ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. ప్రకాశం దగ్గరకు వచ్చి ధాన్యలక్ష్మి తన బాధలు చెప్పుకుంటుంది. టిఫిన్‌కి ఓన్లీ ఇడ్లీ మాత్రమే చేసిందని అంటుంది. అవును నేనూ తిన్నాను కదా.. ఇడ్లీ కొబ్బరి చట్నీ చాలా బాగుందని ప్రకాశం అంటే.. ఇలా మాట్లాడటానికి మీకు సిగ్గుగా లేదా? కోట్ల ఆస్తి పెట్టుకుని చిల్లరగా ఒక టిఫిన్ చేస్తాను.. అదే తినాలి అని రూల్స్ పెడితే మీకు అవమానంగా అనిపించడం లేదా? అని ధాన్యలక్ష్మి అంటే.. కావ్య చెప్పిన దానిలో లాజిక్ ఉందనిపించింది. అందుకే తిన్నాను.. నువ్వు కూడా వెళ్లి తినమని ప్రకాశం అంటాడు. నేను టిఫిన్స్ ఆన్ లైన్‌లో ఆర్డర్ పెట్టుకుంటానని ధాన్యలక్ష్మి ఆర్డర్ పెట్టుకుంటుంది. ఆ తర్వాత అపర్ణ దగ్గరకు వెళ్లిన కావ్య.. మీకు కూడా నా మీద కోపం వచ్చిందా.. ఇంటి విషయంలో నేను కొంచెం కఠినంగా ఉన్నాను కదా అందుకు అని అడుగుతుంది. నువ్వు ఏం చేసినా నువ్వు ఒక అర్థం, కారణం ఉంటుందని నాకు తెలుసు. ఒకవేళ అది తప్పు అయితే నువ్వు చేయవు కదా.. మనిషిని అర్థం చేసుకోకపోతే ఏ బంధానికి అర్థం ఉండదు. కానీ ఒక్క విషయం కూడా అర్థం కావడం లేదు. ఆకలి అంటే ఆలోచించకుండా పెట్టే నువ్వు.. నీ సొంత ఇంట్లోనే ఇలా చేస్తున్నావు అంటే ఏదో బలమైన కారణం ఉందని నేను అనుకుంటున్నా.. నీకు నచ్చింది చేయమని అపర్ణ అంటుంది. అందుకు కావ్య థాంక్స్ చెబుతుంది.
ఇక రుద్రాణి, ధాన్యలక్ష్మి, రాహుల్‌లు కలిసి టిఫిన్ ఆర్డర్ పెట్టుకుని తింటారు. కావ్యని చూసి మరీ రెచ్చిపోతారు. పొంగల్, మైసూర్ బజ్జీలు, దోశలు, గారెలు అన్నీ తెప్పించాను. ఏం కావాలన్నా తినేసేయండి.. తృప్తిగా తినండి.. ఎక్కువైతే చెత్తలో పడేయమని రుద్రాణి అంటుంది. మొహమాట పడకుండా తినమని అంటుంది. ఇక రాహుల్, రుద్రాణి, ధాన్యలక్ష్మిలు తినడం చూసి స్వప్న నవ్వుతుంది. ఎందుకు నవ్వుతున్నావు అని రుద్రాణి అడుగుతుంది. మీరు ఆకలితో తింటున్నట్టు లేదు.. మా కావ్య మీద కడుపు మంటతో తింటున్నట్టు ఉంది. కాస్త నిదానంగా తినండి. నువ్వు ఆ చెత్త ఇడ్లీలు ఏం తింటావులే కానీ.. మాతో కలిసి ఇవన్నీ తినమని ధాన్యలక్ష్మి అంటే.. వద్దు ఆంటీ.. కడుపుతో ఉన్నాను కదా.. అడ్డమైన గడ్డి తినొద్దని డాక్టర్ గడ్డి పెట్టిందని స్వప్న అంటుంది. రుద్రాణీ ఎవరికైనా తినాలనిపిస్తే తినొచ్చు.. కావాల్సినంత ఉందని ధాన్యలక్ష్మి అంటే.. అవసరానికి మించింది ఉన్నది ఏదైనా విషంతో సమానమని కావ్య అంటుంది. వీళ్లను ఎంత కంట్రోల్ చేద్దామంటే అంతకంతుకు రెచ్చిపోతున్నారు. ఎలా వీళ్లను కంట్రోల్ చేసేది అంటూ కావ్య మనసులో అనుకుంటుంది.
ఆ తర్వాత సీతారామయ్య ఆస్పత్రి బిల్ కట్టాలని కంగారు వెళ్తుంది. అప్పటికే ఆస్పత్రిలో పెద్దాయనను చూసి ఇందిరా దేవి బాధ పడుతుంది. అప్పుడే కావ్య, రాజ్‌లు వస్తారు. ఏంటి అమ్మమ్మా.. ఇక్కడ ఉంటే ఇంకా బాధ పడతారనే కదా.. ఇంట్లో బలవంతంగా ఉంచింది అని కావ్య అంటే.. ఆయనకు బాలేనప్పుడు ఎలా వదిలేసి ఉంటాను అని ఇందిరా దేవి అంటుంది. అరేయ్ కళ్యాణ్ ఆస్పత్రి వాళ్లు బిల్ కట్టాలని మెయిల్ పంపించారు.. అందుకే చెక్ తెచ్చాను కట్టేయమని రాజ్ కళ్యాణ్‌కి ఇస్తాడు. ఇక మధ్యహ్నం భోజనానికి ధాన్యలక్ష్మి, రుద్రాణిలు వస్తారు. వంట ఏం చేశావని అడుగుతారు. తోటకూర పప్పు, మజ్జిగ పులుసు అని శాంతా చెబుతుంది. ఏంటి ఈ గడ్డి తినాలా మేము? చికెన్, ఫిష్, ఫ్రాన్స్ వంటివి ఏమీ చేయలేదా అని అడుగుతారు. లేదు కావ్య అమ్మగారు చేయమన్నారని శాంతా చెబుతుంది. ఈ గడ్డి తినే ఇంట్రెస్ట్ మాకు లేదు.. మేము తినం.. వెళ్లి చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకుంటామని వెళ్తారు. ఇక గదిలోకి వెళ్లి ఆర్డర్ పెట్టుకుంటే కార్డులు పని చేయవు. అంటే మన కార్డులు ఆ మామిడి పింది మొహంది బ్లాక్ చేసింది అన్నమాట.. అని రుద్రాణి తిడుతుంది.
ఇక ఇద్దరూ కలిసి సుభాష్ దగ్గరకు వెళ్తారు. అక్కడే సుభాష్ ల్యాప్ ట్యాప్ కూడా పని చేయదు. ఏంటి నీ ల్యాప్ ట్యాప్ కూడా పని చేయడం లేదా.. మా క్రెడిట్ కార్డులు కూడా పని చేయడం లేదని రుద్రాణి అంటుంది. నీ కోడలు ఆస్తి చేతికి వచ్చాక.. మా కార్డులు బ్లాక్ చేసిందని చెబుతారు. వెంటనే సుభాష్ బ్యాంక్ వాళ్లకు ఫోన్ చేసి కార్డులు పని చేయడం లేదని చెబితే.. కార్డులు బ్లాక్ చేయమని ఆఫీస్ నుంచి మెయిల్ వచ్చిందని అతను చెబుతాడు. దీంతో సుభాష్ షాక్ అవుతాడు. కావాలనే మా కార్డులను బ్లాక్ చేసింది. మాకు చాలా అవమానం జరిగింది అంటూ రుద్రాణి, ధాన్యలక్ష్మిలు రెచ్చిపోతారు. కావ్య ఎందుకు ఇలా చేసిందో నేను కనుక్కుంటానని సుభాష్ అంటాడు. కావ్య, రాజ్‌లు ఆఫీస్‌కి వెళ్తూ ఉంటే.. బ్యాంక్ నుంచి ఫోన్ వస్తుంది. ఆస్పత్రి బిల్ పే చేయడానికి 5 లక్షల చెక్ వచ్చిందని అంటాడు. అవును నేను పంపించాను క్లియర్ చేయమని రాజ్ అంటే.. అకౌంట్స్ ఫండ్స్ జీరో చూపిస్తున్నాయని అంటాడు. అందేంటి అని రాజ్, కావ్యలు షాక్ అవుతారు. ఆ తర్వాత మేనేజర్‌కి ఫోన్ చేసి ఎంత డబ్బులు డ్రా చేశారని రాజ్ అడిగితే.. 15 లక్షలే ఉన్నాయి. అవే డ్రా చేశామని అంటారు. సరే అని రాజ్ ఫోన్ పెట్టేస్తాడు. అదేంటి? 10 లక్షలు ఏమయ్యాయి అని ఆలోచిస్తూ ఉంటారు.
వచ్చేటప్పుడు మా అక్కకి చెక్ ఇచ్చి వచ్చాను. ఒకవేళ అది ఏమన్నా డ్రా చేసిందేమో కనుక్కుంటా అని కావ్య అంటుంది. కానీ స్వప్న ఫోన్ లిఫ్ట్ చేయదు. ఈలోపు రుద్రాణి, ధాన్యలక్ష్మిలు ఆకలితో అలమటిస్తూ ఉంటారు. ఇక ఆగడం నా వల్ల కాదు.. పదా వెళ్లి ఆ గడ్డి తినేసి వద్దామని అనుకుంటారు. కిందుకు వెళ్లి శాంతాను అన్నం పెట్టమంటారు. అయ్యో మీరు తినరనుకుని వేస్ట్ చేయడం ఎందుకు అని ఇప్పుడే ముష్టి వాళ్లకు వేసేశానని శాంతా అంటుంది. ఏంటి అని షాక్ అవుతారు. ఇక ఈ రోజుతో ఇవాళ్టి ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్‌లో ఇంట్లో మరో యుద్ధం మొదలవుతుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..