బిగ్బాస్ సీజన్ 8 తెలుగు షో ప్రారంభమై నెల రోజులు పూర్తికావొస్తుంది. మొత్తం 14 మందితో మొదలైన ఈషోలో.. ఇప్పుటివరకు ముగ్గురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారం బెజవాడ బేబక్క, రెండవ వారం శేఖర్ భాషా హౌస్ నుంచి బయటకు రాగా.. మూడో వారం అభయ్ నవీన్ ఎలిమినేట్ అయ్యారు. ఇక ఇప్పుడు నాలుగో వారం ఎలిమినేషన్ సమయం కూడా వచ్చేసింది. ఇప్పుడు హౌస్ లో 11 మంది కంటెస్టెంట్స్ ఉండగా.. ఈసారి ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నారు. అయితే ఈ వారమే హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్ లోనూ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయని.. మొత్తం పన్నెండు మంది వచ్చే ఛాన్స్ ఉందని బిగ్బాస్ ప్రకటించాడు. కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాకుండా ఆపే ఛాన్స్ కూడా కంటెస్టెంట్లకే ఇచ్చాడు. అయినప్పటికీ ఈ సీజన్ లో మొత్తం 5 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి కొత్త వారు కాదు.. గత సీజన్స్ కంటెస్టెంట్స్ మరోసారి హౌస్ లోకి అడుగుపెట్టనున్నారట.
ఇప్పటికే పలువురి పేర్లు సోషల్ మీడియాలో మారుమోగుతున్నాయి. గత సీజన్లలోని బిగ్బాస్ మాజీ కంటెస్టెంట్స్ మళ్లీ హౌస్‌లోకి ప్రవేశించనున్నారు. అందులో ఇప్పటికే నలుగురు కంటెస్టెంట్స్ కన్ఫార్మ్ అయ్యారట. ఇంతకీ వాళ్లు ఎవరెవరంటే.. సీజన్ 1 నుంచి హరితేజ.. సీజన్ 7 నుంచి నయని పావని, సీజన్ 5 నుంచి యాంకర్ రవితోపాటు.. సీజన్ 4 కంటెస్టెంట్ ముక్కు అవినాష్ ఈసారి హౌస్ లోకి వెళ్లనున్నారు. వీరి నలుగురు దాదాపు కన్ఫార్మ్ అయ్యారని సమాచారం. ఇక వీరితోపాటు సీజన్ 7 కంటెస్టెంట్ గౌతమ్ కూడా ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నాడట.
వీరితోపాటు మరికొంతమంది కంటెస్టెంట్స్ పేర్లు కూడా వినిపిస్తున్నా్యి. దీప్తి సునైనా, యాంకర్ శ్యామల,శ్రీ సత్య, వాసంతి కృష్ణన్, గౌతమ్ కృష్ణ పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్లే కాకుండా బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ సీజన్ నుంచి మిత్ర శర్మ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. వీరందరిలో కేవలం ఐదాగురు మాత్రమే హౌస్ లోకి మరోసారి అడుగుపెట్టనున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.