Bigg Boss Telugu 9: 500తో హైదరాబాద్‌కు.. అందంగా లేవంటూ అవమానాలు.. కట్ చేస్తే.. బిగ్ బాస్‌9లో టాప్ కమెడియన్

చిన్నప్పటి నుంచి నటన అంటే ఇష్టం. ఇన్ స్టాలో రీల్స్ తో తన ట్యాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత జాబ్‌కు వెళ్తున్నా అని అబద్దం చెప్పి రూ. 500తో హైదరాబాద్‌ వచ్చాడు. అవకాశాల కోసం అన్నపూర్ణ స్టూడియోస్ చుట్టూ చక్కర్లు కొట్టాడు.. కట్ చేస్తే.. ఇప్పుడు..

Bigg Boss Telugu 9: 500తో హైదరాబాద్‌కు.. అందంగా లేవంటూ అవమానాలు.. కట్ చేస్తే.. బిగ్ బాస్‌9లో టాప్ కమెడియన్
Bigg Boss Telugu 9

Updated on: Sep 06, 2025 | 8:24 PM

బిగ్ బాస్ కొత్త ప్రారంభోత్సవానికి మరికొన్ని గంటలే మిగిలి ఉంది. ఇప్పటికే ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీషో తొమ్మిదో సీజన్ ఆదివారం (సెప్టెంబర్ 7)న సాయంత్రం ప్రారంభం కానుంది. బిగ్ బాస్ 9 గ్రాండ్ లాంఛ్ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. డబుల్ హౌస్, సిలబస్ మార్చేశాం , ఈసారి చదరంగం కాదు రణరంగం అంటూ బిగ్ బాస్ 9 హైప్ పెంచేశారు హోస్ట్ నాగార్జు. అంటే ఈసారి కొత్త రూల్స్, నయా టాస్కులు ఉండనున్నట్లు ముందే హింట్ ఇచ్చారు. ఇక ఈసారి హౌస్ లోకి అడుగు పెట్టే కంటెస్టెంట్స్ ఎవరని తెలుసుకునేందుకు బిగ్ బాస్ ఆడియెన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈసారి సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా హౌస్ లోకి రానున్నారు. అయితే ఈసారి సెలబ్రిటీ కంటెస్టెంట్ల జాబితాలో మొదటి నుంచి ఒక టాప్ కమెడియన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్, గ్యాప్ లేకుండా పంచులు.. తన ఎమోషన్స్ తోనే నవ్వుల్లో ముంచెత్తే ట్యాలెంట్. ఎలాంటి బ్యాక గ్రౌండ్ లేకుండా ఈ రంగంలోకి అడుగు పెట్టిన అతను తన ట్యాలెంట్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అందంగా లేవని అవమానాలు ఎదురైనా, బాడీ షేమింగ్ కామెంట్స్ తో వేధించినా దానినే పాజిటివ్ గా మల్చుకున్నాడు. తన యాక్టింగ్ తో బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్విస్తున్నాడు. అతనే జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయేల్

గుంటూరుకు చెందిన ఇమ్మాన్యుయేల్ కేవలం రూ.500తో తాను సిటీకి వచ్చి ఆడిషన్స్‌లో పాల్గొన్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. మొదట పటాస్ షోలో ఛాన్స్ దక్కించుకున్న ఇమ్మూ ఆ తర్వాత జబర్దస్త్ లోకి అడుగు పెట్టాడు. మరో లేడీ కమెడియన్ వర్షతో కలిసి పలు స్కిట్స్ చేసి ఆడియెన్స్ ను నవ్వుల్లో ముంచెత్తాడు. ప్రస్తుతం పలు టీవీ షోల్లో సందడి చేస్తూనే సినిమాల్లోనూ మెరుస్తున్నాడు ఇమ్మాన్యుయేల్. విరూపాక్ష లో ఓ కీలక పాత్ర పోషించిన అతను గ్రామ వాలంటీర్ అనే ఓ కామెడీ వెబ్ సిరీస్ లోనూ యాక్ట్ చేశాడు . ఈ క్రేజ్ కారణంగానే బిగ్ బాస్ టీమ్ ఇమ్మాన్యుయేల్ ను హౌస్ లోకి తీసుకురానుందని తెలుస్తోంది. మరి ఇంతలో ఎంత నిజముందో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.

ఇవి కూడా చదవండి

ఇమ్మాన్యుయేల్ లేటెస్ట్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.