karthika deepam premi viswanath: కార్తీకదీపం సీరియల్లో వంటలక్కగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ప్రేమీ విశ్వనాథ్.. ఇప్పుడు ఓ సూపర్ ఛాన్స్ కొట్టేశారు. బుల్లి తెర పై మెస్మరైజింగ్ యాక్టింగ్‌తో ఫిదా చేసింది చాలు ఇక వెండి తెరే… మన ఎయిమ్ అంటూ… హింట్స్ వదులుతున్నారు. బడా స్క్రీన్ పై మెరిసే రోజు త్వరలోనే ఉందంటూ… చెప్పకనే చెబుతున్నారు. విత్ అవుట్ డాక్టర్ బాబు.. వంటలక్కను ఆన్ వెండితెర అంటూ… నెట్టింట వైరల్ అవుతున్నారు. ఏంటి మీరు కూడా సీరియల్లా మ్యాటర్‌ని సాగదీస్తూ.. చిర్రేత్తేలా చేస్తున్నారని అనుకుంటున్నారా అయితే.. లేట్స్‌చేయకుండా అసలు పాయింట్ చెబుతా వినండి… రామ్ పోతినేని హీరోగా.. తమిళ్ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి డైరెక్షన్లో ఓ సినిమా తెరకెక్కుబోతోంది కదా…! బై లింగువల్ గా… యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి కదా…! అయితే ఈ వార్తలకు తోడు మరో వార్త కూడా ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్గా మారింది. మన వంటలక్క అలియాస్ ప్రేమీ విశ్వనాథ్ ఈ క్రేజీ సినిమాలో.. ఓ కీరోల్ ప్లే చేస్తున్నారంటూ… ఓ న్యూస్ ఇటు సోషల్ మీడియాలోనూ… అటు ఇండస్ట్రీలోనూ వైరల్ అవుతోంది.
దీనికి కారణం కూడా లేకపోలేదు. తాజాగా వంటలక్క ప్రేమీ.. డైరెక్టర్ లింగుస్వామిని కలిశానంటూ ఓ ఫోటోను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. దీంతో “మన పాపం వంటలక్క” రామ్, లింగుస్వామి సినిమాలో నటించనున్నారనే టాక్ నెట్టింట గట్టిగా వినిపిస్తోంది. కాని ఇది నిజమా అబద్దమా అనే విషయం.. ఇన్‌స్టానే మనుకు చెప్పాలి మరి.
మరిన్ని ఇక్కడ చదవండి :