చాలామంది ఊహించినట్లుగానే బిగ్ బాస్ నుంచి సోనియా ఆకుల ఎలిమినేట్ అయ్యింది. హౌస్‌లో తరచూ వాగ్వాదాలు, గొడవలతో బాగా హైలెట్ అయిన ఆమె నాలుగో వారంలోనే బయటికి వచ్చేసింది. దీనికి తోడు చిన్నోడు పెద్దోడు అంటూ పృథ్వీ, నిఖిల్‌తో ఆమె ప్రవర్తించిన తీరుతో బిగ్ బాస్ ప్రేక్షకులు విసిగెత్తిపోయారు. దీంతో నాలుగో వారంలో నామినేషన్స్ లిస్టులో ఉన్న సోనియా తక్కువ ఓటింగ్ కారణంగా బయటకు వచ్చేసింది. అయితే, బిగ్‍బాస్ హౌస్‍లో నాలుగు వారాలు ఉన్న సోనియాకు మంచి రెమ్యూనరేషన్ అందిందని సమాచారం. సీజన్ ప్రారంభమవ్వడానికి ముందే పారితోషకానికి సంబంధించి కాంట్రాక్టు జరిగిందని సమాచారం. దీని ప్రకారం రోజుకు రూ.28 వేల చొప్పున ఒక్కో వారానికి రూ. 2 లక్షల రెమ్యునరేషన్ దక్కేలా సోనియా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టిందట. ఆ లెక్కన మొత్తం నాలుగు వారాలకు గానూ సోనియా మొత్తం రూ. 8 లక్షలు అందుకుందని సమాచారం.
కాగా మోడల్‍గా కెరీర్ ఆరంభించిన సోనియా 2019లో జార్జి రెడ్డి చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత డైరెక్టర్ రామ్‍గోపాల్ మూవీ కరోనా వైరస్ చిత్రంలో లీడ్ రోల్ చేయడంతో సోనియా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఆశా ఎన్‍కౌంటర్ చిత్రంలోనూ నటించింది. ఇదే క్రేజ్ తో బిగ్‍బాస్ హౌస్‍లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‍గా అడుగుపెట్టారు. అయితే, నాలుగో వారంలోనే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చింది.
కాగా మొత్తం 14 మందితో ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో నాలుగు వారాలు గడిచిపోయాయి. బెజవాడ బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌస్ లో పది మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. అయితే ఈ వారంలోనే వైల్డ్ కార్డ్ ద్వారా గత సీజన్ల మాజీ కంటెస్టెంట్లు కొందరు బిగ్ బాస్ హౌస్‍లో అడుగుపెట్టనున్నారని ప్రచారం జరుగుతోంది. ముక్కు అవినాశ్, హరితేజ, నయని పావనిల పేర్లు ఇందులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అలాగే ఈ సీజన్ లో ఎలిమినేట్ అయిన ఒక కంటెస్టెంట్ ను కూడా తిరిగి హౌస్ లోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. శేఖర్ బాషా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.