Brahmamudi, July 29th Episode: ఈ రోజు ఎపిసోడ్‌లో ట్విస్టుల మీద ట్విస్టులు.. పాపం కవి..

|

Jul 29, 2024 | 1:26 PM

ఈ రోజు బ్రహ్మముడి సీరియల్‌లో.. అప్పూని పెళ్లి చేసుకుంటారని మీ అన్నయ్యకి చెప్పారా? లేదా మీ అన్నయ్య భ్రమ పడుతున్నారా? అని అడుగుతుంది కావ్య. వదినా అప్పూ సంతోషమే నాకు ముఖ్యం. ఎవరు ఏం అనుకుంటున్నారో అన్నది అనవసరమైన విషయం. అప్పూకి ఏది ఇష్టమో అదే చేయండి. ఆ అబ్బాయిని ఇష్ట పడింది కదా.. అదే చేయమని కళ్యాణ్ చాలా బాధగా చెప్తాడు. అంటాడు. హమ్మయ్యా ఉన్న అనుమానం కూడా వచ్చింది. సరే ఇప్పుడు మీరు నాకు ఒక మాట..

Brahmamudi, July 29th Episode: ఈ రోజు ఎపిసోడ్‌లో ట్విస్టుల మీద ట్విస్టులు.. పాపం కవి..
Brahmamudi
Image Credit source: Disney Hotstar
Follow us on

ఈ రోజు బ్రహ్మముడి సీరియల్‌లో.. అప్పూని పెళ్లి చేసుకుంటారని మీ అన్నయ్యకి చెప్పారా? లేదా మీ అన్నయ్య భ్రమ పడుతున్నారా? అని అడుగుతుంది కావ్య. వదినా అప్పూ సంతోషమే నాకు ముఖ్యం. ఎవరు ఏం అనుకుంటున్నారో అన్నది అనవసరమైన విషయం. అప్పూకి ఏది ఇష్టమో అదే చేయండి. ఆ అబ్బాయిని ఇష్ట పడింది కదా.. అదే చేయమని కళ్యాణ్ చాలా బాధగా చెప్తాడు. అంటాడు. హమ్మయ్యా ఉన్న అనుమానం కూడా వచ్చింది. సరే ఇప్పుడు మీరు నాకు ఒక మాట ఇవ్వాలని కావ్య అడుగుతుంది. ఏంటి వదినా.. నేను ఆ పెళ్లికి రాకూడదని చెప్తారు అంతేగా.. అని కళ్యాణ్ అంటాడు. కాదు మీరు పెళ్లి చేసుకుంటానని నాకు మాట ఇవ్వండి. మీరు ఈ పెళ్లికి ఒప్పుకుంటేనే.. కొత్త జీవితం మొదలు పెడతారని కావ్య అంటుంది. వదినా నేను ఏ పరిస్థితిలో ఉన్నాను? మీరు ఏం అడుగుతున్నారు? నా మనసుకు అయినా గాయం ఇంకా మానలేదు. ఇప్పుడు ఇంకో పెళ్లి చేసుకుని అన్నీ మర్చిపోవాలా? అది అంత సులువుగా జరుగుతుందా? అని కళ్యాణ్ అంటాడు.

మీరు పెళ్లికి ఒప్పుకోవాలి కవి గారు..

లేదు కవి గారు మీ పెళ్లి బాధ్యత నేనే తీసుకున్నాను. మీ లైఫ్ మళ్లీ బావుండాలి అంటే.. మీరు ఇవన్నీ మర్చిపోయి పెళ్లి చేసుకోవాలని కావ్య అంటుంది. వదినా నా గురించి అంతా తెలిసి.. అన్నీ చూసి కూడా ఇలా ఎలా అడుగుతున్నారు? మళ్లీ నన్ను నిప్పుల గుండంలోకి తోసేద్దాం అనుకుంటున్నారా? అని కళ్యాణ్ బాధగా అడుగుతాడు. నాకు మీరు ఏ మాత్రం విలువ ఇచ్చినా ఈ పెళ్లికి మీరు ఒప్పుకోవాలని కావ్య అని వెళ్తుంది. కళ్యాణ్ అంతా అయోమయంలో ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు ధాన్యలక్ష్మి రెడీ అవుతూ ఉంటుంది. ధాన్య లక్ష్మి దగ్గరకు వచ్చిన రుద్రాణి.. ఎప్పుడూ నీ మేకప్, నగలేనా ఇంట్లో ఏం జరుగుతుందో ఆలోచించవా అని అంటుంది. అసలు విషయం ఏంటి? చెప్పు అని ధాన్య లక్ష్మి అంటుంది. కళ్యాణ్‌ని పెళ్లికి ఒప్పించమని ఆ కావ్యకి చెప్పి 24 గంటలు అయిపోయింది కదా.. మరి ఒప్పించిందో లేదో కనుక్కున్నావా? అని రుద్రాణి అంటుంది. దాని కోసమే ఎదురు చూస్తున్నా.. వెళ్లి అడుగుతాను అని ధాన్య లక్ష్మి అంటే.. అడగడం కాదు.. గట్టిగా అదే మాట మీద కూర్చోమని రుద్రాణి అంటే.. నువ్వే చూస్తావు కదా అని ధాన్య లక్ష్మి అంటుంది.

ధాన్య లక్ష్మికి స్వప్న సెటైర్లు.

హాలులో అందరూ కూర్చొని ఉంటారు. కావ్య అందరికీ కాఫీ ఇస్తుంది. అప్పుడే ధాన్య లక్ష్మి పై నుంచి దిగుతుంది. ఏయ్ కావ్యా.. అని గట్టిగా పిలుస్తుంది. కావ్య పట్టించుకోకుండా ఉంటుంది. పిలుస్తుంటే పలకవేంటి? అని ధాన్య లక్ష్మి అంటే.. నన్ను పిలవాలి కానీ.. అరిస్తే ఎందుకు పలుకుతాను అని కావ్య అంటుంది. నాకు ఇచ్చిన మాట ఏం చేశావ్? కళ్యాణ్‌ని పెళ్లికి ఒప్పించావా? అని ధాన్య లక్ష్మి అడుగుతుంది. పక్క నుంచి స్వప్న సెటైర్లు వేస్తుంది. ఏయ్ స్వప్న ఇది మా ఫ్యామిలీ విషయం. నువ్వు మధ్యలోకి రాకు అని ధాన్య లక్ష్మి అంటుంది. మీరు మాట్లాడుతుంది మా చెల్లితో అని స్వప్న అంటుంది. సరే నువ్వు కళ్యాణ్‌తో మాట్లాడావా? వాడిని పెళ్లికి ఒప్పించావా అని ధాన్య లక్ష్మి అంటే.. కళ్యాణ్ మనసులో అప్పూ లేదు. పెళ్లికి ఒప్పిస్తాను అని కావ్య అంటుంది.

ఇవి కూడా చదవండి

కళ్యాణ్ కోసం రాజ్ తపన.. కావ్య పోరాటం..

ఎవరినీ దేనికీ ఒప్పించాల్సిన పని లేదు. కళ్యాణ్ మనసులో అప్పూ ఉందని రాజ్ అంటాడు. దానికి అందరూ షాక్ అవుతారు. నేను కళ్యాణ్‌కి అప్పూని ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా అని రాజ్ అంటే.. అందరూ మరింత షాక్ అవుతారు. ఏం అంటున్నావ్? రాజ్ ఏంటి ఇదంతా అని ఇందిరా దేవి అంటే.. వాడి మనసులో అప్పూ ఉందని నాకు అర్థమైందని రాజ్ అంటాడు. ఏవండీ మీరు కవి గారి మనసులో దూరి తెలుసుకున్నారా? మీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? మీరేంటండీ.. కవి గారి మనసులో అప్పూ ఉందని అంటారు. నేను కవి గారిని స్పష్టంగా అడిగాను. అప్పూ లైఫ్ బాగుండాలని కోరుకుంటున్నారు అంతే అని కావ్య సీరియస్‌గా చెబుతుంది. వాడి లైఫ్ బాగుండాలని నేను కోరుకుంటున్నా కాబట్టి అప్పూతోనే పెళ్లి జరిపించాలని అనుకుంటున్నా అని రాజ్ అంటాడు.

అగ్గిరాజేసిన రుద్రాణి.. ధాన్య లక్ష్మి రచ్చ..

ఆగండి.. ఏంటిది.. ఇద్దరికి ఇద్దరూ వాడి విషయంలో ఏవేవో మాట్లాడుకుంటున్నారు. నేను కళ్యాణ్‌కి వేరే అమ్మాయితో పెళ్లి చేయాలి అనుకుంటున్నా. మీరు ఆ విషయం గుర్తు పెట్టుకోమని ధాన్య లక్ష్మి అంటుంది. విన్నారు కదా.. మీరు నేను ఎంత వాదించుకున్నా.. ఆవిడ చేయాలి అనుకున్నదే చేస్తారు. ఎందుకు వాదనలు? అని కావ్య అంటుంది. అయినా అర్థం చేసుకోని ధాన్య లక్ష్మి.. మళ్లీ కావ్యనే తప్పు పడుతుంది. వెనకాల ఉండి నువ్వే ఇదంతా నడిపిస్తూ.. ఏమీ తెలీని దానిలా నాటకాలు ఆడుతున్నావా? అని ధాన్య లక్ష్మి నోరు పారేసుకుంటుంది. ధాన్య లక్ష్మి.. కావ్య ఏం మాట్లాడుతుంది? రాజ్ ఏం మాట్లాడుతున్నాడో విన్నావు కదా.. అంతా విని కూడా కావ్యనే ఎందుకు తప్పు పడుతున్నావ్? అని అపర్ణ అంటుంది.

మీకు మర్యాదగా ఉండదు..

కళ్యాణ్ పెళ్లి విషయంలో నేనే నిర్ణయం తీసుకున్నా.. ఇందులో కావ్య తప్పు లేదని రాజ్ అంటాడు. అయినా ధాన్య లక్ష్మి వెనక్కి తగ్గదు. కావ్యదే తప్పని అంటుంది. పెళ్లై ఇంట్లో అడుగు పెట్టగానే ఇంటి పెద్దలు ఎవరో కనిపెట్టి తాతయ్య, నానమ్మల మంచి చేసుకుంది. ఎవరి మాయ మాటలకు లొంగని, మీ అమ్మని కూడా బుట్టలో పడిపోయింది. ఎలా ఉండే నిన్ను ఎలా చేసి కొంగున కట్టుకుంది. కావ్య మాయలో పడి నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకే తెలియడం లేదు. కావ్య చెప్పడం వల్ల రాజ్ ఇలా మాట్లాడుతున్నాడని ధాన్య లక్ష్మి నానా రచ్చ చేస్తుంది. మీ కుటుంబం అంతా ఇంతే అని కావ్య ఫ్యామిలీని అంటుంది. మా కుటుంబం జోలికి వస్తే మర్యాదగా ఉండదని కావ్య వార్నింగ్ ఇస్తుంది.

రాజ్ నా సపోర్ట్ నీకే అన్న స్వప్న..

ఇదంతా ఎందుకు కళ్యాణ్‌ని పిలిచి అడిగితే సరిపోతుంది. కళ్యాణ్ ఒప్పుకుంటే మాత్రం నా సపోర్ట్ నీకే రాజ్ అని స్వప్న అంటుంది. సరే ఇప్పుడే వెళ్లి కళ్యాణ్‌ని తీసుకొస్తా అని పైకి వెళ్లి కళ్యాణ్‌ని తీసుకొస్తాడు రాజ్. చెప్పరా.. నీ మనసులో మాట బయట పెట్టు. నువ్వు అప్పూని ప్రేమించడం లేదా? ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదా? నీ మనసులో ఏం ఉందో ధైర్యంగా బయట పెట్టు. నేను నీకు సపోర్ట్‌గా ఉంటాను అని రాజ్ అంటే.. కవి గారు మీరు ఇందాక అప్పూని ఫ్రెండ్‌గానే చూస్తున్నా అని నాకు చెప్పారు కదా.. అదే అందరికీ చెప్పండి అని అంటుంది కావ్య.

మా మధ్య ఉంది కేవలం స్నేహం మాత్రమే..

ఇన్నాళ్లూ అప్పూతో నీకు ఉంది స్నేహం అని నాది, అనామిక నోరు మూయించావు కదా.. ఇప్పుడు దాన్ని పెళ్లి చేసుకోవడం ఏంటి? అని ధాన్య లక్ష్మి సీరియస్ అవుతుంది. అప్పుడే కళ్యాణ్ చెప్పబోతాడు. ఆగురా.. ఒకసారి అనామికను పెళ్లి చేసుకునే నరకం చూశావు. ఇప్పుడే ఆ నరకం నుంచి బయట పడ్డావు. మళ్లీ నువ్వు ఆ నరకంలోకి వెళ్లకు. నీ మనసుకు, నీకు ఇష్టమైంది ఏంటో బాగా ఆలోచించి చెప్పమని ప్రకాశం సలహా ఇస్తాడు. మీరందరూ సలహాలు చెప్పారు. మీకు నచ్చింది చెప్పమని మీరందరూ అన్నారు. కానీ నాకు నచ్చిందే చెప్తున్నా. నేను అప్పూని ప్రేమించడం లేదు. మా మధ్య ఉంది కేవలం స్నేహమే. ఇకనైనా ఈ గొడవలు ఆపమని కళ్యాణ్ అంటాడు. రేయ్ కళ్యాణ్ ఏంట్రా ఏం చెప్తున్నావ్? నన్ను మోసం చేసినా పర్వాలేదురా.. కానీ నీ మనసును మాత్రం మోసం చేసుకోకు అని అంటాడు రాజ్. ఇక ఇక్కడితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.