Karthika Deepam Vantalakka: వంటలక్క లేటెస్ట్ ఫోటోలు.. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హల్ చల్
Karthika Deepam Vantalakka: కార్తీక్ దీపం సీరియల్ తో తెలుగు తెరపై గత మూడేళ్ళ క్రితం అడుగు పెట్టింది కేరళ కుట్టి ప్రేమి విశ్వనాధ్. ఈ సీరియల్ లో దీప పాత్రలో నటిస్తుంది. వంటలక్క పాత్రతో.. బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుని తెలుగింటి ఆడబడుచుగా..
Karthika Deepam Vantalakka: కార్తీక్ దీపం సీరియల్ తో తెలుగు తెరపై గత మూడేళ్ళ క్రితం అడుగు పెట్టింది కేరళ కుట్టి ప్రేమి విశ్వనాధ్. ఈ సీరియల్ లో దీప పాత్రలో నటిస్తుంది. వంటలక్క పాత్రతో.. బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుని తెలుగింటి ఆడబడుచుగా మారిపోయింది. ప్రేమి విశ్వనాథ్. నటిస్తుంది ఒక్క సీరియల్ అయితేనేమి.. స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. వంటలక్క, నల్లక్క అంటూ ఆ పాత్రలో ఓడిపోయింది. బుల్లితెరపై అంత నల్లగా కనిపించే ప్రేమి… రియల్ గా చాలా అందంగా ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ ఆ ఉంటుంది ప్రేమి. తనకు వ్యక్తిగత విశేషాలతో పాటు.. షూటింగ్ కు సంబంధించిన అప్డేట్ ను ఎప్పటికప్పుడు ఇస్తుంది. ఇక షూటింగ్ పిక్స్ తో పాటు.. సెట్స్ లో తోటి నటీనటుల తో ఉన్న ఫోటోలను పంచుకుంటుంది. ఈ నేపథ్యంలో ప్రేమి తాజాగా తన కుక్కపిల్లతో కొన్ని ఫోటోలు దిగి వాటిని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతేకాదు చీరలో స్టైల్ గా ఉన్న కొన్ని ఫోటోలను కూడా షేర్ చేశారు. ఈ ఫోటోలు వంటలక్క అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి
ఇక మరోవైపు ప్రేమి విశ్వనాధ్ త్వరలో వెండి తెరపై సందడి చేయనుంది. ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తుంది. ఈ సినిమాషూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. లా చదివిన ప్రేమి.. ఇప్పుడు నటిగా మారి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ముందుగా మోడలింగ్ రంగంలో అడుగు పెట్టి అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకుంది.. అనంతరం 2013 లో ఓ ప్రముఖఛానల్ రూపొందించిన కరతముత్తు సీరియల్ తో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఈ సీరియల్ 2013 లో కేరళలో ఓ రేంజ్ లో సక్సెస్ అయ్యింది .ఆ ధారావాహిక మలయాళ టీవిరంగంలో సంచలనాన్ని సృష్టించి, ప్రేమి నటనకి మంచిపేరు వచ్చింది. ఈ సీరియల్‌లో ప్రేమి విశ్వనాథ్ నటించినందుకు ఆమెకు ఉత్తమ మహిళా నటి (2014) ఆసియానెట్ ఫిల్మ్ అవార్డ్ గెలుచుకుంది. ఇక తెలుగులో రీమేక్ కార్తీక దీపం పేరుతో రీమేక్ చేశారు. ఈరోజు కార్తీక దీపం 1000వ ఎపిసోడ్ లోకి అడుగు పెట్టింది.
Also Read: వేసవిలో పచ్చళ్ళు, వడియాలే కాదు.. కొన్నిరకాల కూరగాయలతో పొడులను కూడా తయారు చేసుకోవచ్చు తెలుసా..!