ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. నువ్వు అమ్మగా భావించే పెద్దమ్మ ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతుంటే.. నువ్వు ఆ పరాయి మనిషి కోసం రక్త సంబంధాన్ని నిందిస్తున్నావా? ఇంతటి వదిలేస్తే మంచిది. నువ్వు ప్రశాంతంగా వెళ్లు అని రాజ్ అంటాడు. నేను ప్రశాంతంగా వెళ్లాలంటే నువ్వు వెళ్లి వదినను ఇంటికి తీసుకురావాలని కళ్యాణ్ అంటాడు. నేను ఆ పని ఎప్పటికీ చేయను. తను తప్పు చేశానని ఫీల్ అయ్యింది కాబట్టే వెళ్లిపోయింది. లేదంటే అంత మొండి మనిషి ఇక్కడే నిలబడి నిలదీసేది. ఎందుకు పారిపోయిందని రాజ్ అంటాడు. వదిన పారిపోలేదు. నువ్వు నమ్మలేదు కాబట్టి మనసు విరిగిపోయి వెళ్లిపోయింది. భార్యను గుండెల్లో పెట్టి చూసుకుంటే ఇల్లు వైకుంఠంగా మారుతుంది. కానీ తన ఉనికే అస్తిత్వంగా మారితే ఏ స్త్రీ కూడా ఉండలేదు. అందుకు మా వదిన వెళ్లిపోయింది అది గుర్తు పెట్టుకో అన్నయ్యా.. అయితే నువ్వు మనసు మార్చుకోవా.. వదినను తీసుకురావా అని కళ్యాణ్ అడుగుతాడు.
నేను పొమ్మని అనలేదు.. రమ్మని కూడా అనను. నేను తీసుకొచ్చే ప్రసక్తే లేదని రాజ్ అంటాడు. ఇంత బండరాయిలా ఎలా మారిపోయావు అన్నయ్యా? వదిన గురించి నువ్వు ఇప్పుడు అర్థం చేసుకోలేక పోవచ్చు. కానీ ఏదో ఒక రోజు నీకే నిజం తెలుస్తుంది. సరే నేను వెళ్తున్నా.. అని కళ్యాణ్ వెళ్లిపోతుండగా.. ధాన్య లక్ష్మి ఆపుతుంది. పరాయి ఇంటి నుంచి వచ్చిన మీ వదినను అర్థం చేసుకున్నవాడివి.. కానీ ఈ కన్న తల్లి మనసు అర్థం చేసుకోలేదా? అని అడుగుతుంది. వదిన ఇంటి నుంచి వెళ్లిపోవడంలో నీ పాత్ర ఎంత? అని కళ్యాణ్ అడిగి వెళ్లిపోతాడు.
అప్పుడే స్వప్న చప్పట్లు కొడుతూ.. ఇంత సేపూ ఒక్కరు కూడా మాట్లాడలేదేంటి? గొంతు మూగబోయిందా? కళ్యాణ్ అడిగిన ఏ ప్రశ్నకూ జవాబు దొరకలేదా? మా కావ్య కోసం పంతాలు.. పట్టింపులు వదులుకున్నావని సంతోష పడ్డాను. కానీ మా కావ్యనే వదులుకుంటావని అనుకోలేదు. కళ్యాణ్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే. నేను వెళ్లిపోయాను అంటే అర్థం ఉంది. కానీ కావ్య ఈ గడప దాటి వెళ్లిపోయిందంటే.. అది ఎన్ని అనర్థాలకు మూలం కాబోతుందో.. మీ అమ్మగారు ఇంటికి తిరిగి వచ్చిన రోజు నీకు అర్థం అవుతుంది అని చెప్పి స్వప్న వెళ్లిపోతుంది.
కావ్య ఇంటి నుంచి వెళ్లిపోవడంతో.. రుద్రాణి, రాహుల్‌లు ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తారు. సంతోషంగా స్టెప్పులు వేస్తారు. అప్పుడే స్వప్న వచ్చి సైలెంట్‌గా నిల్చుని వెళ్తుంది. మనదే రాజ్యం అంటూ చిందులు వేస్తారు. స్వప్నను చూసి షాక్ అవుతారు. ఏంటి ఆపారు? వేయండి చిందులు.. రాజ్యాలూ.. రాజులు అంటున్నారు. బాగా తాగినట్టు కూడా కనిపిస్తున్నారే? తల్లి కొడుకులు కలిసి పార్టీలు చేసుకుంటున్నారా? ఛీ మీరు అసలు మనుషులేనా? ఇంట్లో ఇన్ని గొడవలు జరుగుతుంటే.. ఇలాగేనా మీరు చేసేది? ఇన్ని రోజులూ ఈ ఇంట్లో పడి తింటున్నారు. అయినా ఏమాత్రం బాధ పడుకుండా.. సిగ్గులేకుండా డ్యాన్సులు వేస్తున్నారా? కొంచెం మనుషుల్లా ప్రవర్తించండి.. ఛీ అని వెళ్తూ ఆగుతుంది స్వప్న. అవునూ.. నా చెల్లెలు ఇంట్లోంచి వెళ్లిపోయినా.. అపర్ణ ఆంటీ ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య ఉన్నా.. మీరు పార్టీ చేసుకుంటున్నారు ఏంటి? ఒక వేళ ఆ రెండూ జరగడంతో మీ హస్తం ఏమన్నా ఉందా? అని స్వప్న అడుగుతుంది.
దీంతో రుద్రాణి కంగారు పడుతూ.. ఏ.. ఛీఛీ లాఫింగ్ గ్యాస్ ఎఫెక్ట్ ఒక వారం రోజుల దాకా ఉంటుందట. అందుకే ఎంత నవ్వు ఆపుకున్నా నవ్వు వస్తుందని అంటుంది. బాగా అయ్యింది.. ఒక వేళ కావ్య వెళ్లిపోవడానికి కారణం మీరే అని తెలిస్తే.. అప్పుడు ఉంటుంది మీ తల్లీ కొడుకులకు అని వార్నింగ్ ఇచ్చి స్వప్న అంటుంది. ఇక మళ్లీ సంతోషంగా డ్యాన్స్ చేస్తారు రాహుల్, రుద్రాణిలు. మరోవైపు కనకం, కృష్ణమూర్తిలు కంగారు పడుతూ ఉంటారు. కావ్య ఏంటి? ఆ ఇంటి నుంచి ఎందుకు వదిలి వచ్చింది? అక్కడ ఏం జరిగింది? అని ఆలోచిస్తూ ఉంటారు. సహనంతో ఉండే కూతురు కోపం.. అత్తారింటి గోడలు బద్దలు కొట్టుకుని వచ్చేసింది. అసలు అక్కడి నుంచి ఎందుకు రావాల్సి వచ్చిందని మాట్లాడుకుంటూ.. ఇందిరా దేవికి ఫోన్ చేస్తారు.
నమస్కారం అమ్మా.. అసలు కావ్య అక్కడి నుంచి రావడానికి కారణం ఏంటి? అని అడుగుతారు. దీంతో జరిగిన దంతా చెబుతుంది పెద్దావిడ. దీంతో కనకం ఏడుస్తూ నా కూతురు జీవితం నాశనం అయిపోయిందని బాధ పడతారు. మరోవైపు కళ్యాణ్ కూడా బాధ పడుతూ ఉంటాడు. అక్కడికి వెళ్లి నువ్వు గొడవ పెట్టుకుంటే ఇలాగే జరుగుతుంది. ఈ గొడవ వల్ల ఎవరైనా మారారా? అని అప్పూ అంటుంది. నేను బాధ పడుతుంది వాళ్లు నన్ను తిట్టారు అని కాదు.. వదినకు ఇలా జరిగిందని బాధ పడుతున్నా. ఎలాంటి పరిస్థితి వచ్చినా.. వదిన నిలబడుతుంది అనుకున్నా.. కానీ తల వంచుకుని వచ్చేసింది. వదినను తిరిగి ఆ ఇంటికి ఎలా పంపించాలో అర్థం కావడం లేదని కళ్యాణ్ అంటాడు. మా అక్క ఇంటి నుంచి వచ్చిందంటే.. మళ్లీ అక్కడికి వెళ్లదు. మా అక్క తప్పు చేయకపోతే అస్సలు ఎవరి మాట వినదని అప్పూ అంటుంది. ఆ తర్వాత సీరియల్‌లో సాడ్ సాంగ్ ప్లే అవుతుంది. అందరూ విచారంగా ఉంటూ కనిపిస్తారు. అలా రోజులు గడుస్తాయి. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..