Hit Movie: మీమ్ క్రియేటర్స్‌కు అదిరిపోయే పార్టీ ఇచ్చిన విశ్వక్..!

‘ఫలక్‌నుమా దాస్’ సినిమాతో టాలీవుడ్‌లో మంచి ఇంఫాక్ట్ ఇచ్చాడు యంగ్ హీరో  హీరో విశ్వక్ సేన్. వాస్తవానికి ఇతడు ‘వెళ్లిపోమాకే’ సినిమా ద్వారా వెండితెరకు పరియమైనా..ఆ మూవీ బహుళప్రాచుర్యం పొందకపోవడంతో విశ్వక్‌కు అంత పెద్ద గుర్తింపు రాలేదు.

Hit Movie: మీమ్ క్రియేటర్స్‌కు అదిరిపోయే పార్టీ ఇచ్చిన విశ్వక్..!
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 26, 2020 | 4:02 PM

Hit Movie:  ‘ఫలక్‌నుమా దాస్’ సినిమాతో టాలీవుడ్‌లో మంచి ఇంఫాక్ట్ ఇచ్చాడు యంగ్ హీరో  హీరో విశ్వక్ సేన్. వాస్తవానికి ఇతడు ‘వెళ్లిపోమాకే’ సినిమా ద్వారా వెండితెరకు పరియమైనా..ఆ మూవీ బహుళప్రాచుర్యం పొందకపోవడంతో విశ్వక్‌కు అంత పెద్ద గుర్తింపు రాలేదు. ఆ తరవాత తరుణ్ భాస్కర్ డైరక్షన్‌లో వచ్చిన ‘ఈ నగరానికి ఏమైంది’ మూవీలో నటించిన ఈ అగ్రెసీవ్ హీరో ఇండస్ట్రీ దృష్టిలో పడ్డాడు. ఆ తర్వాత అన్ని తానే అయి చేసిన ‘ఫలక్‌నుమా దాస్’ సినిమా కుర్రాడి కెరీర్‌కు రెడ్ బుల్ తాగినంత కిక్ ఇచ్చింది. ఇప్పుడు ‘హిట్’ సినిమాతో తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకునే పనిలో పడ్డాడు ఈ యంగ్ హీరో.  ‘హిట్’ సినిమాను న్యాచురల్ స్టార్ నాని ‘వాల్ పోస్టర్ సినిమా’ బ్యానర్‌పై సమర్పిస్తున్నారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మాత. ఇటీవలే ‘హిట్’ మూవీ ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేసింది యూనిట్.

ప్రస్తుతం సినిమాను తీయడం ఒకెత్తు అయితే..దాని ప్రజల్లోకి తీసుకెళ్లడం మరో ఎత్తు. ప్రమోషన్స్‌ ఓపెనింగ్స్‌పై ఇచ్చే ఇంఫాక్ట్ మాములుగా ఉండటం లేదు. అందుకే ఇప్పుడు ప్రమోషన్స్ జోరు పెంచింది టాలీవుడ్. రివ్యూ రైటర్స్‌, వెబ్‌ బ్లాగ్ రైటర్స్‌ను ఈ మధ్య గట్టిగానే ప్రభావితం చేస్తున్నారు మేకర్స్. అది కేవలం మనీ పరంగానే కాదు..పార్టీల జోరు కూడా మొదలైంది. ఈ స్వింగ్‌లో ముందున్నాడు విశ్వక్‌సేన్. తాజాగా నెటిజన్లను ఫేస్‌బుక్‌లో విఫరీతంగా ప్రభావితం చేస్తోన్న మీమ్స్ క్రియేటర్స్‌కు హైదరాబాద్‌లోని ఓ పబ్‌లో గట్టి పార్టీ ఇచ్చాడు ఈ కుర్ర హీరో. ఓవైపు నిర్మాతలు నాని, ప్రశాంతి ప్రచారంలో స్పీడ్ చూపిస్తోన్న..తనను తాను ఫోకస్ చేసుకునే ప్రయత్నంలో విశ్వక్ కూడా సినిమాని బాగా పర్సనల్ తీసుకున్నాడట. ఇన్విటేషన్‌ అందుకున్న వారిలో ఒక వర్గం మాత్రమే పార్టీకి వెళ్లినట్టు తెలుస్తోంది. మరో వర్గం సినిమా రిలీజ్ కాకుండా ప్రమోట్ చెయ్యడం సరికాదని సైలెంట్‌గా ఉన్నట్లు చెబుతున్నారు. స్వతహాగానే యాట్యిట్యూడ్‌కి బాప్‌లా బిహేవ్ చేసే ఈ కుర్ర హీరో..ఈ పార్టీలోను కొన్ని తలనొప్పులు తెచ్చుకున్నాడట. వచ్చిన మీమ్స్ క్రియేటర్స్‌ని కనీసం విష్ కూడా చెయ్యలేదట. ఏది ఏమైనా ఈ యంగ్ హీరో బిహేవియర్ ఎప్పటికప్పుడు కొంత కొత్తగా, ఇంకొంత ఆసక్తిగా అనిపిస్తూ ఉంటుంది.