Brahmamudi, November 15th Episode: కావ్య, రాజ్‌లను దెబ్బ కొట్టేందుకు అనామిక ప్లాన్.. రాజ్ వాగ్దానాలు..

ఎలాగైనా సీతారామయ్య పెట్టిన పందెంలో గెలవాలని రాజ్ తెగ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎంప్లాయిస్‌ని వేరు చేసి.. తన మాట వినేలా చేసుకుంటాడు. మరోవైపు కావ్య, రాజ్‌లను దెబ్బ కొట్టేందుకు.. జగదీష్‌తో మీట్ అవుతుంది. కాంట్రాక్ట్ తమకు ఇవ్వాలని అడుగుతుంది..

Brahmamudi, November 15th Episode: కావ్య, రాజ్‌లను దెబ్బ కొట్టేందుకు అనామిక ప్లాన్.. రాజ్ వాగ్దానాలు..
BrahmamudiImage Credit source: Disney hot star
Follow us
Chinni Enni

|

Updated on: Nov 15, 2024 | 11:03 AM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. ఎలాగైనా సీతారామయ్య పెట్టిన పందెంలో గెలవాలని రాజ్ ఓ యుద్ధానికి బయలు దేరినట్టు ఆఫీస్‌కి వస్తాడు. ఇక రాజ్‌ని చూసిన కావ్య కావాలనే ఆట పట్టిస్తుంది. ఎలాగైనా ఈ పందెంలో గెలిచేది నేనే అంటుంది. దీంతో రాజ్ కావ్యని తిడతాడు. అప్పుడు ఇక కావ్య బూత్ బంగ్లా స్టోరీ మొదలు పెడుతుంది. ఇక సిఈవో సీటులో కావ్య కూర్చొవడానికి రాజ్ ఒప్పుకోడు. అయినా కావ్య ఓప్పుకోదు. ఎలాగైనా నాదే కదా ఆ సీటు అని అంటాడు. ఓయ్ శ్రుతి వెళ్లి స్టాఫ్ అందర్నీ పిలుచుకురమ్మని రాజ్ చెప్తాడు. ఈలోపు శ్రుతి బూత్ బంగ్లా గురించి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంది. మరోవైపు స్టాఫ్ అందర్నీ పిలిపించిన రాజ్.. ఈ నియంతృత్వ పాలన నుంచి నిమూలించి.. రేపటి కోసం.. స్వేచ్ఛగా ఆఫీసులో అడుగు పెట్టే శుభదినం వచ్చేస్తుందని రాజ్ అంటాడు. రేపటి నుంచి మీరు రావడం లేదా సర్ అని ఒక ఎంప్లాయ్ అంటాడు. రేయ్ ఎవర్రా వాడు వాయిస్ గుర్తుకు పెట్టుకుని మరీ టార్చర్ చూపిస్తానని అంటాడు. ముందు వాళ్లను ఎందుకు పిలిచారో చెప్పమని కావ్య అంటుంది.

రాజ్ వాగ్దానాలు..

అధికారం కోసం పురుషుల ఉనికి తొక్కి వేయబడుతుంది. ఈ అనాగరిక చర్యను కండిస్తూ ఈ మహిళా పాలనను నిరసిస్తూ నేనొక ఉద్యమం లేవదీశాను. దాని ఫలితమే ఈ పందెం. చైర్మన్ గారు ఈ పోటీ పెట్టారు. ఈ పోటీలో నేను ఒక పక్క.. ఈ మహిళ ఒక పక్క నిలబడుతున్నారు. కాబట్టి.. ఎవరు నా టీమ్‌లో చేరాలి అనుకుంటున్నారో నా పక్కకు రమ్మని రాజ్ అంటాడు. దీంతో ఎంప్లాయిస్ అందరూ కావ్య వైపుకు వెళ్తారు. దీంతో కావ్య, శ్రుతి నవ్వుతారు. దీంతో రాజ్ ఫ్రస్ట్రేట్ ఫీల్ అవుతారు. ఇన్నాళ్లూ నేను ఇచ్చిన బోనస్‌లు, ఇంక్రిమెంట్లు దొప్పి.. కాకులన్నీ ఆ చెట్టు మీదకు వాలతారా? చెప్తాను నా స్టైల్‌లో మీకు బుద్ధి చెప్తానని రాజ్ అంటాడు. వెంటనే సెక్యూరిటీని పిలిచి.. ఇందులో మా ఇద్దరి పేర్లు రాసి.. ఇందులో వేయి.. మీరందరూ ఇందులో తలో ఒక చీటీ రాయండి. అందులో ఎవరి పేరు వస్తే వాళ్లు వాళ్ల పక్కకు రావాలని రాజ్ కండీషన్ పెడతాడు. ఇక ఎవరివారు సపరేట్ అవుతారు. ఈ క్షణం నుంచి మీరంతా నా ఆధ్వర్యంలో బెస్ట్ డిజైన్స్ వేసి.. ఆ కాంట్రాక్టర్స్‌ని ఒప్పిస్తే నన్ను సిఈవో చేసిన తర్వాత మీ అందరికీ శాలరీలు పెంచుతానని అంటాడు. ఇక ఎలక్షన్స్‌లో నాయకులు ప్రజలను ఆకట్టుకున్నట్టు.. మాట్లాడతాడు రాజ్.

కావ్య, రాజ్‌లను దెబ్బకొట్టేందుకు అనామిక ప్లాన్..

ఆ తర్వాత జగదీష్ చంద్రతో మీట్ అవుతుంది అనామిక. తన గురించి చెబుతుంది. సరే నన్ను ఎందుకు కలవాలి అనుకుంటున్నారు? అని జగదీష్ అడుగుతాడు. మీరు ఓ గుడిని జీర్ణోద్ధారణ చేయాలి అనుకుంటున్నారని.. దేవుడి అందుకు నగలు, కిరీటాలు చేయించాలి అనుకుంటున్నారు అని కూడా తెలిసిందని అనామిక అంటే.. అర్థమైంది ఆ కాంట్రాక్ట్ ఆల్రెడీ నేను స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఇచ్చానని జగదీష్ అంటే.. అలా చేసే మీరు తప్పు చేశారని అనామిక అంటుంది. తప్పు చేయడం ఏంటి? ఇప్పుడు మార్కెట్లో అదే కదా ఫస్ట్ కంపెనీ అని జగదీష్ అంటాడు. రీసెంట్‌గా అవార్డు మా కంపెనీకే వచ్చింది. అందుకు కారణం ఏంటో తెలుసా? ఆ ఫ్యామిలో గొడవలు. దాని వల్ల రాజ్ సరిగా పని చేయలేక పోవడం లేదు. కానీ రాజ్ కూడా కావ్యతో కూడా కలిసి పని చేస్తున్నాడు కదా అని జగదీష్ అంటే.. వాళ్లు పేరుకే భార్యాభర్తలు.. భార్యని ఎప్పుడో వదిలేశాడు. కావ్య పుట్టింట్లో ఉంటూ ఆఫీస్‌కి వస్తుంది. ఇద్దరి మధ్య అన్ని గొడవలు ఉన్నప్పుడు కలిసి ఎలా పని చేస్తారు? ఆలోచించమని అనామిక అంటుంది.

ఇవి కూడా చదవండి

అనామిక ప్లాన్‌కి ఓకే అన్న జగదీష్..

ఎప్పుడో మీ పూర్వీకులు కట్టించిన గుడికి పూర్వ వైభవం తీసుకు రావాలి అనుకుంటున్నారు. మరి అలాంటప్పుడు వాళ్లకు వచ్చి.. మీ పరువు తీసుకోవడం ఎందుకు? మా కంపెనీకి వచ్చి పరువు నిలబెట్టుకోమని అడుగుతుంది అనామిక. దీంతో ఆలోచనలో పడతాడు జగదీష్. నువ్వు చెప్పింది 100 శాతం నిజమే. కానీ నాకు టైమ్ కావాలని అంటాడు. సరే సర్ ఒక్క ఫోన్ చేయమని అనామిక చెప్పి వెళ్తుంది. మరోవైపు లిరిక్ రైటర్ లక్ష్మీ కాంతం.. ఓ పాట గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే కళ్యాణ్ వస్తాడు. రావయ్యా రా.. నిన్నంతా టీవీల్లో నీ పేరు మారమ్రోగిపోయింది కదా అని అంటాడు. అందుకు కళ్యాణ్ ఏమీ మాట్లాడడు. అవన్నీ వద్దు అనుకొనే ఇంటి నుంచి బయటకు వచ్చేశాను. మీరే ఎలాగైనా అసిస్టెంట్‌గా అవకాశం ఇవ్వాలని కళ్యాణ్ అడుగుతాడు. సరేలే.. నీ విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నా. నిన్ను అసిస్టెంట్‌గా పెట్టుకోవడానికి నేను నిర్ణయించుకున్నా. కానీ నాకు కొన్ని కండీషన్స్ ఉన్నాయని లిరిక్ లక్ష్మీ అంటాడు.

లిరిక్ లక్ష్మీ అగ్రిమెంట్..

ముందు నా దగ్గర చేసిన అసిస్టెంట్లు అందరూ పని చేసి.. వాళ్లను వాడేసుకుంటున్నానని బ్యాడ్ నేమ్ తీసుకొచ్చారు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి అనుకుంటున్నా. అలాగే అగ్రిమెంట్ చేయమని అంటాడు. మూడేళ్ల పాటు నువ్వు నా దగ్గరే పని చేస్తానని అగ్రిమెంట్ చేయాలని లిరిక్ లక్ష్మీ అడుగుతాడు. వీటికి నువ్వు ఒప్పుకుంటేనే అసిస్టెంట్‌గా చేస్తానని లిరిక్ లక్ష్మీ అంటాడు. అందుకు కళ్యాణ్ ఓకే అని చెప్తాడు. ఇక లిరిక్ లక్ష్మీ అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకం చేయించుకుంటాడు. ఆ తర్వాత కళ్యాణ్ వెళ్లిపోతాడు. కోట్ల ఆస్తి పక్కన పెట్టి.. కళ కోసం తపన పడుతున్నాడు. ఏదో ఒక రోజు గొప్పోడు అవుతాడని లిరిక్ లక్ష్మీ అంటాడు.

ఇష్టపడి పని చేయమన్న కావ్య..

ఆ తర్వాత రాజ్.. ఎంప్లాయిస్‌ని పిలిచి కౌన్సిలింగ్ ఇస్తాడు. రాజ్ మాట్లాడేది శ్రుతి వింటుంది. అది గమనించి.. గుంట నక్కలతో మరింత అప్రమత్తంగా ఉండాలని.. ఉద్యోగుల మీద వరాలు కురిపిస్తాడు. అందంతా వింటుంది శ్రుతి. మరోవైపు కావ్య తన ఉద్యోగులతో మాట్లాడుతూ.. కంగారు పడి పని చేసే బదులు.. మనసు పెట్టి చేయాలని చెబుతుంది. అది విని శ్రుతి షాక్ అవుతుంది. మీరు ఇక్కడ నీతి ప్రవచనాలు ఇస్తున్నారు. కానీ ఆయన యుద్ధానికి వెళ్లినట్లు ఆవేశాన్ని నూరి పోస్తున్నారని శ్రుతి చెబుతుంది. అయితే ఏముందని కావ్య అంటుంది. మీరు కూడా గెలవాలంటే అలాంటి వాగ్దానాలు చేయాలని శ్రుతి అంటే.. నేను కూడా ఓ ఎంప్లాయినే కాబట్టి ఆయన ఎప్పుడూ ఈ ఆస్తికి వారసుడేనని కావ్య అంటుంది. ఇక ఇక్కడితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..