Guppedantha Manasu Rishi: హీరోగా ‘గుప్పెడంత మనసు’ రిషి సర్.. వైరలవుతున్న ఫోటోస్.. టైటిల్ ఏంటంటే..

రిషి, వసుధార పాత్రలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తం కాదు. వీరిద్దరిని తెలుగు అడియన్స్ గుండెల్లో పెట్టుకుని అభిమానిస్తున్నారు. అటు సోషల్ మీడియాలో వీరిద్దరి ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. కానీ ఇప్పుడు ఈ సీరియల్ విషయంలో ఫ్యామిలీ అడియన్స్ అసహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రేక్షకులకు ఎంతో అభిమానించే రిషి పాత్రను పోషిస్తున్న ముఖేష్ గౌడ ఈ సీరియల్లో కనిపించి చాలాకాలమైంది.

Guppedantha Manasu Rishi: హీరోగా గుప్పెడంత మనసు రిషి సర్.. వైరలవుతున్న ఫోటోస్.. టైటిల్ ఏంటంటే..
Rishi

Updated on: Apr 13, 2024 | 7:39 AM

వెండితెరపై సినిమాలతో మెప్పించిన నటీనటులకు ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంటుంది. తమ అభిమాన హీరో కోసం ఏం చేయడానికైనా రెడీ అవుతుంటారు. అలాగే తమకు నచ్చిన హీరో సినిమా రిలీజ్ అయితే థియేటర్లలో పండగే. ఇంతంటి అభిమానగణం కేవలం కొందరు స్టార్ హీరోలకు మాత్రమే ఉంటుంది. కానీ ఇప్పుడు బుల్లితెర హీరోలకు కూడా ఫ్యాన్ బేస్ ఎక్కువే ఉంటుంది. మొన్నటి వరకు స్మాల్ స్క్రిన్ పై కార్తీక దీపం సీరియల్ టాప్ రేటింగ్‏తో దూసుకుపోయింది. ఇక ఆ తర్వాత అత్యధిక టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకున్న సీరియల్ గుప్పెడంత మనసు. ఇందులోని రిషి, వసుధార పాత్రలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తం కాదు. వీరిద్దరిని తెలుగు అడియన్స్ గుండెల్లో పెట్టుకుని అభిమానిస్తున్నారు. అటు సోషల్ మీడియాలో వీరిద్దరి ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. కానీ ఇప్పుడు ఈ సీరియల్ విషయంలో ఫ్యామిలీ అడియన్స్ అసహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రేక్షకులకు ఎంతో అభిమానించే రిషి పాత్రను పోషిస్తున్న ముఖేష్ గౌడ ఈ సీరియల్లో కనిపించి చాలాకాలమైంది.

అతడి పాత్ర ఉందా ? లేదా ? అనే క్లారిటీ ఇవ్వకుండా దాదాపు నెల రోజులుగా రిషి గురించి సస్పెన్స్ మెయింటెన్ చేస్తున్నారు. అతడు మళ్లీ సీరియల్లో కనిపిస్తాడా ?లేదా?.. అసలు ఎప్పుడు వస్తాడు ? తిరిగి వసుధార, రిషి కలుసుకుంటారా ? అంటూ ఎన్నో ప్రశ్నలు అడియన్స్ మదిలో ఉండిపోయాయి. రిషి పాత్ర లేకుండా గుప్పెడంత మనసు సీరియల్ లేదు అన్న స్థాయిలో.. ఆ పాత్రను మర్చిపోలేకపోతున్నారు ఫ్యామిలీ అడియన్స్. రిషి ఎప్పటికైనా వస్తాడని ఎదురుచూస్తున్న అభిమానులకు సోషల్ మీడియా వేదికగా తన కెరీర్ కు సంబంధించిన మరో ఆసక్తికర విషయాన్ని తెలిపాడు రిషి అలియాస్ ముఖేష్ గౌడ.

సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ అభిమానులను పలకరిస్తున్నాడు ముఖేష్ గౌడ. తాజాగా హీరోగా తన కొత్త సినిమా గురించి తెలియజేస్తూ షూటింగ్ ఫోటోస్ షేర్ చేస్తూ ఉగాది శుభాకాంక్షలు తెలిపాడు. “క్రోధి నామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. కొత్త సంవత్సరంలో మీకు సంతోషం, శాంతి, అభివృద్ధి కలగాలని కోరకుంటున్నాను. ఉగాది శుభాకాంక్షలు” అంటూ పోస్ట్ చేస్తూ తన కొత్త సినిమా షూటింగ్ ఫోటోస్ షేర్ చేశాడు. ముఖేష్ హీరోగా నటిస్తున్న సినిమా టైటిల్ గీతా శంకరం. ఇందులో పక్కా పల్లెటూరి అబ్బాయిలా కనిపిస్తున్నాడు. ఈ చిత్రానికి నూతన దర్శకుడిగా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రియాంక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను ప్రకటించనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.