
Karthika Deepam Serial: కార్తీక దీపం సీరియల్ ఈరోజు 989 ఎపిసోడ్ లోకి అడుగు పెట్టింది. దాదాపు మూడేళ్లకు పైగా ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఇప్పటికీ ప్రేక్షకుల అదరణను సొంతం చేసుకుంటూనే ఉంది. రోజు రోజుకీ ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో సాగుగుతుంది కార్తీక దీపం. ఈరోజు ఎపిసోడ్ లో ఎం జరుగుతుందో చూద్దాం..!
కొత్త క్యారెక్టర్ సంతానం శౌర్య, హిమాలను ముద్దు చేస్తూ.. వెళ్తున్నా మళ్ళీ రేపు వస్తానని చెబుతుంది. దీంతో దీప శౌర్య నాన్నా టిఫిన్ సెంటర్ పేరు పెడుతూ అన్న మాటలు గుర్తు చేసుకుని.. నాన్నా ఒక్కడే ఉన్నాడు.. మనల్ని అనాధల్లా వదిలేసి అంటూ కోపంగా శౌర్యని అంటుంది.. అప్పుడు పోనీ నాన్న టిఫిన్ సెంటర్ పేరు చెరిపేద్దామా అని అంటుంది.. వద్దు.. నాకు తెలుసు ఎం చెప్పాలో అంటుంది.. ఇంతలో వారణాసి కలగజేసుకుని.. అక్కా అసలు ,మనం ఊరు పేరు చెప్పడానికి ఎందుకు భయపడాలి అంటాడు.. ఎవరికీ దొరకకూడదు అని కదా మనం ఊరు వదిలి వచ్చింది. ఇప్పటికి మనల్ని వెదకడానికి ఎవరొకరు బయలుదేరే ఉంటారు అంటుంది దీప..
ఇంతలో భాగ్య పూజ చేస్తుంటే.. మురళీ కృష్ణ బ్యాగ్ తీసుకుని దీప కోసం బయలుదేరతాడు.. ఇంతలో భాగ్యను చూసి మురళీ కృష్ణ ఏమిటే ఈ వేషం.. అంటాడు.. ఒకప్పుడు రాణులు భర్తలు దేశ పర్యటనకు వెళ్ళినప్పుడు ఇలానే చేసేవారని మొన్న తీర్ధయాత్రల్లో త్రిమింగిలానంద స్వామీ చెప్పారని అంటుంది భాగ్య. ఫోటో పెట్టావు కానీ దండవేసి దణ్ణం పెట్టకు అని అంటూ మురళీకృష్ణ దీపని పిల్లలని వెదకడానికి బయలుదేరతాడు. దీపని పిల్లని వెనక్కి తీసుకుని రామ్మని చెబుతుంది.
మరోవైపు సౌందర్య ఆందోళనగా ఉండడం చూసి ఆనందరావు ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతాడు. కార్తీక్ వీక్ నెస్ ను అడ్డుపెట్టుకున్న మోనిత కు బాగా తెగింపు వచ్చేసిందండి అంటుంది.. అంతేకాదు.. ఇప్పుడు పెళ్లి చేసుకుంటాను అన్న తర్వాత అసలు భయపడడం మానేసింది అంటుంది. అసలు అది ఆడదానిలాగే ప్రవర్తించడం లేదు. ఇదే నేను ఒకప్పటి సౌందర్యాన్ని ఐతే.. మోనిత మాటలకూ పిట్టని కాల్చినట్లు కాల్చేదానిని.. ఇప్పడు ఎం చేయాలల్లో అర్ధం కావడం లేదు.. హిమ ముందుగా మోనిత కంటపడితే అంటూ ఆందోళన వ్యక్తం చేస్తుంది. దానిని కొట్టికొట్టి నాకే విసుగొచ్చేసింది. కార్తీక్ నా మీద పంతానికైనా మోనిత కు దగ్గరయ్యేటట్లు ఉన్నాడు అంటూ ఆందోళన వ్యక్తం చేస్తుంది. కార్తీక్ స్వతహాగా ఎవరికీ హాని చేయదు.. మోనిత వల్లే మొత్తానికి చెడిపోతున్నాడు.. దీప దొరికే వరకూ మనం ఎం చెయ్యలేం.. వాడి బలహీనత హిమ.. దానిని అడ్డం పెట్టుకుని మోనిత కార్తీక్ ని ఆడిస్తుంది. అంటూ.. ఇద్దరూ చేయి దాటిపోయారండి అంటుంది.. ఏ ఆడదైనా పెళ్లి అయిన తర్వాత మాతృత్వం కోసం తపిస్తుంది.. అయితే మోనిత మాత్రం కార్తీక్ కి పిల్లలు పుట్టారని తెలిసినా పెళ్లి పెళ్లి అంటూ వెంటపడుతుంది.. ఇందులో ఏమైనా మతలబుందా అని మోనిత కోణంలో ఆలోచించడం మొదలు పెట్టింది సౌందర్య..
మరోవైపు దీప చీకట్లో బాధగా కూర్చుంటే.. హిమ … శౌర్యని కోపడుతుంది.. నీ వల్లనే అమ్మ ఇంతబాధపడుతుంది.. అమ్మని ఎందుకు అలా బాధపెడుతున్నావ్.. అమ్మా మనకోసం ఎంతో కష్టపడుతుంది.. నాన్నా ఎం చేస్తున్నాడు అంటూ హిమ ప్రశ్నిస్తుంది.. నాన్నని ఇంకా మనం గుర్తు చేసుకుంటే వారణాసి తో చెప్పి మనల్ని తిరిగి పంపించేస్తుంది. అని అంటుంటే సరే.. నాన్నా పేరు తీస్తెద్దాం అంటుంది శౌర్య..
ఇదంతా విన్న దీప మా ఇద్దరి మధ్య మీరు నలిగిపోతున్నారని తెలుసు.. అందుకేగా నేను ఆయనని ఎంతగా బతిమాలాడాను.. కాళ్లావేళ్లా పడ్డాను.. ఎన్ని మాటలు అన్నాడు.. మరచిపోవాలన్నా మరచిపోలేక పోతున్నా దేవుడా అంటూ కన్నీరు పెడుతుంది..
కార్తీక్ ఇంటికి వచ్చి ఎవరూ లేరు అని ఇంట్లోవాళ్ళని పిలిస్తే.. శ్రావ్య వచ్చి బావగారు మీరు ప్రెష్ అయ్యి మేడమీదకు వెళ్ళండి.. ఆదిత్య మీకోసం చూస్తున్నాడు అని చెబుతుంది సరే అంటూ వెళ్తాడు..
అదే సమయంలో దీప దేవుడి పటం ముందు నిల్చుకుని పెళ్లి అయ్యింది.. పెళ్లి అయ్యి పదేళ్ళయింది.. ఆదర్శంగా చేసుకున్న పెళ్లి ఇప్పుడు ఎలా మారుతుంది. ఈ పెళ్లితో ఎం మిగిలింది.. ఎం మిగిలింది.. ఏది బంధం ఏది సంబంధం దీనిని పెళ్లి అంటారా.. ఈ పెళ్ళికి ఓ పెళ్లి రోజు ఉందంటారా అంటూ దేవుడికి తన బాధను చెప్పుకుంటుంది. ఆర్తులను అనాథలను ఆదరించే ఆ హృదయంలో ఎప్పటికీ కార్తీక దీపం వెలగదా నేను చేయని పాపం ఎప్పటికీ వదలదా అని ప్రశ్నిస్తుంది.
ఇంతలో వారణాసి.. పిల్లలు రంగు డబ్బాతో వచ్చి.. నాన్నా టిఫిన్ అని రాసిన దానిని చెరిపేస్తాం అని పిల్లలు అంటారు.. అప్పుడు నాన్నా పేరు చెరిపేస్తారు.. నాన్నని మనసులో నుంచి చెరిపేయగలరా అని ప్రశ్నిస్తుంది. నాన్న గురించి అడిగితె బాగుండదు.. అయితే నాన్నలేడు అన్నా బాగుండదుకాదా ఉన్నాడు కదా అంటుంది విరక్తిగా .. ఎక్కడ చూసినా మీ నాన్నే ఉన్నాడు.. మనతో లేకుండా మనలోనే ఉన్నారు అంటూ దీప కన్నీరు పెడుతుంది.
అపుడు వారణాసి కలుగజేసుకుని వెళ్లిపోదామా అక్కా .. అంటాడు.. ఎందుకు అక్కడ ఎం ఉంది.. గుడికి వెళ్తే అందరి కోరికలను తీర్చాడు వారణాసి.. అంతమాత్రానా దేవుడు దేవుడు కాకుండా పోతాడా..? మళ్ళీ మన ఊరు వెళ్ళడానికి అక్కడ ఎం ఉంది..? బిరుదుల సన్మానాలా సత్కారాలా..? చీత్కారాలా ఏమున్నాయి అక్కడ..? సౌందర్యమ్మగారు ఉన్నారు కదా అక్క అంటే.. ఉన్నారు ఆవిడ ఉన్నారు కనుకనే ఇంతకాలం ఉండగలిగాను అక్కడ..ఎంతమంది పూజారులు పూజలు చేసినా దేవుడు వరమివ్వాలి కదా..? అమ్మకి అత్తకి మధ్య ఆమె నలిగిపోవడం తప్ప ఎం లేదు. ఆ దేవుడు కరుణించేవరకూ ఈ కథ కంచెకు చేరదు అని కన్నీరు పెట్టుకుంది దీప.. అమ్మ బాధను చూసిన పిల్లలు కూడా కన్నీరు పెట్టుకుంటారు.. మరి ఆదిత్య అన్నతో ఏం మాట్లాడతాడు..? మోనిత మీద వచ్చిన అనుమాన నివృత్తి కోసం సౌందర్య ఎం చేస్తుంది రేపటి ఎపిసోడ్ లో చూడాల్సిందే.,.
Also Read: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వియ్యంకుడిపై గుర్తు తెలియని దుండగుల రాళ్లదాడి