
అబ్బాయిగా పుట్టినా హార్మోన్ల అసమతుల్యత కారణంగా అమ్మాయిగా మారిపోయింది తన్మయి. లింగమార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్నట్లు ఓ టీవీ షోలో వెల్లడించింది. ఇక జబర్దస్త్ టీవీ షోతో తన్మయికి మంచి గుర్తింపు వచ్చింది. అలాగే శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోగ్రామ్ లోనూ అప్పుడప్పుడూ సందడి చేస్తుంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది తన్మయి. ఈ సందర్భంగా చిన్ననాటి నుంచి తన జీవితంలో జరిగిన పలు ఆసక్తికర విషయాలను అందులో పంచుకుంది. అలాగే ప్రొఫెషనల్ వర్క్ పరంగా తనకు ఎదురైన చేదు అనుభవాలను వెల్లడించింది. ఈ క్రమంలో తన లవ్ ఫెయిల్యూర్ గురించి కూడా చెప్పుకొచ్చింది.
‘నేను ఒక అబ్బాయిని 8 ఏళ్లు లవ్ చేశాను. నేను సంపాదించే డబ్బులతో నా ఫ్యామిలీని చూసుకోవడమే కాక అతనికి కూడా డబ్బులు ఇచ్చాను. అతని ఫ్యామిలీకి కూడా ఆర్థికంగా ఎంతో సపోర్ట్ చేశాను. వారు గుంటూరులో మా ఇంటి దగ్గరే ఉండేవాళ్లు. నాతో చనువుగా ఉండడంతో లవ్ చేస్తున్నాడని అనుకున్నా. కానీ తర్వాత తెలిసింది వాళ్లు నన్ను లవ్ చేయలేదు. నా డబ్బుని లవ్ చేసారు అని. నన్ను చాలా మోసం చేసారు. అప్పట్నుంచే లవ్, రిలేషన్ షిప్ ఇంకేమి వద్దు అనుకున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటానంటూ కొన్ని సంబంధాలు కూడా తీసుకొచ్చారు. కానీ నేనే వద్దని చెప్పాను’ అని తన్మయి తెలిపింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరలవుతన్నాయి.
కాగా ఇదే ఇంటర్వ్యూలో తనకు జరిగిన యాక్సిడెంట్ గురించి చెప్పుకొచ్చింది తన్మయి. ‘జబర్దస్త్ నుంచి బయటకు వచ్చాక యాక్సిడెంట్ అయింది. కార్ లో వెళ్తుంటే బర్రెని గుద్దేసి కింద పడిపోయాను. నుదుటి మీద, ముక్కుకు తీవ్ర గాయాలు కావడంతో సర్జరీ జరిగింది. దాదాపు కోమాలోకి వెళ్లే పరిస్థితి వచ్చింది. నేను బెడ్ మీద ఉన్నాను. అందరికి ఈ విషయం తెలుసు. కనీసం నేను బతికానా చచ్చానా అని కూడా ఎవరూ పట్టించుకోలేదు. ఆఖరికి జబర్దస్త్ లో ఉన్నవాళ్లు కూడా పట్టించుకోలేదు. ఎవరూ సహాయం చేయలేదు, . కొంతమందిని నేను హెల్ప్ అడిగినా ముఖం చాటేశారు. కొంతమంది అయితే మోసం చేసారు’ అని వాపోయింది తన్మయి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.