరిని ప్రేమిస్తుందో కనుక్కో.. వాడు ఎక్కడ ఉన్నా సరే. వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దాం అని చెబుతుంది భవానీ..
మురారీ రేపటి నుంచి అదే పనిలో ఉండు.. అంటే రేపటి నుంచి నాకు క్యాంప్ ఉంది పెద్దమ్మ.. నేను క్యాంప్ కు వెళ్ళాలి అంటే.. సరే నువ్వు వెళ్ళు ఆ సంగతి ఏమిటో నేనే చూసుకుంటా అని అంటే సరే వేళ్ళు.. అంటే అలాగే పెద్దమ్మ అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు మురారీ..
ముకుంద చాలా సంతోషంగా ప్రేమించిన మురారీ దక్కినట్లు కలలు కంటుంది.. ఇంతలో మురారీ ముకుంద దగ్గరకు వస్తే.. రా మురారీ నీ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా .. అంటే.. దయ చేసి ఇక్కడ నుంచి వెళ్లు ముకుంద అని అంటాడు మురారీ.. ఏమిటి మురారి ఇది నీ కోసం నేను ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉంటే వచ్చి రాగానే నా మనసుని నొప్పిస్తావెందుకు.. ఒన్ ఇయర్ మన ఇద్దరికి మనశాంతి లేదు.. నువ్వు కృష్ణ బాధ్యతను తీసుకుని తనని చదివించే పనిలో పడ్డావు .. నేను ఏమో నువ్వు ఎక్కడ దారి తప్పుతావో అని నీ వెనుక పడ్డాను.. ఇన్నాళ్ల తర్వాత నాకు నువ్వు.. నీకు నేను ఇలా మనం ఏకాంతంగా ప్రశాంతంగా మాట్లాడే సమయం దొరికింది .. అది ఆలోచించకుండా నువ్వు నన్ను వెళ్ళిపోమంటున్నావు అని మురారీని ప్రశ్నిస్తుంది.. ముకుంద.. పెద్దమ్మ నిన్ను పిలిచి పెళ్ళికి ముందు ఎవరినైనా ప్రేమించావా అని అడిగితె.. నిజం ఎందుకు చెప్పలేదు ముకుందా .. ఓ అత్తయ్య దగ్గరకు వెళ్లిన తర్వాతే ఇక్కడికి వచ్చావు అన్నమాట.. అదంతా చెప్పి నీ మనసు ఎందుకు పాడు చెయ్యడం అని నేను నీతో చెప్పలేదు.. నువ్వు మళ్లీ అదే అడుగుతున్నావు అంటుంది ముకుంద.. మాట మార్చకు ముకుంద అడిగిన దానికి సమాధానం చెప్పు.. అంటే.. నీలా నాకు మాట మార్చడాలు.. మనసు మార్చుకోవడాలు చేతకాదు మురారి అంటుంది ముకుంద.. ఒకే మాట ఒకే థ్యేయం అదే మన ప్రేమ.. నీలా నేను నిజం చెప్పలేక అత్తయ్య ముందు తల వంచుకోలేదు నేను.. దారి తప్పిన నిన్ను.. నా ప్రేమతో మళ్ళీదారికి తెచ్చుకుని అర్ధం చేసుకున్నాక ఒక్క నిజాన్నే కాదు.. ఎన్ని నిందలైనా భరిస్తా.. మొదటి ప్రేమకి మరణం ఉండదు మురారీ.. అంటుంది మురారీ.. ప్రేమ బాధ్యతకు తేడా తెలుసుకో.. మన ప్రేమని బతికించుకోవడానికి ఇదే అవకాశం మురారీ అంటుంటే ముకుందని మురారీ షాక్ తో చూస్తాడు. ఆదర్శ్ ఆచూకీ తెలిసింది అని చెప్పి ముకుందకు షాక్ ఇస్తాడు మురారీ..
రేపటి ఎపిసోడ్ లో
పోలీసు ఆఫీసర్ కు యాక్సిడెంట్ జరిగిందని తెలుసుకున్న కృష్ణ..
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..