Jabardasth Varsha: ఆరేళ్ల క్రితం ఈవెంట్ అని పిలిచి.. ఎందుకీ బతుకు అనిపించింది.. జబర్దస్త్ వర్ష ఎమోషనల్..
బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయ్యింది వర్ష. ఆ తర్వాత సీరియల్స్ లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. జబర్దస్త్ షోలో ఇమ్మాన్యుయేల్‌తో కామెడీ, లవ్ ట్రాక్స్ చేసి సోషల్ మీడియాలో ఎక్కువగా ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత బయట ఈవెంట్స్, షోలలో పాల్గొని ఫాలోయింగ్ పెంచుకుంది.

బుల్లితెరపై పలు సీరియల్స్ లో చిన్న చిన్న పాత్రలు పోషించి తెలుగు ప్రజలకు దగ్గరైంది వర్ష. ఆ త్రవాత జబర్దస్త్ కామెడీ షోలోకి ఎంట్రీ ఇచ్చి తనదైన కామెడీ టైమింగ్ తో అలరించింది. ఇదే షోలో ఇమ్మాన్యుయేల్ తో కలిసి కామెడీ టవ్ ట్రాక్ చేసి మరింత పాపులర్ అయ్యింది. అలాగే ఈ కామెడీ షోతోపాటు బయట ఈవెంట్స్, సోషల్ మీడియాలో క్రేజీ గ్లామర్ ఫోటోషూట్స్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంది ఈ అమ్మడు. అయితే కొన్ని రోజులుగా వర్ష నెట్టింట.. అటు కామెడీ షోలో సైలెంట్ అయిపోయింది. ఇప్పటికే సీరియల్స్ నుంచి తప్పుకున్న ఈ అమ్మడు.. కేవలం జబర్దస్త్ షో మాత్రమే చేస్తుంది. అలాగే నెట్టింట యాక్టివ్ గా ఉంటూ క్రేజీ ఫోటోషూట్స్ షేర్ చేస్తుంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకుంది.
అదే ఇంటర్వ్యూలో కెరీర్ ప్రారంభంలో తాను పడ్డ కష్టాలను చెప్పుకొచ్చింది వర్ష. తనను చాలా మంది బాధపెట్టారని.. ముందు ఒకలా.. వెనక ఒకలా ఉండేవాళ్లు కావాలని బాధపెట్టారని.. తెలిసిన వాళ్లే అలా చేశారని తెలిపింది. ఆరేళ్ల క్రితం ఓ ఈవెంట్ ఉందని.. అందులో తన డ్యాన్స్ ప్రోగ్రాం ఉందని పిలిచారని.. దీంతో తనే సొంతంగా ఫ్లైట్ టికెట్ పెట్టుకుని అక్కడకు వెళ్తే.. వసతులు సరిగ్గా లేవని.. అప్పటికే చాలా మంది ఆర్టిస్టులు పర్ఫార్మెన్స్ ఇస్తున్నారని.. కనీసంతో తనను ప్రాక్టీస్ కూడా చేయించలేదని తెలిపింది. స్టేజ్ పై అందరు ప్రోగ్రామ్స్ చేస్తుంటే.. తనను వెనకాల ఓ గుడిసెలో కూర్చొపెట్టారని.. అప్పుడే ఓ ఆర్టిస్ట్ వచ్చి రెడీ అవుతాను కాసేపు అద్దం పట్టుకోమని అడిగితే.. గంట సేపు వాళ్లకు అద్దం పట్టుకుని నిల్చున్నాని.. కావాలని తనతో అలా చేశారని.. ప్రోగ్రాం లేకపోయినా ఉందని చెప్పి.. పిలిచి మరీ బాధపెట్టారంటూ ఎమోషనల్ అయ్యింది వర్ష.
తన మీద పంచులు వేస్తూ కామెడీ చేసినప్పుడు సరదాగానే తీసుకున్నానని.. ఎప్పుడైతే నిజంగానే తిడుతున్నారి తెలిసిందో తట్టుకోలేకపోయానని తెలిపింది. డబ్బు, పేరు, అందరూ ఉన్న సుఖం లేదని.. ఇలాంటి జీవితం మళ్లీ రావొద్దని దేవుడిని కోరుకుంటానని.. అసలు ఈ ఫీల్డ్ కే రావొద్దని తెలిపింది వర్ష.
ఇవి కూడా చదవండి :
Tollywood: మరీ ఇంత క్యూట్‌గా ఉందేంటీ భయ్యా.. గిబ్లి ఆర్ట్‌కే మతిపోగొట్టేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్..