Krishna Mukunda Murari,29th August: కృష్ణ ఇంటికి రావడంతో షాక్‌లో ముకుంద.. తన ప్రేమని కృష్ణకు చెప్పాలని డిసైడ్ అయిన ముకుంద.. నేటి ఎపిసోడ్‌లో

|

Aug 29, 2023 | 7:32 AM

స్టార్ మాలో ప్రసారం అవుతున్న కృష్ణ ముకుంద మురారీ సీరియల్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.    ప్రేమించిన ప్రియురాలికి, పెళ్ళి చేసుకున్న భార్యకు నలిగిపోతున్న ఓ యువకుడి కథతో సాగుతున్న కృష్ణ ముకుంద మురారీ  బుల్లి తెర ప్రేక్షకుల ఆదరణ సొతం చేసుకుని టాప్ రేటింగ్ తో దూసుకుపోతోంది. మెడికల్ క్యాంప్ లో ఉన్న కృష్ణ  దగ్గరకు రేవతి వెళ్లి తన కోడలిని తిరిగి ఇంటికి తీసుకుని రావాలనుకుంటుంది.. మరోవైపు ముకుంద కృష్ణ జ్ఞాపకాలను మురారీ నుంచి చెరిపివేయాలని భావిస్తుంది.. ఈ నేపథ్యంలో ఈ రోజు ఎపిసోడ్ ఏ విధంగా సాగుతుందో చూద్దాం..   

Krishna Mukunda Murari,29th August: కృష్ణ ఇంటికి రావడంతో షాక్‌లో ముకుంద.. తన ప్రేమని కృష్ణకు చెప్పాలని డిసైడ్ అయిన ముకుంద.. నేటి ఎపిసోడ్‌లో
Krishna Mukunda Murari
Follow us on

మెడికల్ క్యాంప్ పూర్తి కావడంతో అదే సమయంలో అగ్రిమెంట్ పూర్తి కావడంతో కృష్ణ ఇంటికి వెల్లడానికి రెడీ అవుతుంది. రేవతి కృష్ణ దగ్గరకు వెళ్లి.. ఎక్కడికి వెళ్తావు.. ఇంటికి పదా అని అంటుంటే.. మురారీ మనసులో తాను లేనని.. వేరే అమ్మాయి ఉంది అని చెబుతుంది. అప్పుడు మురారీ మనసులో ఉంది నువ్వే.. అని అంటే.. అదే విషయం ఏసీపీ సార్ ఎందుకు నాకు స్వయంగా చెప్పలేదు.. సిగ్గా, మొహమాటమా లేక ఇగోనా అంటు రేవతి ప్రశ్నిస్తుంది.. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆగష్టు 29వ తేదీ న ఏమి జరుగుతుందో చూద్దాం..

అత్తయ్య నాకు ఒక డౌట్.. ఏసీపీ సార్ తన ప్రేమ విషయం నాకు ఎందుకు చెప్పలేదు అని అడిగితే దీనికి సెకండ్ గ్యాప్ ఇస్తే మనసు మార్చుకుంటుంది ఈ తింగరి.. అనుకుంటే.. నా ప్రేమ విషయం ఏసీపీ సార్ తోనే తేల్చుకోవాలి అనుకుంటుంది.. శారీ మార్చుకుంటే మళ్ళీ మనసు మార్చుకున్నా అని అనుకుంటారు.. నేను ఈ డ్రెస్ లోనే ఇలాగె వస్తాను అని రేవతి తో చెబుతుంది..

గదిలో కృష్ణ జ్ఞాపకాల మలినాలను కడిగేసా అనుకుంటున్న ముకుంద..

మురారీ గదిని శుభ్రం చేసి.. ఈ గదిలో కృష్ణ జ్ఞాపకాల మలినాలను కడిగేసినట్లే మురారీ మనసులో అంటిన కృష్ణ జ్ఞాపకాల మలినాలను కూడా నా ప్రేమతో చెరిపేస్తా.. మురారీ గుండెల నిండా నేనే నిండిపోతాను అనుకుంటుంది ముకుంద. ఎక్కడో పుట్టి పెరిగిన నీకు నా ప్రేమ కావాలా.. మురారీ నా వాడు.. తన ప్రేమ నాకు మాత్రమే సొంతం.. మురారీ మనసులో నీకు చోటు కాదు కదా.. జీవితంలో ఇంకెప్పుడు కృష్ణ నీడ కూడా మురారీ మీద పడనివ్వను.. అత్తయ్యతో మన ప్రేమ విషయం చెప్పడానికి నువ్వు బయపడతావని నాకు తెలుసు.. కనుక నేనే చెబుతాను.. చెప్పడమే కాదు.. మన ప్రేమ విషయం అర్ధం చేసుకుని అత్తయ్య మన పెళ్లి జరిపించేలా చేస్తాను అని ఆనందంలో తేలిపోతుంది ముకుంద..

ఇవి కూడా చదవండి

తనతో ఇంటికి వస్తున్న కృష్ణను చూసి ఆనందంలో మురారీ

కృష్ణ తనతో వస్తుందా లేదని ఆలోచిస్తున్న మురారీ.. దగ్గరకు రేవతి కృష్ణ లు వస్తారు.  లగేజీని తీసుకుని మురారీ టెంట్ దగ్గరకు వచ్చిన కృష్ణను చూసి మురారీ.. అమ్మా నువ్వు కృష్ణకు ఏమి చెప్పావో .. ఏమి మాయ చేశావో తెలియదు కానీ నువ్వు సూపర్ అమ్మా థాంక్స్ సో మచ్ .. ఏసీపీ సార్ నన్ను లవ్ చేస్తూ నాతో చెప్పారా.. అత్తయ్య చెప్పింది నిజమో కాదో తెలియదు కానీ నా జీవితం నా ప్రపంచం అంతా ఆరడగుల ఎత్తులో నిల్చుకుని ప్రేమగా నన్ను ఆహ్వానిస్తుంది..   ఉంది అంటూ కృష్ణ సంతోషపడుతోంది. అత్తయ్య చెప్పింది నిజం అయితే మీరు నాతో చెప్పేటట్లు చేస్తాను.. లేదంటే నన్ను ప్రేమించేలా చేస్తాను అని అనుకుంటే.. మురారీ నిజంగా ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే.. దానికి కారణం నువ్వే థాంక్యూ సో మచ్ అని కృష్ణకు చెబితే.. పరాయివాళ్ళకు చెప్పినల్టు థాంక్స్ చెబుతున్నారు ఏమిటి ఈయన..నిజంగా నన్ను లవ్ చేస్తున్నారా.. లేక అత్తయ్య అబద్ధం చెప్పిందా అని కృష్ణ మళ్ళీ ఆలోచనలో పడుతుంది.

కర్మల్ని ఆచరిస్తాను భగవంతుడిని ప్రార్థిస్తున్న భవానీ

దేవుడికి పూజ చేస్తూ భవానీ నేను మిమ్మల్ని నమ్మను.. కర్మల్ని ఆచరిస్తాను.. నాకు ఇది ఇవ్వండి.. మీకు ఇది చేస్తాను అని మీతో బిజినెస్ డీల్ పెట్టుకోలేను.. ఒక మనిషికి జరిగే మంచి చెడుల వెనుక ఏదొక బలమైన కారణం ఉంటుంది అని నాకు తెలుసు. బంధాలు ఇచ్చావు.. ఆనందాలను ఇచ్చావు.. బాధలను ఇచ్చావు .. నేను అన్నిటిని నేను సమానంగా స్వీకరించాను. నాకు ఉన్నది ఒకేఒక కోరిక.. మా కుటుంబంలో అందరం ఎప్పటికీ సుఖంగా సంతోషంగా ఉండాలి అని దేవుడికి భవానీ పూజ చేస్తూ కోరుకుంటుంది. నా కొడుకు ఆదర్శ్ తిరిగి రావాలి.. ఇంతకంటే నేను మీ కోరుకొను అంటుంది.

ముకుంద పెళ్ళికి ముందు ఎవరినో ప్రేమించినట్లు రేవతి చెప్పిన కృష్ణ

కృష్ణ రేవతి అత్తయ్య నేను క్యాంప్ కి వెళ్ళినప్పుడు అందరికీ గిఫ్టులు ఇచ్చాగా నచ్చాయా అని అడిగితే .. ఎవరికీ ఏమి కావాలో అవే ఇచ్చావు ఎందుకు నచ్చవు అంటే.. ముకుందకు మాత్రమే నేను ఇచ్చిన గిఫ్ట్ నచ్చక పోయి ఉండవచ్చు.. అంటే.. రేవతి, మురారీ షాక్ తింటారు. ఏమి గిఫ్ట్ ఇచ్చావు తనకి అని రేవతి అడిగితే.. మీకు తెలిసో లేదో అత్తయ్య.. జస్ట్ మనసులో పెట్టుకోండి.. ముకుంద ఎవరినో ప్రేమించింది అత్తయ్య.. ఆదర్శ్ తో పెళ్ళికి ముందు.. కానీ ఇప్పటికి తనని మరచిపోలేక పోతుంది అత్తయ్య  అంటే.. రేవతి చెప్పిందా నీకు చెప్పిందా అంటే.. కృష్ణ అవును.. అప్పుడు ఏసీపీ సార్ కూడా నా పక్కనే ఉన్నారు అని చెబుతుంది కృష్ణ. కదా ఏసీపీ సార్.. అంటే అవును అంటూ.. అవన్నీ ఇప్పుడు ఎందుకు కృష్ణ అని మురారీ అంటే.. అవును.. కానీ ఇప్పడు అలా చేయడం తప్పు కదా అంటుంది కృష్ణ. అందుకే ప్రేమ గుడ్డిది.. పెళ్లి కళ్లు తెరిచిన కళ్ల వంటిది.. ఒకప్పటి ప్రేమ మరచిపోయి.. ఇప్పటి పెళ్లి జీవితాన్ని చక్కబెట్టుకో అని సలహా ఇచ్చానని చెబుతుంది కృష్ణ. అప్పుడు రేవతి అది సలహా కాదు కృష్ణ ఉచిత సలహా అంటుంది రేవతి. పోయి పోయి దానికే సలహా ఇచ్చావా ఈ విషయాలు అన్నీ అక్కకు తెలిస్తే ఎంత ప్రాబ్లెమ్ అవుతుందో తెలుసా అని రేవతి కృష్ణని మందలిస్తుంది. అడక్కుండా ఇంకెప్పుడూ ఎవరికీ సలహా ఇవ్వకు కృష్ణ.. తను ఎలా తీసుకుంటుందో నీకు తెలియదు కదా.. అంటే నాకు అదే అనిపించింది అత్తయ్య.. హార్ట్ అయిందంటారా అని అంటే.. ఇంకెప్పుడు తనకి ఏ సలహా ఇవ్వకు.. నీ సంసారం ఎదో మీరు చూసుకోండి అని రేవతి అంటే.. ఒకే అంటుంది కృష్ణ. అనవసరంగా ముకుంద విషయం చెప్పా.. భవానికి తెలిస్తే ముకుంద జీవితం ఏమౌతుందో అని బాధపడుతుంది కృష్ణ.

మురారీకి ఓ వైపు కృష్ణ షాక్.. మరోవైపు ముకుంద షాక్..

కృష్ణ నీకు మ్యుజిక్ అంటే చాలా ఇష్టం అంటే.. నాకు సిరివెన్నెల పాటలు అంటే చాలా ఇష్టం.. నాకు వేటూరి పాటలు అంటే ఇష్టం.. అంటూ ఒకరి ఇష్టాలు ఒకరు చెప్పుకుంటూ ఉంటారు.. ఇది తింగరిదే కానీ మహా తెలివైంది. నేను ఎప్పటినుంచొ ఒకటి అడగాలనుకుంటున్నాను.. అడిగెయ్యానా నిజమే చెప్పాలి అంటే.. అడుగు నిజమే చెబుతా అంటుంది.. రేవతి ఏమిటి ఎప్పుడూ ఏదోకటి వగడమేనా నీ నోటికి రెస్టు ఉండదా అంటే.. మీరు ఉండండి అత్తయ్య అని కృష్ణ ఏసీపీ సార్.. మీరు నిజమే చెప్పాలి.. కృష్ణ మీకు దండం పెడతా అడుగు అంటే.. మీరు ఎవరినైనా ప్రేమించరా చెప్పండి ఏసీపీ సార్.. అని అడుగుతూ పెళ్ళికి ముందు ఎవరినైనా ప్రేమించరా అని అడుగుతుంది..

భవానికి తమ ప్రేమని చూపించాలన్న ముకుంద..

మురారీ రూమ్ లో తాను మురారీ కలిసి ఉన్న ఫోటోలను గోడలకు పిక్స్ చేసి ఫోటోలు తీసుకుని మురిసిపోతుంది. ఇంతలో మురారీకి ఫోన్ చేస్తుంది ముకుంద.. మురారీ ఎక్కడ ఉన్నావు.. నువ్వు క్యాంప్ నుంచి ఇంటికి వచ్చే లోపు మన ప్రేమ విషయం అత్తయ్యకు చెప్పేస్తా అని ముకుంద .. మురారీకి షాక్ ఇస్తుంది. అలాకాదు మనం ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం అని అంటే.. నువ్వేమీ కంగారు పడకు మురారీ.. నేను మన పెళ్లి విషయం అత్తయ్యని కన్విన్స్ చేస్తానని చెబుతుంది మురారీ.. ఇంతలో ఫోన్ కట్ చేస్తుంది.

పెళ్ళికి ముందు ఎవరిని ప్రేమించారని అడిగిన కృష్ణ

ఏసీపీ సార్ నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా దాటదానికి ట్రై చేస్తున్నారు.. అంటే.. అలాగని కాదు అని నసుగుతుంటే.. రేవతి కల్పించుని.. ఇప్పుడు అవన్నీ ఎందుకె.. నేను ఉన్నా కదా.. ఇలాంటి మాటలు ఎవరూ లేనప్పుడు మాట్లాడుకోవాలి అంటుంది రేవతి. ఇలా ఎక్కడ బడితే అక్కడ కాదు కృష్ణ డ్రైవర్ కూడా ఉన్నాడు కదా.. అంటే థాంక్యూ అమ్మా బతికించావు.. నాకు అసలు అర్ధం కావు.. అంటే.. మనం ఇలాంటి విషయాలు ఏకాంతంగా ఉన్నపుడు మాట్లాడుకుందాం అని కృష్ణ చెబుతుంది.

భవానీని మురారీ రూమ్ కి తీసుకుని వెళ్లిన ముకుంద

ముకుంద భవానీ దగ్గరకు తన ప్రేమ విషయం చెప్పడానికి వస్తుంది. మీకు ఒక విషయం చెప్పాలి.. నిజానికి అది నేను చెప్పడం కంటే.. మీరు చూస్తేనే బాగుంటుంది అని అంటుంటే.. ముకుంద నీకు తెలుసు కదా.. నాకు ఇలా డొంక తిరుగుడుమాటలు అంటే నచ్చదని అంటుంది భవానీ.. ప్లీజ్ అత్తయ్య కోపడకండి ఆ నిజం నేను చెప్పడం కంటే.. మీ కళ్లతో మీరు చుస్తే బాగుంటుంది అని ముకుంద అంటుంటే.. భవానీ తాను ఏమి చెప్పాలనుకుంటుంది ఏమి చుపించాలనుకుంటుంది అని ఆలోచిస్తుంది. అత్తయ్య ప్లీజ్ రండి అని అంటే..సరే పద అంటూ వెళ్తుంది. మా ఫోటో చూసి అత్తయ్య కోప్పడ్డా సరే.. మా ప్రేమ విషయం అత్తయ్యతో చెప్పేసి.. మా ప్రేమని బతికించమని .. మురారీతో పెళ్లి జరిపించమని వేడుకుంటాను ముకుంద అనుకుంటుంది.

మురారి రూమ్ దగ్గరకు తీసుకుని వెళ్లిన భవానీని ఇంతలో మధుని అలేఖ్య కొడుతోంది. అదే సమయంలో కృష్ణ, మురారీలను తీసుకుని రేవతి వస్తారు. కృష్ణ మురారీలు ఉన్న రూమ్ లోకి తీసుకుని వచ్చావు ఎందుకు ముకుంద అంటే.. మీకు తెలియాల్సింది ఇందులోనే ఉంది అత్తయ్య అంటుంది. అంటుంటే.. మధు ఇంతలో కృష్ణను చూసి కృష్ణ వచ్చింది అని అరిచి చెబుతాడు.. దీంతో ముకుంద షాక్ తింటుంది.. కృష్ణ, మురారీలు వచ్చారు కదా.. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ల ముందే రూమ్ లో ఏముందో చూద్దాం అని భవానీ చెబితే.. ముకుంద తల ఊపుతుంది. రా ముకుంద అని భవానీ కిందకు వెళ్తుంది.

కృష్ణ రాకతో ముకుంద షాక్

పాపం అదేదో అందరినీ సర్ఫరైజ్ చేసింది.. రేవతి అత్తయ్య నిజంగానే కృష్ణను తీసుకువచ్చింది. పాపం.. ఇప్పుడు ముకుంద రియాక్షన్ ఏమిటో అని ఆలోచిస్తుంది రేవతి.  మురారీ ఏమైంది మురారీ అంటే.. ఏమీ కాలేదు అని అంటే.. మధు నేను బ్యాగ్ తీసుకొస్తా మీరు వెళ్ళండి అంటే.. మురారీ నుదిటి మీద కట్టు చూసి భవానీ షాక్ తింటే.. కృష్ణను చూసి ముకుంద షాక్ తింటుంది. ఎందుకు తిరిగి వచ్చింది. ఇక ఎప్పడూ ఇంటికి రాను అన్నట్లు మాట్లాడింది కదా అని ముకుంద ఆలోచిస్తుంది.  రేవతి అత్తయ్య బలవంతంగా తీసుకోచ్చిందా.. లేదా కృష్ణ మురారీలు ఒకరిప్రేమని మరొకరు అర్ధం చేసుకున్నారా అని ఆలోచిస్తుంటే.. భవానీ మురారీ అంటూ పరిగెత్తుకుని మురారీదగ్గరకు వస్తుంది..

రేపటి ఎపిసోడ్ లో

మురారీ రూమ్ లో ముకుంద .. మురారీల ప్రేమని కృష్ణను చెప్పాలనుకున్న ముకుంద.. కృష్ణను వాళ్ల రూమ్ కి కళ్లు మూసుకుని తీసుకొస్తుంటే షాక్ లో మురారీ..