
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. స్వప్న హారతి ఇస్తూ ఉండగా.. అపర్ణ ఆపుతుంది. ఇవన్నీ చేసేది నా కోడలు కదా.. కావ్య ఎక్కడ? పిలవమని అంటుంది. అందరూ అయోమయంగా చూస్తూ ఉంటారు. ఇంకెక్కడ నీ కోడలు వదినా.. ఎప్పుడో వెళ్లిపోయింది కదా అని రుద్రాణి అంటుంది. వెళ్లి పోవడం ఏంటి అని అపర్ణ కంగారు పడుతుంది. నీకు బాలేదు కదా అమ్మా.. అందుకే వారం నుంచి గుడికి వెళ్లి వెళ్తుంది.. వచ్చేస్తుంది లే అని రాజ్ కవర్ చేస్తాడు. నేను కళ్లు తెరవగానే నా పక్కనే ఉంటుంది అనుకున్నా.. ఇప్పుడు ఇంట్లో కూడా లేదంటున్నారు. అసలు నేను ఇంటికి వచ్చిన విషయం తనకు చెప్పారా? అని అపర్ణ అడుగుతుంది. చెప్పాను మమ్మీ అని రాజ్ కవర్ చేస్తాడు. ఇక స్వప్న దిష్టి తీయగా.. అపర్ణ ఇంట్లోకి వెళ్తుంది. అపర్ణ వెళ్లిన తర్వాత.. రుద్రాణికి చివాట్లు పెడుతుంది ఇందిరా దేవి. అసలు నువ్వు మనిషివేనా? అపర్ణ పరిస్థితి బాలేదని తెలుసు కదా.. ఇప్పుడు కావ్య విషయం చెప్పడం అవసరమా? అని వార్నింగ్ ఇస్తుంది.
ఇప్పుడు నాకు కావాల్సింది.. రాజ్ డిప్రెషన్‌లోకి వెళ్లి ఒంటరిగా వెళ్లిపోవడం.. అప్పటి వరకూ నేను ఎంతైనా చేస్తాను. ఇలాంటి సమయంలో కావ్య ఎక్కడికో ఐరు వెళ్లిందని చెప్పాలి కానీ.. గుడికి వెళ్లిందని చెప్తారా? రాత్రికి కోడలు ఇంటికి రాకపోతే.. మా వదిన ఊరుకుంటుందా అని రుద్రాణి అంటే.. అప్పుడు అత్తకి నిజం చెప్పేస్తావా? అమ్మా అని రాహుల్ అంటాడు. ఆ నిజం విన్నాక మా వదిన గుండె ఆగిపోతుందో లేదో కళ్లారా చూద్దాం పదా అని అనుకుంటారు.
కట్ చేస్తే.. కావ్య డిజైనర్ దగ్గరకు వెళ్తుంది. ఒకప్పుడు మీరు నా డిజైన్స్ చాలా మంది తీసుకునేలా చేశారు. ఇప్పుడు కూడా మీరు మళ్లీ నాకు అలాంటి అవకాశం కావాలని అంటుంది. అది ఒకప్పుడు.. కానీ నువ్వు దుగ్గిరాల ఇంటికి కోడలివి అయిపోయావు. నువ్వు తలచుకుంటే ఇప్పుడు ఒక కంపెనీనే పెట్టగలవు అని మీడియేటర్ అంటాడు. అది అప్పుడు.. పరిస్థితులు ఎప్పుడూ ఒకలా ఉండవు అని కావ్య అంటుంది. నీ మాటలను బట్టి చూస్తుంటే నువ్వు అత్తవారింటికి దూరం అయ్యావని తెలుస్తుంది. కానీ నేను ఇప్పుడు ఎవరితోనూ టచ్‌లో లేనని అంటే.. మీరు ఎప్పుడు అడిగినా డిజైన్స్ వేసి ఇస్తాను. ఇప్పుడు నాకు చాలా అవసరమని కావ్య అంటే.. అవసరం తీరిపోతే అని సందీప్ అంటాడు. నేను ఆ అవకాశం రానివ్వనని కావ్య అంటుంది. సరే నేను ఒకసారి కనుక్కుని చూస్తానని సందీప్ అంటాడు.
ఆ తర్వాత అపర్ణ ఆలోచనలో ఉంటుంది. అప్పుడే రాజ్ వచ్చి ట్యాబ్లెట్స్ ఇస్తాడు. కావ్య ఏది? ఇంకా రాలేదని అపర్ణ అడుగుతుంది. రాజ్ సమాధానం చెప్పలేడు. ఏదో ఒకటి చెప్పి దాటవేస్తాడు. ఆ తర్వా ధాన్య లక్ష్మి వచ్చి జ్యూస్ ఇస్తుంది. నేను వెళ్లాక.. ఈ ఇంట్లో ఏమన్నా గొడవ జరిగిందా? అడుగుతుంది. వస్తుందిలే అక్కా.. నువ్వు చిన్న చిన్న విషయాలను కూడా పట్టించుకుంటావేంటి? అని చెప్పి వెళ్లిపోతుంది. ఆ తర్వాత కొద్ది సేపటి ఇందిరా దేవి వస్తుంది. ఎలా ఉంది అపర్ణా అని అడుగుతుంది. బాగానే ఉన్నాను. ఇంట్లో ఏం జరుగుతుంది? నా మనసు కీడు శంకిస్తుంది కదా అని అపర్ణ అంటుంది. ఏముంది అపర్ణ అంతా బాగానే ఉంది కదా.. అని చెప్పి ఇందిరా దేవి వెళ్తుంది.
బయట రాజ్ దగ్గరకు వెళ్లి.. నిజం తెలిస్తే బతుకుతుందో లేదో అని భయపడాలో నాకు అర్థం కావడం లేదు. ఏం జరిగినా నువ్వే బాధ్యత వహించాలి. ఇంకా ఈ నిజాన్ని దాస్తామని నాకు అనిపించడం లేదుని ఇందిరా దేవి అంటుంది. ఇక రాత్రి అవుతుంది. అపర్ణ.. కావ్య గురించి ఎదురు చూస్తుంది. రాజ్ వచ్చి మమ్మీ ఇంకా పడుకోలేదా? నీ ఆరోగ్యం బాలేదు వెళ్లు అని అంటాడు. ఏం జరిగింది? నేను లేనప్పుడు ఇంట్లో ఏం జరిగింది? కావ్య ఎక్కడికి వెళ్లింది? ఎందుకు వెళ్లింది? అసలు వస్తుందా? రాదా? అని అపర్ణ అడుగుతుంది. అప్పుడే ఇంట్లోని వాళ్లందరూ బయటకు వస్తారు. రాజ్ చెబుతున్నా.. అపర్ణ పట్టించుకోదు. ఏం దాస్తున్నారు? నా దగ్గర.. కావ్య ఏది? చెప్పమని అడుతుంది అపర్ణ. కావ్య గురించి నాకు బాగా తెలుసు. నేను ద్వేషించే రోజుల్లోనే నా ఆరోగ్యం బాగ లేకపోతే నేను తిడుతున్నా.. నాకు సేవలు చేసేది. కానీ ఇలాంటి సమయంలో ఎందుకు లేదు? కావ్య ఇందులో లేదంటే ఆమె మనసు విరిగి వెళ్లిపోయి ఉండాల్సింది.. లేదంటే ఈ ఇంట్లోని వాళ్లే బలవంతంగా పంపించాల్సి ఉంటుందని అపర్ణ అడుగుతుంది.
భూదేవి అంత సహనంగా ఉండే నా కోడలు.. అత్త వారి ఇల్లు వదిలి ఎందుకు వెళ్లిపోయింది? మీలో ఎవరు ఏం అన్నారు? అని అపర్ణ అడుతుంది. రుద్రాణి వైపు చూసి.. నువ్వేనా మంథర బుద్దులు చూపించి నా కోడల్ని ఇంట్లోంచి పంపించేశావా? అని అడుగుతుంది అపర్ణ. ఇది మరీ బావుంది. ఏం జరిగినా మేమేనా కారణం. నేను కదా కారణం.. నీ కొడుకే. ఇందులో వాడి తప్పు కూడా లేదు. నీ కోడలు చేయాల్సిన తప్పులన్నీ చేసేసింది. నిలదీసే సరికి వెళ్లిపోయిందని రుద్రాణి అంటుంది. సారీ అమ్మమ్మ గారు ఈ సారి ఎవరు ఆపినా నేను ఆగను. ఏం తప్పులు చేసింది నా చెల్లి? నిన్ను చూస్తుంటే లాగి పెట్టి చెంప పగలకొట్టాలని ఉంది. అపర్ణ ఆంటీ.. నా చెల్లి ఏ తప్పూ చేయలేదు. ఒక్క విషయం అడుగుతున్నా చెప్పండి.. కావ్యని మీరు కంపెనీకి పంపిస్తే వెళ్లిందా? లేక అదే వెళ్లిందా? అని స్వప్న అంటే.. నేను పంపిస్తేనే వెళ్లిందని అపర్ణ అంటుంది. విన్నారా.. అందరూ అని స్వప్న అంటుంది. అయితే ఏమైంది? ఈ దుర్మార్గుడు కావ్యని చంపేశాడా? అని అపర్ణ అంటే.. కావ్యని చంపేసింది మీ అబ్బాయి. ప్రాణాలు తీయలేదు అంతే.. దాని ఆత్మ గౌరవాన్ని చంపేశాడని చెబుతుంది.
కావ్య మిమ్మల్ని వదిలి వెళ్లిపోవడం వల్ల మీ ప్రాణాల మీదకు వచ్చిందని.. ఇలాంటి ఆడది ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదని అదిగో ఆ రాక్షసి గొడవ చేసింది. దీంతో రాజ్.. కావ్యని పట్టుకుని ఇష్టంతో ప్రేమతో పెళ్లి చేసుకోలేదని.. అందరి బలవంతం చేస్తే తప్పకుండా కాపురం చేశానని.. నువ్వు నా భార్యగా ఉండే అర్హత లేదని అంటే.. దాని గుండె పగిలి ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని స్వప్న చెబుతుంది. దీంతో అపర్ణ షాక్ అయి.. బాధ పడుతుంది. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.