Punch Prasad: మళ్లీ ‘పంచులు’పేలనున్నాయ్ .. జబర్దస్త్ కమెడియన్‌కు సర్జరీ పూర్తి.. ఖుషీలో ఫ్యాన్స్‌

|

Sep 11, 2023 | 1:20 PM

ప్రముఖ జబర్దస్త్ కమెడియన్‌ పంచ్‌ ప్రసాద్‌ గత కొన్నేళ్లుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. జబర్దస్త్ లాంటి టీవీ షోల్లో తన కామెడీ పంచులతో కడుపుబ్బా నవ్వించే ఆయన కిడ్నీ ప్రాబ్లమ్స్‌తో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా కొన్ని నెలల క్రితం ప్రసాద్‌ ఆరోగ్యం పూర్తిగా విషమించింది. ఆస్పత్రిలో కూడా చేరాల్సి వచ్చింది. అయితే తాజాగా జబరస్త్‌ ఫ్యాన్స్‌కు పంచ్‌ ప్రసాద్‌ భార్య సునీత ఒక గుడ్‌ న్యూస్‌ చెప్పింది

Punch Prasad: మళ్లీ పంచులుపేలనున్నాయ్ .. జబర్దస్త్ కమెడియన్‌కు సర్జరీ పూర్తి.. ఖుషీలో ఫ్యాన్స్‌
Jabardasth Punch Prasad
Follow us on

ప్రముఖ జబర్దస్త్ కమెడియన్‌ పంచ్‌ ప్రసాద్‌ గత కొన్నేళ్లుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. జబర్దస్త్ లాంటి టీవీ షోల్లో తన కామెడీ పంచులతో కడుపుబ్బా నవ్వించే ఆయన కిడ్నీ ప్రాబ్లమ్స్‌తో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా కొన్ని నెలల క్రితం ప్రసాద్‌ ఆరోగ్యం పూర్తిగా విషమించింది. ఆస్పత్రిలో కూడా చేరాల్సి వచ్చింది. అయితే తాజాగా జబరస్త్‌ ఫ్యాన్స్‌కు పంచ్‌ ప్రసాద్‌ భార్య సునీత ఒక గుడ్‌ న్యూస్‌ చెప్పింది. తన భర్తకు యశోద ఆస్పత్రిలో సర్జరీ జరిగిందని సునీత తెలిపింది. ఈ మేరకు యూట్యూబ్‌ చానెల్‌లో ఒక వీడియోను రిలీజ్‌ చేసిందామె. ప్రస్తుతం పంచ్‌ ప్రసాద్‌ ఆరోగ్య పరిస్థతి నిలకడగానే ఉన్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఖుషీ అవుతున్నారు. పంచ్‌ ప్రసాద్‌ త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే కిడ్నీలు దెబ్బతినడంతో గత కొద్ది రోజులుగా డయాలసిస్‌ ట్రీట్మెంట్‌ చేయించుకుంటున్నాడు ప్రసాద్‌. అయితే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ సర్జరీ జరిగితేనే ఆయన ప్రాణాలు నిలుస్తాయని డాక్టర్లు చెప్పారు. పైగా దీనికి భారీగా ఖర్చు అవుతుందని చెప్పడంతో ప్రసాద్‌ ఫ్యామిలీ తల్లడిల్లిపోయింది. ఇదే సమయంలో కొందరు జబర్దస్త్ టీమ్‌ సభ్యులు ప్రసాద్‌కు అండగా నిలిచారు. తమకు తోచినంత ఆర్థిక సహాయం చేశారు. వేణుస్వామి, కిర్రాక్‌ ఆర్పీ తదితరులు నటుడికి అండగా నిలిచారు. ఇక జబర్దస్త్‌ మాజీ జడ్డి, ఏపీ మంత్రి రోజా ప్రసాద్‌ విషయాన్ని ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సీఎం సహాయ నిధి నుంచి ప్రసాద్‌ చికిత్సకు తగిన ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఆదేశాలకు అనుగుణంగానే యశోద ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న పంచ్‌ ప్రసాద్‌కి సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా ఏపీ సర్కార్‌ చికిత్స అందించింది.

 

ఇవి కూడా చదవండి

కాగా పంచ్‌ ప్రసాద్‌కు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ సర్జరీ పూర్తి అయిందని తెలిపిన ఆయన భార్య సునీత.. ప్రసాద్‌ ఆరోగ్య పరిస్థితి గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయితే త్వరలోనే ఆయన మన ముందుకు వస్తారని మాత్రం తెలిపింది. ఎందరో దీవెనలతో తన భర్తకు ఈ సర్జరీ జరిగిందని సునీత ఎమోషనల్‌ అయ్యారు. మరి ప్రసాద్‌ సర్జరీ, ఆయన పరిస్థితి గురించి సునీత ఇంకా ఏమంటున్నారో ఈ కింది వీడియోలో చూసేయండి.

పంచ్ ప్రసాద్ ఎమోషనల్ వీడియో..

 

పంచ్ ప్రసాద్ సతీమణి సునీత లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..