Bigg Boss Telugu 8: 9 నెలల గర్భంతో ఉన్న భార్యను వదిలి బిగ్ బాస్‌లోకి శేఖర్ బాషా.. ఎందుకో తెలిస్తే కన్నీళ్లాగవు

|

Sep 12, 2024 | 4:16 PM

ప్రస్తుతం బిగ్‌బాస్ 8లో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఆర్జే శేఖర్ బాషా అని చెప్పవచ్చు. టాస్కుల్లో చురుగ్గా పార్టిసేపట్ చేస్తూ, మాటకు మాట బదులు ఇస్తూ బుల్లితెర ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్నాడు. ముఖ్యంగా హౌస్ లో శేఖర్ బాషా వేస్తోన్న ఆటో పంచులు, జోకులు కంటెస్టెంట్స్ తో పాటు ఆడియెన్స్ కు మంచి ఫన్ అందిస్తున్నాయి. ఇదిలా ఉంటే శేఖర్ బాషా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పటికీ ప్రస్తుతం అతని ఆలోచనలన్నీ తన భార్య చుట్టూనే తిరుగుతున్నాయి.

Bigg Boss Telugu 8: 9 నెలల గర్భంతో ఉన్న భార్యను వదిలి బిగ్ బాస్‌లోకి శేఖర్ బాషా.. ఎందుకో తెలిస్తే కన్నీళ్లాగవు
Shekar Basha
Follow us on

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే రెండో వారం నామినేషన్లు కూడా పూర్తయ్యాయి. ఓటింగ్ కూడా ప్రారంభమైంది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో? అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం బిగ్‌బాస్ 8లో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఆర్జే శేఖర్ బాషా అని చెప్పవచ్చు. టాస్కుల్లో చురుగ్గా పార్టిసేపట్ చేస్తూ, మాటకు మాట బదులు ఇస్తూ బుల్లితెర ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్నాడు. ముఖ్యంగా హౌస్ లో శేఖర్ బాషా వేస్తోన్న ఆటో పంచులు, జోకులు కంటెస్టెంట్స్ తో పాటు ఆడియెన్స్ కు మంచి ఫన్ అందిస్తున్నాయి. ఇదిలా ఉంటే శేఖర్ బాషా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పటికీ ప్రస్తుతం అతని ఆలోచనలన్నీ తన భార్య చుట్టూనే తిరుగుతున్నాయి. ఎందుకంటే ఆమె ప్రస్తుతం 9 నెలల నిండు గర్భంతో ఉంది. మరి ఇలాంటి సమయంలో శేఖర్ బాషా తన భార్యను వదిలేసి రావడం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. దీని గురించి అతను ఇది వరకే మాట్లాడాడు. బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగు పెట్టేముందు ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భార్య ప్రగ్నెన్సీ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు శేఖర్ బాషా. ‘ మీ భార్య 9 నెలల గర్భిణి అయినా సరే మీరు హౌస్‌లోకి వెళ్తున్నారు. ఇది కరెక్టేనా’ అని యాంకర్ అడగ్గా బాషా ఇలా సమాధానమిచ్చాడు.

“కరెక్ట్ కాదు.. కానీ మా ఆవిడ కోరిక ఇదే.. ప్రెగ్నెంట్ లేడీ కోరిక తీర్చాలంటారు కదా.. అందుకే బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్తున్నా.. కానీ నేను నా భార్యకి చాలా క్లియర్‌గా చెప్పాను. బిగ్ బాస్ లోకి ఈ సంవత్సరం కాకపోతే వచ్చే ఏడాది వెళ్లొచ్చు లేకపోతే మళ్లెప్పుడైనా చూద్దాంలే అన్నాను. కానీ నా భర్య మాత్రం నువ్వు వెళ్లాల్సిందే అని చెప్పింది. బిగ్ బాస్ కు నేను రావడం నా కన్నా నా భార్యకే ఎక్కువ కోరికగా ఉంది. అయితే బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లిన తర్వాత తనకి ఎలా ఉంటుంది? అన్న బెంగ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది’ అని ఎమోషనల్ అయ్యాడు.

ఇవి కూడా చదవండి

మా ఆవిడ కోరిక మేరకే..

ఇదిలా ఉంటే ఇప్పటివరకూ ఒక్క సందర్భంలో కూడా తన భార్య గర్భిణి అన్న విషయం బిగ్ బాస్ హౌస్ లో చెప్పలేదు శేఖర్ బాషా.
అదే సమయంలో తోటి కంటెస్టెంట్స్ లో చాలా మంది తమ పర్సనల్ లైఫ్ లోని విషయాలను హౌస్ లో చెబుతూ సింపథీ గేమ్ ఆడుతున్నారు. మొత్తానికి భార్య కోరిక మేరకు హౌస్ లో అడుగు పెట్టిన శేఖర్ బాషా ఆడియెన్స్ ను బాగానే ఎంటర్ టైన్ చేస్తున్నాడు.
అన్నట్లు బాషా భార్యకి డెలివరీ డేట్ ఈ నెల 14 ఇచ్చినట్లు సమాచారం. అంటే మరో మూడు రోజుల్లో అతను తండ్రిగా ప్రమోషన్ పొందనున్నాడన్నమాట

మరో 3 రోజుల్లో డెలివరీ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.